Vinayaka Chavithi 2022: వినాయక చవితి రోజు భక్తులంతా తమ అభీష్టానికి, స్తోమతకు అనుగుణంగా బొమ్మను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు. అయితే వినాయకుడు ఒక్కడే అయినా రకరకాల ఆకృతుల్లో, రంగుల్లో బొమ్మలు ఎంపిక చేసుకుంటారు. ఒక్కో వినాయకుడిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అవేంటంటే..


తొండం ఎడమ వైపు ఉన్న వినాయకుడు
వినాయకుడి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉన్నట్లుగా ఉండే విగ్రహాన్ని తీసుకొచ్చి పూజ చేస్తే ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఏపని మొదలెట్టినా విజయం తథ్యం


తొండం కుడివైపు ఉన్న వినాయకుడు
వినాయకుడి తొండం కుడి వైపు తిరిగి ఉన్నట్లుగా ఉండే విగ్రహాన్ని తెచ్చుకుంటే..మీ కోర్కెలు నెరవేరతాయట. ఇలాంటి విగ్రహాన్ని పూజించేటప్పుడు నియమ నిబందనలు పాటించాలి...లేదంటే మరిన్ని ఇబ్బందులు తప్పవు.


Also Read: విఘ్నాధిపతిగా గణపతినే ఎందుకు పూజించాలి, వినాయక చవితి ప్రత్యేకత ఏంటి!


తొండం మధ్యలో ఉంటే
వినాయకుడి తొండం మధ్యలో ఉండే విగ్రహాలను ఇంట్లో పెట్టి పూజిస్తే ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుందట. ఇంట్లోని కుటుంబ సభ్యులకు మంచి శక్తి లభిస్తుంది.


తెలుపు రంగు
తెల్లని రంగులో ఉండే గణేషుని విగ్రహాన్ని పూజించే ఇంట్లో శాతి ఉంటుంది. సాధారణంగా ఇంట్లో, దంపతులు లేదా కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉంటే తెల్లని వినాయకుడి విగ్రహాలను పూజిస్తే ఆ కలహాలు అన్నీ తొలగిపోయి అందరూ సఖ్యతగా ఉంటారట.


రావి ఆకు వినాయకుడు
రావి ఆకు రూపంలో ఉన్న వినాయకుడిని పూజిస్తే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. 


పలు రకాల ఇతర విగ్రహాలు
వెండి గణేషున్ని పూజిస్తే పేరు ప్రఖ్యాతులు, చెక్క రూపంలో ఉన్న గణేషున్ని పూజిస్తే ఆరోగ్యం, ఇత్తడి గణేషున్ని పూజిస్తే సంతోషం, మట్టి గణపతిని పూజిస్తే కెరీర్‌లో సక్సెస్ అవుతారు.


Also Read: రంగులుమార్చే వినాయకుడిని దర్శించుకున్నారా! గుప్పెడు బియ్యం - కొబ్బరికాయ ముడుపుకడితే చాలు


పూజకు ఎలాంటి విగ్రహాన్ని వినియోగించాలి
మన ఇంట్లో నిత్యం చేసుకొనే పూజలకు బొటనవేలికి మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవాలి. వినాయక చవితి వంటి వ్రతములు చేసేటప్పుడు మాత్రం అరచేతిని మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవడం మంచిది. ఎంతపెద్ద విగ్రహం ఉంటే ఆ విగ్రహం పరిమాణం ప్రకారంగా రోజూ ఆ స్థాయిలో ధూపదీప నైవేద్యములు జరగాలి గనక సాధారణంగా ఇంట్లో చేసుకొనే పూజకు అరచేతికి మించకుండా విగ్రహం వాడటం మంచిది. సిద్ధివినాయక పూజలో వాడే విగ్రహం మట్టితో చేసినదైతే శ్రేష్ఠం. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ వంటి విగ్రహాలు వాడకూడదు. పూజలో మట్టి విగ్రహం గానీ, పంచలోహములతో చేసిన విగ్రహాలను మాత్రమే వాడాలి.


వినాయకుడి రూపాలు
వినాయకుడికి 32 రూపాలు ఉన్నాయి. వీటిలో 16 రూపాలు అత్యంత ప్రాధాన్యమైనవిగా తాంత్రికులు పూజిస్తారని చెబుతారు. అందుకే ఈ 16 రూపాలు అత్యంత ప్రాధాన్యమైనవని చెబుతారు. 1. బాలగణపతి 2. తరుణ గణపతి 3. భక్త గణపతి 4. వీర గణపతి 5. శక్తిగణపతి 6. ద్విజ గణపతి 7. సిద్ధి గణపతి 8. ఉచ్ఛిష్ట గణపతి 9. విష్ణు గణపతి 10.క్షిప్త గణపతి, 11. హేరంభ గణపతి 12. లక్ష్మీగణపతి 13. మహాగణపతి 14. విజయ గణపతి 15. రుత్య గణపతి 16. ఊర్ధ్వ గణపతి