Sun Transit 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాశి మారిన ప్రతిసారీ ఆ ప్రభావం 12 రాశులపైనా పడుతుంది. కొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలుంటే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలుంటాయి. మరికొన్ని రాశులవారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఈ నెల 17న సూర్యుడు కన్యారాశిలో ప్రవేశిస్తాడు అక్టోబరు 18 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు. ఈ ఫలితంగా నాలుగు రాశులవారికి అత్యద్భుతంగా ఉంది. 

​మేషంకన్యారాశిలో సూర్యుడి సంచారం మేష రాశివారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సమయంలో శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు కలిసొస్తాయి. కెరీర్ ని ఉపయోగించుకుని కాసులు వెనకేసుకోవాలి అనుకునేవారికి ఇది మంచి సమయం. వ్యాపారాన్ని విస్తరించేందుకు ధైర్యంగా ముందడుగు వేయొచ్చు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.  మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 

Also Read: ఇలాంటి పనులు చేస్తే మీరు ఎన్నిపూజలు చేసినా ప్రయోజనం ఉండదన్న చాణక్యుడు

మిథునంకన్యారాశిలో సూర్యుడి సంచారం మిథున రాశివారికి కూడా శుభప్రదంగా ఉంది. ఈ సమయంలో మీ కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ ఇంట్లో మీరు పరస్ఫర సంబంధాల్లో అవగాహన పెరుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఈ సమయంలో శుభవార్త వింటారు. విద్యార్థులకు అనుకూల సమయం. మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. పనితీరు మెరుగుపడుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బావుంటుంది. 

​సింహంమీ రాశికి అధిపతి సూర్యుడు. ఫలితంగా కన్యారాశిలో సూర్యుడి సంచారం మీకు శుభఫలితాలనిస్తాడు. ఆర్థిక విషయాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారానికి సంబంధించి శుభవార్త వింటారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉండాలి. నూతన పెట్టుబడులకు అనుకూలమైన సమయం.

వృశ్చికంసూర్య సంచారం వృశ్చికరాశివారికి ఆదాయంతో పాటు.. ఆరోగ్యం విషయంలో కూడా మంచి జరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. వ్యాపారులు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. భవిష్యత్తు మీకు సానుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆస్తిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే లాభపడతారు. 

Also Read: ఈ రాశులవారికి శాంతి, ఆ రాశులవారికి అశాంతి- సెప్టెంబరు నెల రాశిఫలాలు!

​ధనస్సుకన్యా రాశిలో సూర్యుడి సంచారం ధనస్సు రాశివారికి అన్ని రంగాల్లో సక్సెస్ ని ఇస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి. నూతన ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

శ్రీ సూర్య స్తోత్రం (Surya Stotram)ధ్యానం:ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం |భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ ||ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం |భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్ || 

కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః |జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః || 

బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః || 

ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః |సోఽయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః || 

పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమో నమః |అండయోనే మహాసాక్షిన్ ఆదిత్యాయ నమో నమః ||

కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః |ధర్మమూర్తే దయామూర్తే తత్త్వమూర్తే నమో నమః || 

సకలేశాయ సూర్యాయ ఛాయేశాయ నమో నమః |క్షయాపస్మారగుల్మాదిదుర్ధోషవ్యాధినాశనం ||

సర్వజ్వరహరం చైవ కుక్షిరోగనివారణం |ఏతత్ స్తోత్రం శివ ప్రోక్తం సర్వసిద్ధికరం పరమ్ || సర్వసంపత్కరం చైవ సర్వాభీష్టప్రదాయకమ్ ||