ఖుషి చాలా సంతోషంగా ఇంటికి వస్తుంది. అన్నయ్యకి రాఖీ కట్టాను అని సంబరంగా ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. యశ అక్కడ జరిగింది అంతా కూడా ఇంట్లో చెప్తాడు. ఖుషి తన అన్నయ్యకి రాఖీ కట్టాలని ఎంత ఎదురు చూసిందో ఆదిత్య కూడా అక్కడ అలాగే ఎదురుచూస్తున్నాడని మాకు అక్కడికి వెళ్ళినాకే అర్థం అయ్యిందని వేద చెప్తుంది. అభి, మాళవిక మాటలకి ఎక్కడ కంట్రోల్ తప్పుతావో అని మీ నాన్న చాలా టెన్షన్ పడుతూ ఉన్నారని మాలిని అంటుంది. కంట్రోల్ చేసుకుంది నేను కాదు వేదనే కంట్రోల్ చేసింది తాను లేకపోయి ఉంటే పెద్ద గొడవ జరిగేది. మాళవిక అమ్మా అని పిలవాలని కండిషన్ పెట్టగానే ఖుషిని తీసుకుని వచ్చేద్దామని అనుకున్నా కానీ వేదనే అడ్డుపడిందని యష్ చెప్తాడు. ఖుషి సంతోషం కోసం ఎం చెయ్యడానికైన సిద్ధంగా ఉంటానని వేద అంటుంది.


వేద తన తల్లి దగ్గరకి వస్తుంది. మాళవిక ఇంటికి వెళ్ళావని తెలిసి చాలా భయంగా అనిపించిందని సులోచన అంటుంది. ఎందుకమ్మా భయం ఆయన నా పక్కనే ఉన్నారుగా అని వేద చెప్తుంది. అదే నా భయం ఖుషి కోసం ఇద్దరు పిల్లల తండ్రిని పెళ్లి చేసుకున్నావ్. మొదటి భార్య ఇంటికి దూరం అయినా ఇప్పటికీ తన దృష్టిలో నువ్వు శత్రువుగానే ఉన్నావ్. ఖుషి నీలో అమ్మని చూసుకుంటుంది కానీ ఆదిత్య మాత్రం మాళవిక మాటలు విని నిన్ను ద్వేషిస్తున్నాడు. తన వల్ల నీ కాపురం ఏమవుతుందో అని భయంగా ఉందని ఈ పెళ్లి చేసి తప్పు చేశావేమో అని సులోచన కన్నీళ్ళు పెట్టుకుంటుంది.  అప్పుడే యష్ అటుగా వచ్చి వాళ్ళ మాటలు వింటాడు.


Also Read: పేపర్ కి ఎక్కిన తులసి, సామ్రాట్ గొడవ, లాస్య ప్లాన్ సక్సెస్ - తులసిని ఆఫీసులో అడుగుపెట్టనివ్వనన్న సామ్రాట్


‘నాకున్న లోపం వల్ల ఎన్ని సంబంధాలు పోయాయో ఎంత బాధపడ్డామో నీకు తెలుసు. అమ్మ అని పిలిపించుకోలేనని ఎంత బాధపడ్డానో. ఖుషి నా బాధని అంతా పోగొట్టింది. ఒక మంచి భర్తకి భార్యగా మంచి ఇంటికి కోడలిగా ఉంటున్నాను. ఆదిత్య వాళ్ళ అమ్మ మాటల వల్ల అలా ప్రవర్తిస్తున్నాడు. ఆదిత్య మారితే అంత కంటే మంచి వాడు ఎవరు ఉండరు. నువ్వు లేని పోనీ భయాలు పెట్టుకోకు. నా గురించి నువ్వేమి కంగారు పడకు. ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు’ అని వేద సంతోషంగా చెప్తుంది. చిత్రలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి అల్లుడి గారి ఆవేశం, అపార్థం వల్ల ఆ జంట ఒకరికొకరు దూరం అయ్యారని సులోచన చెప్తుంది.


యష్ మాళవిక మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వేద కూడా వస్తుంది. ఖుషిని చాలా బాగా ప్రేమగా చూసుకుంటున్నావ్. ఆదిత్య నిన్ను అంగీకరించకపోయిన వాడిని నువ్వు ప్రేమించడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నువ్వు చేసిన దానికి చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నువ్వు చేసిన దానికి ఏమి ఇచ్చినా తక్కువే ఎం కావాలో కోరుకో అని యష్ అడుగుతాడు. ఏమడిగినా చేస్తారా అని వేద అంటుంది. నావల్ల అయితే తప్పకుండా చేస్తాను అడుగు అని అంటాడు. చిత్ర, వసంత్ ల పెళ్లి అని వేద అనేసరికి యష్ షాక్ అవుతాడు. ఆరోజు మీరు చూసింది నిజం కాదు ఆ చెంప దెబ్బలో ప్రేమ ఉందే తప్ప పొగరు లేదు, వాళ్ళిద్దరూ ఒకరికొకరు దూరం అయ్యి చాలా బాధపడుతున్నారు. మీ మాటకి విలువ ఇచ్చి నిజాన్ని దాచి వసంత్ తన ప్రేమని జీవితాన్ని త్యాగం చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. మీ మీద వసంత్ పెంచుకున్న నమ్మకం సంతోషంగా మారాలి కానీ శాపం కాకూడదు. దయచేసి వాళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పుకోండి అని అడుగుతుంది.


Also Read: రుక్మిణికి ఫోన్ చేసి మాట్లాడిన దేవుడమ్మ- మాధవ్ షాక్, కుమిలి కుమిలి ఏడుస్తున్న రుక్మిణి


నిధి, వసంత్ పెళ్లి గురించి ఆల్రెడీ దామోదర్ గారితో మాట్లాడాను, ఇప్పుడు చిత్ర, వసంత్ ల పెళ్లి అంటే ఇంట్లో వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి కదా అంటాడు. ముందు మీరు ఒప్పుకోండి ఇంట్లో వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీరు ఒప్పుకుంటే రెండు జీవితాలు బాగుంటాయని వేద అంటుంది. సరే మాట ఇచ్చాను కదా వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటున్నా అని యష్ అనేసరికి వేద చాలా సంతోషంగా వెళ్ళి యష్ ని కౌగలించుకుంటుంది. వేద చిత్ర దగ్గరకి వచ్చి యష్ పెళ్ళికి ఒప్పుకున్నట్టు చెప్తుంది. చిత్ర ఆ మాటకి చాలా సంతోషిస్తుంది. మాలిని, సులోచనని కూర్చోబెట్టి వేద, యష్ వసంత్ పెళ్లి గురించి చెప్తాడు. చిత్రకి వసంత్ కి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్టు యష్ చెప్పేసరికి మాలిని గొడవ చేస్తుంది. అప్పుడే దామోదర్ వాళ్ళు యష్ ఇంటికి వచ్చి షాక్ ఇస్తారు. ఇక్కడ జరిగేది అంతా మేము కళ్ళారా చూశాము అని దామోదర్ అంటాడు.


తరువాయి భాగంలో..


వసంత్, నిధిల పెళ్లి ఏ ఆటంకం లేకుండా నేను జరిపిస్తాను అని యష్ దామోదర్ కి మాట ఇవ్వడం చూసి వేద షాక్ అవుతుంది. ఈ పెళ్లి జరుగుతుందో లేదో అనే టెన్షన్ నాకు అసలు లేదు ఎందుకంటే నేను ఎవ్వరిని నమ్మను నిన్ను మాత్రమే నమ్ముతాను. యష్ మాట ఇస్తే తప్పడు అని దామోదర్ అనేసరికి థాంక్యూ సర్ మీ మాట నిలబెట్టుకుంటాను అని యష్ చెప్పడంతో వేద ఆశ్చర్యపోతుంది.