తులసి మీద కోపంతో సామ్రాట్ రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే నందు, లాస్య సామ్రాట్ దగ్గరకి వస్తారు. వీళ్ళు ఇదే టైంలో రావాలా అయిపోయారు అని పెద్దాయన మనసులో అనుకుంటాడు. జరిగిన దానికి సోరి చెప్పాలని వచ్చి సైలెంట్ గా ఉంటావెంటీ చెప్పు చూడు సామ్రాట్ గారు ఎంత కోపంగా ఉన్నారో అని లాస్య కూల్ చేసేందుకు చూస్తుంది. సోరి సర్ అని నందు అంటాడు. దేనికి అని సామ్రాట్ అడుగుతాడు. అదే సార్ భూమి పూజ దగ్గర దీపక్ తో గొడవ పడినందుకు అని లాస్య అంటుంది. నిజానికి అతడే నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడాడు అతను అలా మాట్లాడినా నేను కంట్రోల్ చేసుకుని ఉండాల్సింది ఇక నుంచి అలా జరగకుండా చూసుకుంటాను అని నందు చెప్తాడు. తులసి మాజీ భర్త నందు అనే విషయం మీకు తెలియదని మాకు నిన్నే తెలిసింది, బిజినెస్ పార్టనర్ కదా చెప్పి ఉంటుందని అనుకున్నాం. అప్పటికి నందు రెండు మూడు సార్లు అన్నాడు సమయం చూసుకుని చెప్దామని అంటే అదంతా నేను చూసుకుంటాను అని తీసిపారేసింది అని లాస్య ఎక్కిస్తుంది.


మిమ్మల్ని మోసం చేయాలన్న ఆలోచన మాకు లేదని నందు అనేసరికి సామ్రాట్ కోపంగా చైర్ లో నుంచి పైకి లేస్తాడు. మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీవి అవన్నీ నాకు ఎందుకు చెప్తున్నారని సామ్రాట్ అరుస్తాడు. నా ఇష్యూ అంతా ఒక్కటే తులసి ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకుందని అంటాడు. ఇది మిమ్మల్ని అవమానించడమే అని నందు అంటాడు. తులసి నా ఇగో మీద దెబ్బ కొట్టింది, నేను టేకప్ చేసిన ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కక ముందే వైండప్ అయిందంటే నా పరువు పోయినట్టే కదా అని సామ్రాట్ అరుస్తాడు. అవును సర్ ఇది ఒక రకంగా మీరు ఒడిపోయినట్టే అని లాస్య మరింత మంట పెడుతుంది. మీరే ఎలాగైనా ఈ అవమానం నుంచి బయటపడేయాలని సామ్రాట్ అడుగుతాడు. మా ప్రాజెక్ట్ కి వెంటనే ఒకే చెప్తాడెమో అని లాస్య మనసులో సంబరపడుతుంది.    


Also Read: యష్ కి ఐ లవ్యూ చెప్పిన వేద- మొదటిసారి ఆదిత్యకి రాఖీ కట్టినందుకు సంబరంలో ఖుషి


తులసి గారు వెంటనే వచ్చి మ్యూజిక్ స్కూల్ ప్రాజెక్ట్ టేకప్ చెయ్యాలి. మీరు ఏం చేస్తారో ఎలా కన్వీన్స్ చేస్తారో నాకు తెలియదు. రేపటికల్లా తులసిగారు ఆఫీసుకి రావాలి. కంపెనీ ఈవెంట్ లో మీరు చేసిన గొడవ వల్లే ఈ సమస్య వచ్చింది కాబట్టి మీరే ఆ తప్పు సరిదిద్దాలి. అది చేతకాకపోతే మీరు ఆఫీసుకి రావొద్దు. ఇది నా ఆర్డర్’ అని సామ్రాట్ చెప్తాడు. నందు, లాస్య ఆ మాటకి షాక్ అవుతారు. పెద్దాయన మాత్రం నవ్వుతాడు. ప్రాజెక్ట్ ఆగిపోతుంటే నేను టెన్షన్ పడుతుంటే నువ్వు నవ్వుతావా అంటాడు.. నువ్వు ప్రాజెక్ట్ కోసం కాదు తులసిని కిందా మీద పడి అయినా ఆఫీసుకు రప్పించాలని ట్రై చేస్తున్నావ్ నాకు తెలుసులేరా అబ్బాయ్ అని పెద్దాయన అంటాడు.


చచ్చినా నేను తులసి దగ్గరకి వెళ్ళను. అడకత్తెరలో పోక చెక్కలా అయిపోయింది నా బతుకు ఇంటికి వస్తే అవమానించి పంపించాను ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని ఆ ఇంటి గడప తొక్కాలి అని నందు చిరాకు పడతాడు.  సిగ్గు ఎగ్గు అని మొహమాట పడితే ఎలా తుడిచేసుకుని వెళ్ళాలి అని లాస్య చెప్తుంది. తులసికి అబద్ధం చెప్పి మనమే పెద్ద మనుషుల్లాగా వ్యవహరించి తులసిని నమ్మించాలి అని ఐడియా ఇస్తుంది.


Also Read: దేవిని పర్మినెంట్ గా ఆదిత్య దగ్గరకి పంపిద్దామన్న మాధవ్- రాధ తన ఇంటి దేవత అంటోన్న జానకి


నందు, లాస్య తులసి ఇంటికి వస్తుంది. బయట ఉన్న అనసూయ దగ్గరకి వెళతారు. మొహం మీద బట్టల మీద నీళ్ళు విదిలిస్తుంది. తులసిని ఆఫీసుకి రమ్మన్నారు ఆ శుభవార్త చెప్దామనే వచ్చాను అని నందు అంటాడు. తులసిని ఒప్పించి నువ్వే ఆఫీసుకి వచ్చేలా చెయ్యమని అడుగుతాడు.. కానీ అనసూయ ఛీ కొట్టి వెళ్ళిపోతుంది. మళ్ళీ వాళ్ళు పరంధామయ్య దగ్గరకి వెళతారు. కానీ ఆయన నందుని పట్టించుకోకుండా ఉంటాడు. అయినా నందు వెంటపడుతూ ఉంటే పరంధామయ్య కౌంటర్ వేస్తాడు. ఇంట్లో వాళ్ళు అందరూ నందుని తెగ ఆడేసుకుంటారు.


నన్ను బ్లాక్ మెయిల్ చేసిన నందగోపాల్ గారికి నాతో మాట్లాడే పని ఏంటి అని తులసి అడుగుతుంది. ఇంటికి వచ్చిన అతిధులని కూర్చోబెట్టి మాట్లాడటం మర్యాద అని నువ్వే నేర్పించావ్ కదా నువ్వు మర్చిపోయావా మామ్ అని అభి అనేసరికి ప్రేమ్ కౌంటర్ వేస్తాడు. సామ్రాట్ గారితో మాట్లాడమని నువ్వు వచ్చి రిక్వెస్ట్ చేశావ్ కదా మేము ఆలోచించి వెళ్ళి ఆయనతో మాట్లాడి నచ్చజెప్పాము అని నందు అంటాడు. నేను అడిగింది నచ్చజెప్పమని కాదు నిజం చెప్పమని తులసి అడుగుతుంది. నిజమే చెప్పామని లాస్య అంటుంది. తులసి దివ్యని నందు ముందు నిలబడమని చెప్తుంది. మీ కూతురు మీద ప్రమాణం చేసి చెప్పండి నందగోపాల్ గారు నచ్చజెప్పారా నిజం చెప్పారా అని అడుగుతుంది. ఆ విషయాన్ని సామ్రాట్ గారు తీసుకోలేదు నిన్ను ఆఫీసుకి రమ్మని చెప్పారు అని నందు చెప్తాడు. నాకు కావలసింది అది కాదు మీరు నోరు తెరిచి నిజం చెప్పాలి అప్పటి వరకు రాను అని తులసి తేల్చి చెప్పేస్తుంది.


తరువాయి భాగంలో..


మీడియా వాళ్ళు తులసి ఇంటికి వస్తారు. మీరు పార్టనర్ షిప్ నుంచి తప్పుకున్నారు అనే వార్త బయటకి వచ్చింది నిజమేనా అని తులసిని అడుగుతారు. వాళ్ళు వెళ్లిపోతుంటే సామ్రాట్ తులసి ఇంటికి వస్తాడు. ఫ్యామిలీ మొత్తం నా మీద యుద్ధం ప్రకటించారా అసలు ఏం చేద్దామని అనుకుంటున్నారు. నాతో పార్టనర్షిప్ ఇష్టం లేకపోతే హ్యాపీగా మానేయవచ్చు.. ఇలా పేపర్ కి ఎక్కడం ఎందుకు అని సీరియస్ అవుతాడు.