Horoscope 3 September 2022: సెప్టెంబరు 3 శనివారం రోజు ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి...


మేషం
మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ గౌరవం పెరుగుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ రోజు మంచి రోజు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి మంచి సమయం. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. స్నేహితులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు.


వృషభం
ఈ రోజు మీకు చాలా అనుకూలమైన రోజు. మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. చాలా కాలంగా కొనసాగుతున్న ఆర్థిక మందగమనం నుంచి బయటపడతారు. మీదైన రంగంలో సక్సెస్ అవుతారు.వృత్తిపరంగా కష్టానికి తగిన ఫలితం పొందుతారు. శత్రులపై పైచేయి సాధిస్తారు. పరిశోధనా రంగానికి సంబంధించిన వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది.


మిథునం
ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు  ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏదైనా పెద్ద పథకంలో పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి లేదంటే నష్టాలు తప్పవు. కార్యాలయంలో మీ దురుసు ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. అనవసరంగా ఎలాంటి వాదనలకు దిగకండి. మీ మాటలపై సంయమనం పాటించండి.మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు 


కర్కాటకం
ఈ రోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు, కార్యాలయంలో ఉన్న ప్రతిష్టంభన తొలగిపోతుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో లాభాలను ఆర్జించవచ్చు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో శాంతి ఉంటుంది


Also Read: గోడ గడియారం ఈ దిశగా ఉంటే నాశనమే, వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి!


సింహం
ఈ రోజు సంతోషకరమైన రోజు అవుతుంది. రోజులో ఎక్కువ భాగం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. మీరు సహోద్యోగుల మద్దతు పొందుతారు. వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేసుకుంటే మంచి ఫలితం పొందుతారు. సేల్స్‌ , మార్కెటింగ్‌ చేసేవారు ప్రమోషన్‌కు ఇదే మంచి అవకాశం. విద్యార్థులు తమ చదువులలో ఆశించిన విజయాన్ని పొందుతారు.


కన్య
మీరు ఈరోజు శారీరకంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. కార్యాలయంలో పని ఒత్తిడి కారణంగా చిరాకు పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా ఉండవచ్చు. పై అధికారుల విమర్శలకు బలవుతారు. అనవసరమైన చర్చకు దిగకండి, ఓపికపట్టండి. ఆర్థిక  లావాదేవీలు, క్రెడిట్ సంబంధిత విషయాలలో జాగ్రత్తగా ఉండండి.


తులా
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీకు కార్యాలయంలో అదృష్టం కలిసొస్తుంది. అన్ని పనులు సులభంగా పూర్తవుతాయి.డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి.వ్యాపార విషయాలలో కొనసాగుతున్న ప్రతిష్టంభన తొలగిపోతుంది, ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. విద్యార్థుల సమయాన్ని సరదాగా గడుపుతారు.


వృశ్చికం
ఈ రోజు మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది, లాభదాయక అవకాశాలు లభిస్తాయి. మీ సానుకూల ఆలోచన, నీ పనిపట్ల విశ్వాసం కారణంగా మంచి గుర్తింపు పొందుతారు.సీనియర్ అధికారుల ప్రశంసలు పొందుతారు.  కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పరిశోధనా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు మంచి రోజు అవుతుంది.


ధనుస్సు 
ఈ రోజు మీకు మంచిదని రుజువవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే కొనసాగుతున్న సమస్యలు తొలగిపోయి పనులన్నీ సజావుగా సాగుతాయి. గతంలో పెట్టిన ఆర్థిక పెట్టుబడి లాభాలు అందుతాయి. ఉద్యోగ రీత్యా చేసే ప్రయాణాలు లాభిస్తాయి.


మకరం
ఈ రోజు సరదాగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అతి విశ్వాసంతో పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. అనవసరంగా ఎలాంటి వాదనలకు దిగకండి, లేకుంటే బాస్ అసంతృప్తిని ఎదుర్కోవాల్సి రావచ్చు. అధిక ఖర్చులు తగ్గించుకోండి. ఆకస్మిక ద్రవ్య లాభాలు కూడా ఉంటాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది.


Also Read: ఈ రాశులవారికి శాంతి, ఆ రాశులవారికి అశాంతి- సెప్టెంబరు నెల రాశిఫలాలు!


కుంభం 
ఆర్థిక పరంగా ఈ రోజు మంచి రోజు అని రుజువు అవుతుంది. తలపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుంది.  కార్యాలయంలో అధిక ఆత్మవిశ్వాసం కారణంగా మీరు విమర్శలకు గురవుతారు. ఓపికతో పని చేయండి. అనవసర ఖర్చులు అధికం కావచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. 


మీనం
ఈ రోజు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందికరమైన రోజు కావచ్చు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వివిధ వనరుల నుంచి ఆదాయం అందుతుంది. కార్యాలయంలో కొనసాగుతున్న సవాళ్లు సద్దుమణుగుతాయి. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు లభిస్తుంది.వ్యాపార వర్గానికి ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కుటుంబంలో పరస్పర విభేదాల వల్ల సంతోషం తగ్గుతుంది. సంయమనంతో వ్యవహరించండి.