Umesh Katti Passed Away: కర్ణాటక మంత్రి ఉమేశ్ కత్తి (61) గుండెపోటుతో మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఉమేశ్ కత్తి మృతి చెందడంతో యావత్ రాష్ట్రం షాకైంది.
ఇలా జరిగింది
మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఛాతీ నొప్పి రావడంతో ఉమేశ్ కత్తి కుప్పకూలిపోయారు. ఆ సమయంలో ఉమేశ్.. డాలర్స్ కాలనీలోని తన నివాసంలో ఉన్నారు. వెంటనే చికిత్స కోసం ఉమేశ్ కత్తిని.. రామయ్య ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్సకు ఆయన శరీరం సహకరించకపోవడంతో రాత్రి 11.40 నిమిషాలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ప్రొఫైల్
- ఉమేశ్ కత్తి స్వస్థలం బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా ఖడకలాట గ్రామం.
- ఆయనకు భార్య లీల, కుమారుడు నిఖిల్, కుమార్తె స్నేహా ఉన్నారు.
- బెళగావి జిల్లా హుక్కేరి నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.
- ఐదు సార్లు మంత్రిగా సేవలందించారు.
- ప్రస్తుతం అటవీ, ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా ఉన్నారు.
మోదీ దిగ్భ్రాంతి
ఉమేశ్ కత్తి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Also Read: Suella Braverman: బ్రిటన్ హోంమంత్రిగా భారత సంతతి మహిళ