నన్ను తల్లిగా అనుకుని నీ కష్టం ఏంటో నాతో చెప్పమ్మా మూడో కంటికి తెలియకుండా నీ కష్టం నేను తీరుస్తాను అని జానకి చాలా బతిమలాడుతుంది. ఏమి లేదని చెప్తున్నా కదా ఏమైనా ఉంటే మీకు చెప్పకుండా ఉంటానా అని రాధ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గదికి వచ్చి మాధవ్, జానకి మాటలు తలుచుకుని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే చిన్మయి వస్తుంది. చిన్మయి అచ్చం దేవిలాగా మాట్లాడటం చూసి రాధ చాలా సంతోషిస్తుంది. తనని ప్రేమగా దగ్గరకి తీసుకుని మాట్లాడుతుంది. దేవమ్మ, నువ్వు ఇద్దరు నా ప్రాణం మీరంటే నాకు కోపం ఎందుకు వస్తుందని రాధ అంటుంది. చిన్మయి రాధకి చాలా ప్రేమగా చాక్లెట్ తినిపిస్తుంది. నీకోసమే తెచ్చాను అని ఇస్తుంది. మా కోసం ఎప్పుడూ నువ్వు తెస్తావ్ కదా అందుకే ఈసారి నీకోసం నేను తీసుకొచ్చాను అని ముద్దుపెట్టి కౌగలించుకుంటుంది. ఒక్కదాన్నే ఉంటే బోర్ కొడుతుందమ్మా అని చిన్మయి అంటుంది. దేవిని తొందరగా వచ్చేయమని చెప్తుంది. 


దేవి దేవుడమ్మ ఇంట్లో కమల బిడ్డతో హాయిగా ఆడుకుంటూ ఉంటుంది. చిట్టి రుక్మిణి నవ్వుతూంటే భలే ముద్దుగా ఉందని దేవి సంబరపడుతుంది. నువ్వు వస్తేనే ఇంట్లో అందరి మొహాల్లో నవ్వు ఉంటదని కమల అంటుంది. దేవి నువ్వు ఈ ఇంట్లో ఉంటే బాగుంటుంది నాతోనే ఉండిపోతావా అని దేవుడమ్మ అడుగుతుంది. మా అమ్మని వదిలేసి ఎలా ఉంటాను అని దేవి అంటుంది. నువ్వు ఒప్పుకుంటే మీ అమ్మతో ఇంట్లో అందరితో మాట్లాడి ఒప్పిస్తామని అడుగుతారు. దేవి కమల బిడ్డని ఇవ్వమని అడుగుతుంది. అది లేకపోతే ఎలా అనేసరికి బుడ్డ రుక్మిణిని మీరు ఇవ్వమని అడిగితేనే పరేషన్ అయ్యారు, మరి నేను కూడా మా వాళ్ళకి చాలా ఇష్టం వాళ్ళని వదిలిపెట్టి ఎలా వచ్చేది అని దేవి అంటుంది. ఆ మాటకి అందరూ బాధపడతారు.


Also Read: అభి వేసిన చెత్త ప్లాన్ ఫెయిల్- తిట్టిన మాళవిక, సంతోషంలో అన్నాచెల్లెళ్ళు


నువ్వు వచ్చి వెళ్తుంటే నాకు బాధగా ఉంటుంది, అందుకే అలా అడిగాను అయినా మీ అమ్మతో నేను ఎప్పుడు మాట్లాడలేదు కదా నెంబర్ చెప్పు ఒకసారి మాట్లాడతాను అని దేవుడమ్మ ఫోన్ చేస్తుంది. రుక్మిణి ఫోనే లిఫ్ట్ చేసి ఎవరు అని అడుగుతుంది. దేవుడమ్మని అని చెప్పేసరికి షాక్ అవుతుంది. తను ఫోన్లో మాట్లాడుతున్నా రుక్మిణి ఏం మాట్లాడకుండా కన్నీళ్ళు పెట్టుకుంటుంది. నీ కూతురుని మాకు ఇచ్చేస్తావా తెచ్చుకుంటాం అని దేవుడమ్మ అడిగేస్తుంది. ఆదిత్య, సత్య టెన్షన్ పడతారు. దేవిని నా దగ్గరే ఉంచుకోవాలని అనిపిస్తుంది కానీ తల్లివి దేవిని వదిలి నువ్వు మాత్రం ఎలా ఉంటావు చెప్పు ఇచ్చేస్తావా అని ఎలా అడుగుతాను, రేపు వినాయక చవితి కదా పండగ రెండు రోజులు తనని నా దగ్గర ఉంచుకుంటాను అని అడుగుతుంది.


నువ్వు చూసుకున్నట్టే నేను కూడా అంతే ప్రేమగా సంతోషంగా చూసుకుంటాను అని అడుగుతుంది. అలాగే ఉంచుకోండి అని రుక్మిణి చెప్తుంది. ఆ మాటలకి దేవుడమ్మ చాలా సంతోషిస్తుంది. దేవి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే మాధవ్ చూస్తూ ఉంటాడు. నీ మనవరాలిని నీ దగ్గర ఉంచుకోడానికి అంతగా అడగాలా అత్తమ్మా అని ఏడుస్తుంది. ఎప్పుడు మాట్లాడేవాడే కదా అంతగా ఏడవాలా అని అడుగుతాడు. మాట్లాడింది నా పెనీవీటి కాదు మా అత్తమ్మ అని చెప్పడంతో మాధవ్ షాక్ అవుతాడు.


Also Read: సామ్రాట్ రాక్స్, నందు షాక్- తులసితో కాళ్ళ బేరానికి వచ్చిన నందు, లాస్య