టీఎస్ ఈసెట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ సెప్టెంబ‌ర్ 7 నుంచి ప్రారంభంకానుంది. ఈసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబ‌ర్ 7 నుంచి 11 వ‌ర‌కు ఆన్‌లైన్ స్లాట్ బుక్ చేసుకోవాలి. వీరికి సెప్టెంబరు 9 నుంచి 12 వ‌ర‌కు ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న జ‌ర‌గ‌నుంది. ఆ తర్వాత సెప్టెంబ‌ర్ 9 నుంచి 14 వ‌ర‌కు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవ‌చ్చు.


 


సెప్టెంబ‌ర్ 17న ఈసెట్ మొద‌టి విడుత సీట్ల కేటాయింపు జ‌ర‌గ‌నుంది. మొద‌టి విడుత‌లో సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబ‌ర్ 22వ తేదీ లోపు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబ‌ర్ 25 నుంచి తుది విడుత కౌన్సెలింగ్ నిర్వహించ‌నున్నారు. 29న సీట్లు కేటాయించ‌నున్నారు. అక్టోబ‌ర్ 10 లోపు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.



Counselling Notification


TS ECET - 2022 RANK CARD


ఈ ఏడాది టీఎస్‌ఈసెట్‌-2022 పరీక్షను ఆగస్టు 1న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్ష కోసం తెలంగాణ, ఏపీల్లో కలిపి 24,055 మంది దరఖాస్తు చేసుకోగా 22,001 (91.46శాతం)మంది విద్యార్థులు హాజరయ్యారు. టీఎస్‌ఈసెట్‌ ప్రాథమిక 'కీ'ని ఆగస్టు 2న సాయంత్రం 6 గంటలకు విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరించారు. దీంతో ఆగస్టు 12న ఫలితాలను వెల్లడించారు. ఈసెట్ ఫలితాల్లో 90.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది.




 


Also Read:



NMAT 2022: మేనేజ్‌మెంట్‌ కోర్సులకు మెరుగైన మార్గం 'ఎన్‌మాట్', దరఖాస్తు చేసుకోండి!
దేశంలోని ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లలో మేనేజ్‌మెంట్‌ కోర్సుల ప్రవేశాలకు నిర్దేశించిన NMAT-2022 (Narsee Monjee Management Aptitude Test) పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పరీక్షలో మంచి మార్కులు సాధిస్తే.. మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు. NMAT-2022  పరీక్షను గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సెల్ (GMCA) నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా దేశంలోని 68 విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా దక్షిణాఫ్రికా, ఫిలిప్పీన్స్, నైజీరియా, మొరాకో వంటి దేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు కూడా ఈ స్కోరు ఉపయోగపడుతుంది. భారత్‌లో NMIMS  (నర్సీ మోంజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్  స్టడీస్)తోపాటు ముంబయిలోని కె.జె.సోమయ్య ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, మణిపాల్‌లోని టి.ఏ.పాయ్ మేనేజ్ మెంట్  స్టడీస్ (TAPMI), గీతం తదితర పేరొందిన సంస్థల్లో ఈ స్కోరు ద్వారా ప్రవేశం పొందవచ్చు.



 




Also Read:

Foreign Education: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఒక్కరోజులోనే వీసా!

బ్రిటన్‌లో చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు యూకే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి వీసా కష్టాలు గట్టెక్కనున్నాయి. కేవలం ఒక్కరోజులోనే వీసా మంజూరు చేస్తామని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. వీసాల జారీ ప్రక్రియను మరింత వేగవంతం, సులభతరం చేస్తునట్లు.. వీసాలు తొందరగా జారీ చేసేందుకు ప్రియారిటీ, సూపర్ ప్రియారిటీ విధానాలను తీసుకొచ్చినట్లు భారత్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎలిస్ ప్రకటించారు. ప్రియారిటీ వీసాను అప్లై చేసుకున్న ఐదు రోజుల్లో, సూపర్ ప్రియారిటీ వీసాను దరఖాస్తు చేసుకున్న ఒక్కరోజులోనే పొందవచ్చని వెల్లడించారు. దీని కోసం వీసా ఫీజుతోపాటు అదనఫు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ, చివరి పనిదినం రోజున లేదా సెలవురోజు కంటే ఒక రోజు ముందు సూపర్ ప్రయారిటీ వీసాకు దరఖాస్తు చేసుకుంటే గనుక.. ఆ మరుసటి పనిదినం రోజే వీసాల జారీ ఉంటుంది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


 



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..