Karthika Deepam September 7th Episode 1451 (కార్తీకదీపం సెప్టెంబరు 7 ఎపిసోడ్)


కార్తీక్, మోనితని ఇంటికి తీసుకొచ్చాడు. మోనిత చాలా నీరసంగా ఉన్నావని బాధపడిపోతాడు కార్తీక్.ఎదురింటి ఆమె ఉందా అని మోనిత అడిగితే.. ఏం మళ్లీ ఇడ్లీలు తింటావా అని అడుగుతాడు. అంతపని చేస్తుంది అనుకోలేదు కార్తీక్ అని మోనిత అంటే.. అందుకే వార్నింగ్ ఇచ్చి పంపించేశానని చెబుతాడు కార్తీక్. తన కోసం కార్తీక్ దీపని పరాయి స్త్రీ లా చూసి వార్నింగ్ ఇచ్చాడా అని సంతోషపడుతుంది మోనిత.  
మోనిత: నువ్వు ఇంత తొందరగా కార్తీక్ ని వదిలేస్తావని అనుకోను.. ఏదో కొత్త ప్లాన్ తో వస్తావని నాకు తెలుసు. కానీ అప్పటికి మేము ముంబై చెక్కేస్తాము కదా అని ఆనందపడిపోతుంది. 


Also Read: శౌర్య-వారణాసిని చూసిన మోనిత, డాక్టర్ బాబు ముందు నిజాయితీ నిరూపించుకున్న వంటలక్క
హ్యాపీ బర్త్ డే శౌర్య అని హిమ..ఫొటో చూస్తూ బాధపడుతుంది. అప్పుడు సౌందర్య, ఆనందరావు అక్కడికి వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు. అప్పుడు హిమ, ఈరోజు నా పుట్టినరోజు కదా నా కోసం నాలుగు గంటలు సమయం కేటాయించండి. మనం శౌర్య దగ్గరికి వెళ్లి గిఫ్ట్ ఇద్దాం...అప్పుడైనా శౌర్య మనసు మారుతుందని అంటే..శౌర్య మారదమ్మా అని చెబుతుంది సౌందర్య. 
మరోవైపు  దీప...గుడికి వచ్చి పిల్లల పుట్టిన రోజు సందర్భంగా అర్చన చేయిస్తుంది. మేము లేకుండా పిల్లలు పుట్టిన రోజు జరుపుకుంటున్నారో లేదో... వాళ్లు ఆనందంగా గడపాలి, ఈ సమస్యలన్నీ తీరిపోయి మళ్లీ మేమంతా దగ్గరవ్వాలి అని దేవుడిని కోరుకుంటుంది. ఆ తర్వాత కార్లో వెళుతుండగా..మళ్లీ శౌర్య దగ్గరకు తీసుకెళ్లమని అడుగుతుంది. సౌందర్య మాత్రం వద్దమ్మా అని చెబుతుంది.అటు శౌర్య కూడా వారణాసితో కలసి గుడికి వెళుతుంది.  అన్ని బాగుంటే వచ్చే సంవత్సరం ఇద్దరం కలిసి పుట్టిన రోజు చేసుకోండి అని అంటుంది. 


Also Read: తగ్గేదెలే అంటోన్న మోనిత, ముంబయికి డాక్టర్ బాబు- కుమిలి కుమిలి ఏడుస్తున్న దీప


శౌర్య,వారణాసి తో కలిసి గుడికి వెళ్లి..ఈ రోజు నా పుట్టినరోజు వారణాసి అంటుంది. అదే సమయంలో దీప కూడా అదే గుడిలో ఉంటుంది. కార్తీక్,మోనిత ఇద్దరూ ఆ గుడికి వస్తారు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని కార్తీక్ అడగితే 
మోనిత: నువ్వు దీపతో మాట్లాడను అని నాకు దేవుడి మీద ఒట్టేసి చెప్పు కార్తీక్, నాకు నమ్మకం లేదు...నీకేమైనా అయితే నేను తట్టుకోలేను 
కార్తీక్: ఈ కాలంలో కూడా ఏం చేస్తున్నావు మోనిత? అసలే నాకు ఏ విషయం గుర్తుండదు.ఇప్పుడు ప్రమాణం చేసినట్టు కూడా మర్చిపోతాను 
మోనిత కార్తీక్ నీ బలవంతంగా లోపలికి తీసుకువెళ్లడం చూసి దీప అక్కడికి వస్తుంది. మీరు నాతో మాట్లాడకూడదు అన్నంత తప్పు నేను చేయలేదు డాక్టర్ బాబు. కావాలంటే నేను దేవుడి మీద ఒట్టేస్తాను అని దేవుడి మీద ప్రమాణం వేస్తుంది దీప.
మోనిత: ఇలా తప్పుచేసి ప్రమాణం చేయడం అలవాటే కదా అని అంటుంది.
దీప: నీకు నిన్న ఒంట్లో బాలేదు, హాస్పిటల్ కి నిజంగానే ఫుడ్ పాయిజన్ అయ్యి  వెళ్ళినట్టు నువ్వు ప్రమాణం చేయు అని అంటుంది  
అదే సమయంలో మోనిత..శౌర్యని చూస్తుంది. శౌర్య ఏంటి ఇక్కడుంది....దీప కి శౌర్య వచ్చినట్టు తెలుసా? మొన్న ఆంటీ, అంకుల్ వచ్చారు. ఇప్పుడు శౌర్య కనిపించింది, ఈ దీపా వెనకాలే ఉంటుంది. అన్ని దిక్కులు మూసుకుపోయాయి. వెంటనే ఈ ఊరు నుంచి చెక్కేయాలి అని అనుకుంటుంది.
కార్తీక్: ఏం చూస్తున్నావ్ మోనిత 
ఎపిసోడ్ ముగిసింది