Horoscope 5th September 2022: జ్యోతిషశాస్త్రంలో...జాతకాన్ని తేదీ, గ్రహం, రాశి ఆధారంగా గణిస్తారు. మరి ఈ రోజు మేషం నుంచి మీన రాశివరకూ అన్ని రాశుల వారి కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.


మేష రాశి
ఈ రోజు మేష రాశి వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అవివాహితుల వివాహ చర్చలు సాగుతాయి.


వృషభ రాశి
వృషభ రాశివారు అనవసర ఖర్చులు నియంత్రించండి. మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకున్న తర్వాతే ఖర్చు చేసేందుకు ప్లాన్ చేసుకోండి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. భవిష్యత్ కి ఉపయోగపడే ముఖ్యమైన ప్రణాళికలపై ఈ రోజు శ్రద్ధ పెట్టండి. 


మిథున రాశి
మీ తోడబుట్టినవారితో మంచి బంధాన్ని అలాగే కొనసాగించండి. ఎలాంటి ప్రతికూల ఆలోచనలు మీ మనసులోకి రానివ్వవద్దు. సాంకేతిక రంగానికి సంబంధించిన పనిలో విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధాలలో కొంత చికాకులు ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. 


కర్కాటక రాశి
ఈ రాశివారు ఈ రోజు అత్యంత ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. వ్యాపారులకు ఈ రోజు పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఏదైనా సమస్య ఎదురైనప్పటికీ ఓపికగా, ప్రశాంతంగా పరిష్కరించేందుకు ప్రయత్నించండి.


Also Read: కన్యారాశిలోకి సూర్యుడు, ఈ నాలుగు రాశులవారికి మామూలుగా లేదు!


సింహ రాశి
సింహరాశివారి మనసులో ఈ రోజు ఏదో తెలియని భయం వెంటాడుతుంది. ఒత్తిడినుంచి బయటపడేందుకు స్నేహితుల నుంచి సహాయం పొందవచ్చు. కార్యాలయంతో మీ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు.వ్యాపారంలో లాభాలుంటాయి. మీరు సీజనల్ వ్యాధులబారిన పడే అవకాశం ఉంది ఆరోగ్యం జాగ్రత్త.


కన్యారాశి
కన్యా రాశివారికి ఈ రోజు అనుకున్నంత డబ్బు అందదు. జీవితంలో చిన్న చిన్న సమస్యలు రావొచ్చు. ఇతరుల వలయంలో పడి సమస్యలు కొనితెచ్చుకుంటారు. చెప్పుడు మాటలకు దూరంగా ఉండండి..మీ మనసు చెప్పింది విని నిర్ణయం తీసుకోవడం మీకు చాలా మంచిది.


తులా రాశి
ఈ రోజు తులారాశివారు కుటుంబ సమేతంగా ఓ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో అనవసరమైన వస్తువులను వదిలించుకోవడం మంచిది. ఉద్యోగులకు మంచి రోజు. వ్యాపారంలో లాభాలొస్తాయి.


Also Read: ఈ రాశులవారికి శాంతి, ఆ రాశులవారికి అశాంతి- సెప్టెంబరు నెల రాశిఫలాలు!


వృశ్చిక రాశి
ఈ రాశివారికి కుటుంబానికి సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు.ఎమోషన్ కి దూరంగా ఉండడం మంచింది. అనవసర మాటలు తగ్గించండి. ఈ రాశి వ్యాపారులకు శుభసమయం. 


ధనుస్సు రాశి
ఈ రోజు మీరు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు లేదంటే కొనుగోలు చేయాలన్న ఆలోచన చేస్తారు. ఆరోగ్యం బావుంటుంది. విద్య, సాహిత్య రంగాల్లో ఉన్న ఉద్యోగులు లాభపడతారు. పోటీపరీక్షలు రాసిన వారు విజయం సాధిస్తారు. ఉద్యోగులుకు బాగానే ఉంటుంది. 


మకర రాశి
ఈ రోజు మీరు వేసే ప్రతి అడుగూ భవిష్యత్ లో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే ఆలోచించి, ఆచితూచి అడుగేయండి. సోమరితనం విడిచిపెట్టండి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు పెద్దగా మార్పులుండవు. ఆదాయం బావుంటుంది


కుంభ రాశి
ఈ రోజు కుంభ రాశి వారు తమ స్నేహితుల విషయంలో  జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సమయం స్పెండ్ చేస్తారు. ఆహారాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యం జాగ్రత్త.
 
మీన రాశి
స్తిరాస్థులు కొనుగోలు చేయాలి అనుకున్నవారికి ఈ రోజు చాలా మంచిది. నూతన పెట్టుబడులకు అనుకూలమైన రోజు. మీ మనస్సు చంచలంగా ఉంటుంది..ఏ వ్యాపారం, ఏ వ్యవహారంలోనూ పూర్తిగా దృష్టి పెట్టలేరు. మీరు అనుకున్న విషయాలను స్పష్టంగా చెప్పడం మంచిది. ప్రేమ సంబంధాలకు అనుకూలమైన రోజు.