Vastu Tips: ప్రతి ఇంట్లోనూ గడియారం తప్పనిసరిగా ఉంటుంది. అయితే చాలామంది టైం చూసుకునేందుకు అనుకూలంగానో లేదంటే అందంగా కనిపించాలనే ఉద్దేశంతో గడియారం పెట్టే గోడని ఎంపిక చేసుకుంటారు కానీ... వాస్తవానికి గడియారం పెట్టేందుకు వాస్తు టిప్స్ ఫాలోకావాలంటారు వాస్తు నిపుణులు. 



  • వాల్ క్లాక్‌ని తూర్పు, పశ్చిమం, ఉత్తరం వైపున్న గోడకు వేలాడదీయవచ్చు. కానీ పొరపాటున కూడా దక్షిణం వైపు గోడకు వేలాడదీయవద్దు అని వాస్తుశాస్త్రం చెబుతోంది.

  • ఇంటి మెయిన్ ఎంట్రన్స్, ఎంట్రన్స్ డోర్‌కి వాల్ క్లాక్‌ని అస్సలు పెట్టొద్దు. అలా చేస్తే… ఆ వాల్ క్లాక్ ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తుంది. అలా జరిగిందంటే… ఇక ఆ ఇంట్లో మనస్శాంతి ఉండదు. అనవసర వివాదాలు, కష్టాలు, నష్టాలు, నిత్య ఓటమి తప్పదు

  • కొంత మంది పాత వాచీలు, పాత క్లాక్ లను దాచుకుంటూ ఉంటారు. పనిచేయవు కదా ఎందుకు దాచుతున్నారు అని అడిగితే యాంటిక్ పీస్ అని చెబుతారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఆగిన, విరిగిన, పగిలిన, పాడైన, చిరిగిన, దెబ్బతిన్న వాచీలు, వాల్ క్లాక్‌లను ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. అలా ఉంచితే మీ లైఫ్ లో సంతోషం ఆగిపోతుందని చెబుతారు.

  • మీ ఇంట్లో ఉన్న వాచీలు, వాల్ క్లాక్ లు ఎన్నుంటే అన్నీ పనిచేస్తుండాలి. ఏదైనా పనిచేయనిది ఉంటే దాన్ని వదిలించుకోవడమే మంచిది. క్లాక్ ఆగిపోవడం అంటే మీ జీవితం ఆగిపోవడం అని అర్థం. ఆగిన క్లాక్ లు ఇంట్లో ఉంటే మీరు తలపెట్టిన ఏ పనీ పూర్తవదు.

  • గోడగడియారం ఉత్తరం వైపు వేలాడదీయడం వల్ల సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తుంది

  • ఉత్తరం దిశ కుబేరుడు, వినాయకుడి దిశగా పరిగణిస్తారు అందుకే  ఉత్తర దిశ వైపు గడియారం ఉండడం ఎంతో శుభప్రదం

  • తూర్పువైపు చెక్క గడియారం వేలాడదీస్తే ఇంటికి వృద్ధిని ఇవ్వడమే కాకుండా మీ పనుల్లో నాణ్యతను పెంచుతుంది

  • వాస్తు శాస్త్రం ప్రకారం గోడగడియారం ఎప్పుడూ కూడా దక్షిణ దిశ గోడ వైపు పెట్టకూడదు.

  • దక్షిణం దిక్కు స్థిరత్వానికి దిక్కు. ఈ దిశలో గడియారాన్ని పెట్టడం వల్ల మీ ఇంటి పురోగతిని నెమ్మదిస్తుంది. అదే సమయంలో ఈ దిశలో గడియారాన్ని ఉంచడం వల్ల ఇంటి పెద్ద అనారోగ్యం పాలవుతారు. వ్యర్థాలు పెరిగిపోతాయి. ఇంట్లో ఎన్నో సమస్యలతో ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఎందుకంటే దక్షిణ దిశకు యముడు అధిపతి. 


Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!


అష్ట దిక్పాలకులు (8 దిక్కులు-వాటి అధిపతులు)
తూర్పు దిక్కుకి అధిపతి ఇంద్రుడు
ఆగ్నేయానికి అధిపతి అగ్ని
దక్షిణానికి అధిపతి యముడు
నైరుతి అధిపతి నైరుతి
పడమరకి అధిపతి వరుణుడు
వాయువ్య మూలకి అధిపతి వాయువు
ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు
ఈశాన్య మూలకి అధిపతి ఈశ్వరుడు



నోట్: వాస్తు పండితుల నుంచి తెలుసుకున్నవి, కొన్ని పుస్తకాల ఆధారంగా తీసుకున్న వివరాలివి. వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం...