మాలిని శర్మకి, సులోచన రత్నం కి రాఖీ కట్టాలని అనుకుంటారు. ఇద్దరు తమ తమ భర్తల దగ్గరకి వెళ్ళి డబ్బుల కోసం రాఖీ కట్టడానికి వస్తుందని ఒకరు మీద మరొకరు చాడీలు చెప్తారు. ఖుషి వేద దగ్గరకి వచ్చి అన్నయ్యకి రాఖీ కడతాను అని అడుగుతుంది. మాలిని రత్నాన్ని తీసుకుని సులోచన ఇంటికి వస్తుంది. మాలిని శర్మకి, సులోచన రత్నానికి రాఖీ కడతారు. రాఖీ కట్టినందుకు పడవ పరకో ఇచ్చి పంపించండి అని సులోచన అంటుంది. శర్మ వెళ్ళి చీర తీసుకొచ్చి మాలినికి ఇస్తాడు. అది చూసి సులోచన తిట్టుకుంటుంది. మాలిని కూడా సులోచనని దెప్పిపొడుస్తుంది. రత్నం కూడా వెళ్ళి చీర తీసుకొచ్చి సులోచనకి ఇస్తాడు.


మాలిని తన ఇంట్లో రాఖీ ఏర్పాట్లు చేస్తుంది. కాంచన సంతోషంగా యష్ కి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆదిత్య మాళవిక దగ్గరకి వచ్చి ఖుషి ఏమైనా కాల్ చేసిందా అని అడుగుతాడు. ఎందుకని అడుగుతుంది. ఈరోజు రాఖీ ఫెస్టివల్ కదా తను వస్తుందేమో అనుకున్నా రాలేదు కదా కనీసం కాల్ చేసి విష్ చేస్తుందని అనుకున్నా. ఈరోజు స్కూల్ హాలిడే లేదంటే ఏ ప్రాబ్లం లేకుండా స్కూల్ లోనే తనతో రాఖీ కట్టించుకునే వాడిని అని ఆదిత్య బాధగా చెప్తాడు. ఖుషి ఇక్కడికి రావాలనే ఉంటుంది కానీ ఆ ఇంట్లో వాళ్ళు ఇక్కడికి రావడానికి ఒప్పుకోరు అని మాళవిక అంటుంది. అంటే ఖుషి నన్ను మిస్ అవుతుందా అని ఆదిత్య అమాయకంగా అడుగుతాడు. తనకి ఉన్న ఒక్క అన్నయ్యవి నువ్వు కచ్చితంగా మిస్ అవుతుందని మాళవిక అంటే అయితే రాఖీ కట్టించుకోవడానికి మనమే ఆ ఇంటికి వెళ్దామని ఆదిత్య అడుగుతాడు.


Also Read: రాధని ఇబ్బంది పెడుతుంది నువ్వేనా అని మాధవ్ ని అడిగేసిన జానకి- దేవికి మాధవ్ ని దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్న రుక్మిణి


రాఖీ రోజు నా చెల్లి నాదగ్గరకి రాకపోతే నేనే తన దగ్గరకి వెళ్తాను అని అంటాడు. వేద యష్ దగ్గరకి వచ్చి ఖుషి వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టాలని అనుకుంటుందని చెప్తుంది. వాళ్ళ అన్నయ్య దగ్గరకి తీసుకెళ్లమని గొడవ చేస్తుందని అంటుంది. ఆ ఇంటికి తీసుకెళ్లమని ఖుషి యష్ ని అడుగుతుంది. ఆ ఇంటికా వద్దు అని యష్ అంటాడు. అటు ఆదిత్య కూడా ఖుషి హ్యాపీనెస్ కోసం ఆ ఇంటికి వెళ్దాం అని మాళవికని తీసుకుని వెళ్లబోతుంటే అభిమన్యు వద్దు అని ఆపేస్తాడు.  ఎందుకు వద్దని అడుగుతాడు.


యశోధర్ కి నువ్వు ఖుషి ఒకే స్కూల్ లో ఉండటం ఇష్టం లేదు. అవన్నీ మనసులో పెట్టుకుని నిన్ను ఏమైనా అంటాడు అని అభి ఆపేందుకు పుల్ల వేస్తాడు. నేను ఎవరిని కేర్ చేయని అంకుల్ ఖుషి కోసం వెళ్తాను అని ఆదిత్య చెప్తాడు. వద్దు ఆది అభి అంకుల్ చెప్పేది కూడా నిజమే అని మాళవిక కూడా అంటుంది. అటు ఖుషి ఇంట్లో కూడా ఆ ఇంటికి వెళ్లేందుకు వద్దని సర్ది చెప్పేందుకు చూస్తారు. కానీ ఖుషి వినడు. మాలిని మాత్రం ఖుషిని ఆ ఇంటికి తీసుకెళ్తాను అని అంటుంది. ఖుషితో స్నేహం చేస్తే ఆదిత్యలో మార్పు వస్తుందని రత్నం కూడా అంటాడు. యష్, వేద తప్పకుండా ఖుషిని తీసుకుని వస్తారు అని అభిమన్యు మాళవికతో చెప్తాడు.


మాలిని ఖుషిని తీసుకుని వెళ్తాను, ఎవరు ఏమంటారో నేను చూస్తాను వాళ్ళ సంగతి తేలుస్తాను అని అంటుంది. మీరిద్దరు వద్దులే ఖుషిని నేను తీసుకుని వెళ్ళి రాఖీ కట్టించి తీసుకొస్తాను అని వేద చెప్తుంది. యష్ కూడా వేదతో వస్తాను అని చెప్తాడు. ఖుషి సంతోషంగా అమ్మానాన్నతో వెళ్తున్నా తాతయ్య వాళ్ళకి బై చెప్పి వెళ్ళిపోతుంది. ఫస్ట్ టైం అన్నయ్యకి రాఖీ కడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందని ఖుషి సంబరపడుతుంది.


Also Read: న్యాయం చేస్తానని జెస్సీకి మాటిచ్చిన జానకి- జెస్సీతో కలిసున్న ఫోటోలు జానకి ఫోన్లో డిలీట్ చేసిన అఖిల్


అభి, మాళవిక ఏదో ఒక ఇష్యూ మీద మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తారు, ఇప్పుడు ఏదైనా గొడవ జరిగితే మీరు ఆది దృష్టిలో విలన్ గా మారితే నేను చూడలేను అని వేద యష్ ని కారు దగ్గరే ఉండమని చెప్తుంది. ఖుషిని తీసుకుని వేద ఇంట్లోకి వస్తుంది. మాళవిక తనని దగ్గరకి తీసుకోబోతే ఖుషి వెళ్ళి వేద వెనుక దాక్కుంటుంది.


తరువాయి భాగంలో..


యష్ వేదకి థాంక్స్ చెప్తాడు. నా మీద నీకు ఇంత నమ్మకం ఉన్నందుకు నాకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చినందుకు నీకు ఏం ఇచ్చినా తక్కువే.. ఐ లవ్యూ వేద అని యష్ చెప్తాడు. ఆ మాటకి వేద చాలా సంతోషంగా వెళ్ళి యష్ ని కౌగలించుకుని ఐ లవ్యూ సో మచ్ అని చెప్తుంది.