Karthika Deepam September 6th Episode 1450 (కార్తీకదీపం సెప్టెంబరు 6 ఎపిసోడ్)


దీప తీసుకెళ్లిన వంట తిన్న మోనిత వాంతి చేసుకుని పడిపోతుంది. కంగారుపడిన కార్తీక్ డాక్టర్ కి కాల్ చేస్తాడు. ఇది ఏదో నాటకం ఆడుతున్నట్టుందని దీపలో మళ్లీ టెన్షన్ పెరుగుతుంది. అప్పుడే వచ్చిన డాక్టర్ ఏమైందని అడిగితే ఇప్పుడే టిఫిన్ తిన్నదని చెబుతాడు. సీన్ హాస్పిటల్ కి మారుతుంది. ఎలా మేడం అని డాక్టర్ అడిగితే..ఇదంతా నాటకమే కదా ఈ యాక్షన్ మా ఆయన ముందు చేయండని చెబుతుంది. మేడంకి ఫుడ్ పాయిజన్ అయింది.. కరెక్ట్ సమయానికి తీసుకొచ్చారు లేదంటే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేది అని చెబుతాడు డాక్టర్. అదే సమయంలో వారణాసి, శౌర్య ఇద్దరూ అదే హాస్పిటల్ కి వెళతారు కానీ కార్తీక్ ని చూడరు. 
కార్తీక్: ఇంతకీ ఎవరు చేశారు ఫుడ్ పాయిజన్
మోనిత: మనం ముబై వెళ్తున్నామని తెలిసి నన్ను చంపేస్తే నిన్ను తన వశం చేసుకోవాలనుకుంటోందని చెబుతుంది మోనిత.
కార్తీక్: నేను నమ్మలేకపోతున్నాను
మోనిత: నేను అబద్దం చెబుతున్నానా, డాక్టర్ కూడా అబద్ధం చెబుతున్నారా... మొదట్నుంచీ చెబుతూనే ఉన్నాను కానీ నువ్వే ఆవిడను వెనకేసుకునివస్తున్నావ్ . ఆవిడపై నీకు అంత సాఫ్ట్ కార్నర్ ఏంటి...నన్ను ఏమైనా చేసి డాక్టర్ బాబుని తీసుకెళ్లిపోదాం అనుకుంటే వెళ్లిపోతావా కార్తీక్. నీ ప్రవర్తన చూస్తే అలాగే ఉంది కార్తీక్...నానుంచి నిన్ను తీసుకెళ్లిపోవడానికే ఎదురింట్లో తిష్టవేసింది.. అది అక్కడే ఉంటే ఎప్పటికైనా నా ప్రాణాలకు ప్రమాదమే అని దొంగ కన్నీళ్లు పెట్టుకుంటుంది...కార్తీక్ కోపంతో శివతో పాటు వంటలక్క ఇంటికి వెళ్తాడు.


Also Read: తగ్గేదెలే అంటోన్న మోనిత, ముంబయికి డాక్టర్ బాబు- కుమిలి కుమిలి ఏడుస్తున్న దీప


కార్తీక్-దీప
అదే సమయంలో దీప వాళ్ళ అమ్మ కు ఫోన్ చేసి,డాక్టర్ బాబు నా వంటలను బాగా ఇష్టపడుతున్నారు, అనుకున్నట్టే అంతా జరుగుతుంది.రేపు మాతో గతం గుర్తొచ్చే అవకాశం కూడా ఉన్నది అని అంటుండగా కార్తీక్ కోపంతో తలుపులు ఫోర్స్ గా తోస్తాడు...
కార్తీక్: ఎవరు నీ డాక్టర్ బాబు,నేను నీ డాక్టర్ బాబు ని కాదని చెప్పినా వినడం లేదు ఎందుకు ? ప్రపంచంలో అందరూ చెడ్డోళ్ళు కాదు కొన్ని మంది మంచి మనుషులు కూడా ఉంటారు అనుకుని నిన్ను నమ్మాను. కానీ నా భార్యకే విషయం పెడతావా? నా భార్యని చంపేసి,ఎలాగో మతిమరుపు వాడిని కదా రెండు మూడు రోజుల్లో  గతం మర్చిపోయిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుందామనుకుంటున్నావా? భార్యని కూడా మర్చిపోయే అంత మతిమరుపు లేదు నాకు.భార్య భర్తలు బంధం ఏడు జన్మల బంధం. అలాంటిది మోనిత టిఫిన్ లో విషయం కలుపుతావా?, అసలా పెళ్లి అయిన అబ్బాయి మీద మనసు పడడానికి నీకు ఎలా మనసు వచ్చింది అని తిడతాడు. దీప ఏదో చెప్పేందుకు ప్రయత్నించినా కార్తీక్ వినడు.నీకు డబ్బు కావాలంటే ముఖం మీద అడుగు కానీ,ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు.ఇంకెప్పుడు నీ మొఖం నాకు చూపించొద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు.


Also Read: దీపని ఇంటికి ఆహ్వానించిన కార్తీక్, మోనితలో మొదలైన టెన్షన్


శౌర్య-వారణాసి
శౌర్య తనలో తను అనుకుంటుంది: నాకు పదేళ్ల వరకు మా నాన్న ఎవరో తెలియలేదు.తీరా మా నాన్న ఎవరో తెలిశారు అనుకునేసరికి ఇలా అయింది. అసలు కనీసం నా చదువు అయ్యేంతవరకు అయినా లేకపోతే పెళ్లి అయ్యేంత వరకు అయినా ఉండొచ్చు కదా! నన్ను ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు అని బాధపడుతుంది. 
వారణాసి: పుడు వారణాసి ఏమైందమ్మా అలా ఏడుస్తున్నావు
శౌర్య:  రేపు గుడిలో చెప్తాను వారణాసి అని అంటుంది 
డాక్టర్, డాక్టర్ వాళ్ల అమ్మ దీప ఇంటికి వస్తారు. ఆ మోనిత ఇంత చేస్తుందని అనుకోలేదు, నీ భర్తతోనే నిన్నే తిట్టించేలా చేసింది.అసలు దానికి ఎంత తెలివి ఉంటే ఇలా చేస్తుంది? అని అంటుంది.
దీప: ఆయన దృష్టిలో నేను చెడ్డదాన్ని అయిపోయాను రేపు మా పిల్లల పుట్టినరోజు. ఆయన్ని గుడికి తీసుకెళ్లి అభిషేకం చేయిద్దాం అనుకున్నాను కానీ అది కూడా జరగకుండా చేసిందా మోనిత. ఇప్పుడు నా మొహం కూడా చూడొద్దంటున్నారు
డాక్టర్ అన్నయ్య: మొగుడు పెళ్ళాల మధ్య  ఏ గొడవైనా సరే  నీ ముఖం చూపించొద్దని భర్త అంటే మానేస్తుందా?... సరే అమ్మ ఇంక లేట్ అవుతుంది బయలుదేరుతాం అంటారు...
ఎపిసోడ్ ముగిసింది....


రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
హారతి తీసుకురండి ప్రమాణం చేయించాలని కార్తీక్ ని గుడికి తీసుకెళుతుంది మోనిత. మరోసారి వంటలక్కని కలవను అని హారతిపై ప్రమాణం చేయమంటుంది..అప్పుడే ఏంట్రీ ఇచ్చిన దీప... నేను ఎలాంటి తప్పుచేయలేదు నా పిల్లల పుట్టిన రోజు ఈరోజు  వాళ్లపై ప్రమాణం చేసి చెబుతున్నా అంటుంది. నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని ప్రమాణం చేయమని మోనితకు సవాల్ విసురుతుంది. అదే గుడిలో శౌర్యని చూస్తుంది మోనిత...