Karthika Deepam September 2 Today Episode 1447


దీప బట్టలు సర్దుకుని వాళ్ళ అన్నయ్య ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది.డాక్టర్, డాక్టర్ వాళ్ళ అమ్మ, రాంపండులు అందరూ బాధపడతారు. ఇల్లు మారడం ఎందుకమ్మా..ఇక్కడే ఉండి నిత్యం వెళ్లి రావొచ్చుకదా అంటాడు డాక్టర్ అన్నయ్య. 
దీప: మోనిత జిత్తులమారి నక్క అని చెప్పానుకదా..అందుకే ఇదంతా. నేను డాక్టర్ బాబుకి కనిపించానని చెప్పి ఊరు మారిపోతుందేమో అందుకే 24 గంటలు అక్కడే ఉండి డాక్టర్ బాబును చూసుకోవాలి. ఇప్పటివరకు డాక్టర్ బాబు కనిపించలేదని బాధపడ్డాను.ఇప్పుడు నా కళ్ళముందే ఉంటారు కదా చాలు.
డాక్టర్ అమ్మ: అది రాక్షసి అన్నావుకదా నీకేమైనా జరుగుతుందేమో..తోడుగా రాంపడుని తీసుకెళ్లు
దీప: వద్దమ్మా ఆయన దృష్టి మొత్తం నాపైనే ఉండాలి


Also Read: సెంటిమెంట్ డోస్ పెంచిన మోనిత, డాక్టర్ బాబుకి బిర్యానీ రుచి చూపించిన వంటలక్క


సౌందర్య-హిమ
పుట్టినరోజు వస్తోంది కదా బట్టలు కొనుక్కో అంటుంది. నాకు వద్దు నానమ్మ అనడనంతో..ఏటా నాలుగు రోజుల ముందే బట్టలు కావాలి, ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలి అంటావు కదా ఈ సంవత్సరం ఏమైంది అంటుంది. 
హిమ: ఈ సంవత్సరం నాకు ఇవేవీ వద్దు నానమ్మ అనాధ శరణాయానికి వెళ్లి డబ్బులు ఇచ్చేసి వారికి భోజనం పెడదాం. 
సౌందర్య: మంచి ఆలోచన కానీ బట్టలు కొనుక్కోవడం ఆపేయడం ఎందుకు
హిమ: నేనిప్పుడు ఇలా పండగ చేసుకుంటే అక్కడ శౌర్య ఒక్కతే ఉంటుంది కదా శౌర్య బాధపడుతుంది. అయినా శౌర్య,ఇంట్లో నేను ఉంటే రాదన్నది కాని నేను లేకపోతే వస్త అన్నది కదా..శౌర్యని ఇంటికి తీసుకురండి నేను వెళ్లిపోతాను
సౌందర్య: కోపంగా... మాకు ఇద్దరు రెండు కళ్ళు లాంటివారు. అలాగని నువ్వు వెళ్లిపోవడం లాంటి ఆలోచనలు వస్తే పళ్ళు రాలుతాయి. ఎప్పటికైనా శౌర్య మన ఇంటికి రావాలే కానీ నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు


Also Read: కళ్లు తెరు వసుధారా అంటూ రిషి కన్నీళ్లు, ప్రేమనంతా కరిగించేసి కదిలించేసిన ఈగో మాస్టర్


కార్తీక్-దీప-మోనిత
కార్తీక్ శివ తో మాట్లాడుతూ ఎవరైనా వంట మనిషిని తెలిస్తే మాట్లాడవయ్యా అంటాడు. ఇంతలో వాళ్ళకి ఒక బిర్యానీ వాసన వస్తుంది. వాసన  చాలా బాగుంది కదా అనుకుంటారు. మోనిత కూడా అవును చాలా బావుంది అంటుంది. ఆమెను మనం వంటచేసేందుకు పెట్టుకుందాం అని కార్తీక్ ప్రామిస్ తీసుకుంటాడు. ఎవరైనా కానీ పెట్టుకోవాల్సిందే లేదంటే ఆ వంటలక్కని తీసుకొచ్చి పెట్టినా పెడతాడు అనుకుంటూ వెళుతుంది మోనిత. అక్కడ దీప ప్రత్యక్షమవుతుంది.
కార్తీక్: నువ్వా..మామూలుగా అయితే నాకు అంతగా గుర్తుండదు..( నీ పేరేంటి అని మోనితను అడుగుతాడు). కానీ నువ్వు గుర్తున్నావు. నన్ను చూసి ఎవరో అనుకున్నావు కదా...నేను మీరు డాక్టర్ బాబుని కాదు..
దీప: మీరు డాక్టర్ బాబు కాదండి, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. వంటచేసుకుని బతుకుదాం అని ఈ ఇల్లు అద్దెకు తీసుకున్నాను
కార్తీక్: పిచ్చిది అది ఇది అన్నావ్..వంటలు చేసుకుంటోందట..ఈవిడను మనింట్లో వంటమనిషిగా పెట్టుకుందాం.
మోనిత: ఈవిడ వద్దు  అంటూ మనసులో ఇదేదో కొత్త ప్లాన్ తోనే వచ్చినట్టుంది చాలా జాగ్రత్తగా ఉండాలి 
కార్తీక్ : మీరు మాకు వంట మనిషిగా ఉంటారా మా ఇంటికి వస్తారా
దీప: క్షమించండి..నేను బతుకుతెరువుకోసం ఈ పని చేస్తున్నాను ఒకరింట్లో పనిచేయడం ఇష్టం లేదు..అప్పుడప్పుడు మీకు ఏం కావాలో వండి పెడతాను
మోనిత: వంటమనిషిలా వచ్చే అవకాశం ఉన్నా..రాలేదంటే కచ్చితంగా ఇదేదో ప్లాన్ తో వచ్చినట్టుంది
కార్తీక్: మాకు కావాల్సిన వంటలు అడిగి చేయించుకుంటాం... ఇప్పుడేం వండుతున్నారు.. ఈ రోజే మొదలుపెడదాం..మీ పేరు ఏమని పిలవాలి...
దీప: దీప అని పిలవండి..సౌందర్య ఉన్నారుకదండీ మా అత్తయ్య గారు కోడలా అని పిలుస్తారు. శౌర్య ఉంది కదా అమ్మా అని పిలుస్తుంది...హిమ తెలుసుకదా వంటలక్క అని పిలుస్తుంది. 
మోనిత: వాళ్లంతా కార్తీక్ కి ఎలా తెలుస్తారు గట్టిగా మాట్లాడిన మోనిత..కార్తీక్ కి గతం గుర్తొచ్చేస్తుందేమో అని భయపడుతుంది
దీప: డాక్టర్ బాబు అని పిలిస్తే మీకేమీ అభ్యంతరం లేదుకదా అని దీప అంటే..అస్సలు అభ్యంతరం లేదంటాడు కార్తీక్
మోనిత:ఏంటే ఈ అవతారం..నువ్వు ఏం చేసినా కార్తీక్ ని మాత్రం నా నుంచి తీసుకెళ్లలేవు...
దీప: తీసుకున్నది నువ్వే..నీ అంతట నువ్వే వదిలేలా చేస్తాను..ఇప్పుడే కదా ఆట మొదలైంది చూసుకుందాం..
ఇంటికి వెళ్లిన కార్తీక్..దీప చెప్పిన పేర్లు అన్నీ గుర్తుచేసుకుంటాడు. ఒక్కరికి ఇన్ని పేర్లా అనుకుంటాడు.. 


రేపటి( శనివారం) ఎపిసోడ్ లో
డాక్టర్ బాబూ అంటూ క్యారియర్ తీసుకొస్తుంది దీప. మీ ఆవిడకు సంబంధించిన విషయాలు మీకు గుర్తులేవా అని అడుగుతుంది. మోనిత సీరియస్ అవుతుంది. దీప మాత్రం బిర్యానీ వడ్డిస్తుంది...