Horoscope 4th September 2022: ఈ రోజు సింహరాశివారి మనస్సు సంతోషంతో నిండిపోతుంది. మిథున రాశివారికి కార్యాలయంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. సెప్టెంబరు 6 మంగళవారం రోజు ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
మేష రాశి
ఈ రోజు మేషరాశివారు శుభవార్త వింటారు. మాట్లాడేటప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. స్నేహితులను కలుస్తారు. భౌతిక సుఖాలు పెరుగుతాయి. తీసుకున్న అప్పులు చెల్లిస్తారు. సాంఘిక రంగాల్లో పనిచేసేవారికి ప్రతిష్ట పెరుగుతుంది. ఏదైనా కొత్తపని ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం.
వృషభ రాశి
ఈ రోజు మీకు అన్నీ మిశ్రమ ఫలితాలున్నాయి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మనసులో ఏదో కలవరం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషం ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. డబ్బు వచ్చే అవకాశాలున్నాయి.స్థిరాస్తులు కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి ఈ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు.
మిథున రాశి
మిథున రాశికి చెందిన ఉద్యోగస్తులకు కార్యాలయంలో సీనియర్ అధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రయాణం చేయాల్సి రావొచ్చు..ప్రయాణంలో జాగ్రత్త..ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ఈ రోజు మీరు మరింత కష్టపడాల్సి రావొచ్చు. సీనియర్స్ నుంచి సలహాలు తీసుకుంటే మంచిది.
కర్కాటక రాశి
ఈ రోజు మీరు తల్లిదండ్రుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అనవసర వివాదాల్లోకి దూరకుండా ఉండడమే మంచిది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
Also Read: ఇళ్లు, షాపుల ఎంట్రన్స్ లో నిమ్మకాయ, మిరపకాయ ఎందుకు కడతారు
సింహ రాశి
ఫుడ్ పై ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజు మనసంతా ఆనందంగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. నిలిచిపోయిన పనులు మిత్రుల సహకారంతో పూర్తవుతాయి. వ్యాపారులు లాభపడగలరు.ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
కన్యా రాశి
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ తో సంబంధం ఉన్న వ్యక్తులు లాభపడతారు. తండ్రికి దగ్గరవుతారు. చదువు పట్ల, బోధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆదాయం పెరగడంతోపాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. విద్యా పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునేవారికి మంచిది
తులా రాశి
ఈ రోజు మీరు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన స్నేహితులు మిమ్మల్ని మోసం చేస్తారు జాగ్రత్త. మనసులో ఆశ, నిస్పృహలు వస్తూనే ఉంటాయి. మతపరమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. మీ ప్రవర్తన కొంత చిరాగ్గా ఉంటుంది.చాలాకాలం తర్వాత స్నేహితులను కలుస్తారు.
వృశ్చిక రాశి
ఈ రోజు మీ గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆగిపోయిన డబ్బును పొందడానికి ఇదే మంచిరోజు. మీ ఆదాయం పెరుగుతుంది.పాత స్నేహితులను కలుస్తారు.కార్యాలయంలో పురోగతి సంకేతాలు ఉన్నాయి. పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తారు.
Also Read: అక్వేరియం ఇంట్లో ఉండొచ్చా, ఉంటే ఏ దిశగా ఉండాలి, ఎన్ని చేపలుండాలి
ధనుస్సు రాశి
ఉద్యోగులు ఈ రోజు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీపై ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ఈ రోజు పూర్తవుతాయి.నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందారు. మీ శత్రువులు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు.
మకర రాశి
ఈ రోజు మకర రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి, దీని కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీ పనిలో మీరు బిజీగా ఉంటారు.తల్లిదండ్రుల ఆశీస్సులతో వ్యాపార ప్రణాళిక మళ్లీ ఊపందుకుంటుంది. విద్యార్థులకు మంచిరోజు.
కుంభ రాశి
మనస్సులో ఆనందం ఉంటుంది కానీ మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో పనిలో కొన్ని సమస్యలు ఉండవచ్చు.
మీన రాశి
మీరు చేసే పనిని ఆనందిస్తారు. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులుంటాయి. కోపం తగ్గించుకోండి. ఆహారంపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది.