ఆదిత్య కోసం స్కూల్ కి వచ్చినందుకు ఖుషి అలుగుతుంది. యష్ ఇంటికి వస్తాడు. ఎక్కడికి వెళ్లావ్ అని వసంత్ అడుగుతాడు. నాకు ప్రాజెక్ట్ కన్నా ఆదిత్య స్కూల్ అడ్మిషన్లో తండ్రిగా నా పేరు ముఖ్యమని అనిపించింది అందుకే వెళ్ళాను అని చెప్తాడు. పద నిమిషాలు అడ్మిషన్ ఆగేదేమో కానీ ప్రాజెక్ట్ ఆగలేదు కదా ఈరోజు అభిమన్యు ఎంత వరస్ట్ గా ప్రజెంటేషన్ ఇచ్చాడో తెలుసా కానీ మనకి ఎంతో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ పోయిందని వసంత్ అసహనం వ్యక్తం చేస్తాడు. ఓటమి ఒకసారి అలవాటు అయితే అది ఆ నష్టం మన కంపెనీకే కాదు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కి కూడా ఓడిపోవడం నాకే కాదు నీ గురించి తెలిసిన వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోరని వసంత్ చెప్పేసి వెళ్ళిపోతాడు.


యష్ మాళవిక, అభిమన్యు వాళ్ళ అన్న మాటలు తలుచుకుని కోపంగా ఉంటాడు. అప్పుడే ఖుషి యష్ దగ్గరకి మాట్లాడటానికి వస్తుంది. హలో మిస్టర్ డాడీ.. నీకు నాకన్న అన్నయ్య ఎక్కువ ఇష్టం కదా అని ఖుషి అంటే మీరంటే నాకు ప్రాణం అని అంటాడు. లేదు నీకు నాకంటే అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం అందుకే తన కోసం స్కూల్ కి వచ్చావ్. మీ వ మార్నింగ్ నుంచి ఎంత హార్ట్ అయ్యానో తెలుసా ఇప్పటి వరకు హోమ్ వర్క్ చెయ్యలేదు. మార్నింగ్ నేను అమ్మ ఎంత రిక్వెస్ట్ చేశాం, కానీ నువ్వు అన్నయ్య కోసం వచ్చావ్. అన్నయ్య వచ్చాక నా మీద నీకు ప్రేమ తగ్గింది. చెప్పు నాన్న అని ఖుషి పదే పదే ఆడగటంతో యష్ కోపంగా అరుస్తాడు. ఆ మాటకి ఖుషి ఏడుస్తూ వెళ్ళిపోతుంది.


Also Read: అబార్షన్ చేయించుకోమన్న అఖిల్, ప్రెగ్నెన్సీ సంగతి తెలుసుకున్న జానకి - విషయం పసిగట్టిన మల్లిక


మీ కోపం పసిడాని మీద చూపిస్తారా అది ఎంతలా బాధపడితే దాని నోటి వెంట అలాంటి మాటలు వస్తాయని వేద అడుగుతుంది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ వేద, కచ్చితంగా ప్రజెంటేషన్ ఇచ్చే ముందే స్కూల్ అడ్మిషన్ కోసం ప్లాన్ చేసి అభిమన్యు దక్కించుకునేలా చేశాడు. ఒక పక్క ఓటమి ఇంకో పక్క చేతకాని తనం ఏం చెయ్యాలో తెలియని కన్ఫూజన్ లో కోపంతో ఖుషి మీద అరిచాను అని యష్ తన మనసులోని బాధని వేదతో పంచుకుంటాడు. మీ పరిస్థితి నేను అర్థం చేసుకుంటాను కానీ పసి పిల్ల అది అర్థం చేసుకోలేదు కదా మీరు స్కూల్ కి వచ్చేముందు ఒక ఫోనే చేసిన తన కోపం ఉండేది కాదు, ప్రేమగా తనని దగ్గరకి తీసుకుని దానికి చెప్తే బాగుండేది కదా అని వేద అంటుంది. మీలో పాత యశోధర్ బయటకి వస్తున్నాడు జాగ్రత్త పడమని చెప్తుంది.


ఖుషి ఏడుస్తూ ఉంటే యష్ భోజనం తీసుకుని వస్తాడు. కానీ తినను అని అలుగుతుంది. తనని బుజ్జగించి నవ్విస్తాడు. ఖుషికి ప్రేమగా అన్నం తినిపిస్తాడు. ఖుషి కూడా యష్, వేద కి అన్నం తినిపిస్తుంది. మీలాంటి గొప్ప తండ్రికి ఇంతలా ప్రేమించే కూతురు ఉండటం గొప్ప వరం, మీ సంతోషంలో నేను కూడా భాగం అవడం చాలా సంతోషంగా ఉందని వేద మనసులో అనుకుంటుంది. అభి, మాళవిక మాట్లాడుకుంటూ ఉంటే ఖైలాష్ వస్తాడు. ‘నేను ఒక కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నా అందులో యశోధర్ మేజర్ పార్టనర్ నువ్వు ఈ ప్రాజెక్ట్ కి హెడ్ గా ఉంది నీ కష్టాన్ని అంతా పెట్టి యష్ ని దెబ్బకొట్టాలి’ అని ఖైలాష్ కి పురామాయిస్తాడు. ఈ విషయంలో చాలా పెద్ద ప్రాబ్లం ఉందని ఖైలాష్ అంటాడు. వేదకి మొగుడంటే చాలా ఇష్టం మనం యష్ ని కొట్టాలంటే ముందు వేదని తప్పించాలి, ఆ మొగుడుపెళ్ళాలు ఒకేచోట ఉన్నంత కాలం ఏమి చెయ్యలేము తనని తప్పించాలని సలహా ఇస్తాడు. అది మేము చూసుకుంటాములే అని అభి చెప్తాడు.


Also Read: మాధవ్ పని అయిపాయే- దొంగ తండ్రి గురించి నిజం తెలుసుకున్న దేవి


ఖుషి చాలా సంతోషంగా స్కూల్ కి వెళ్లేందుకు రెడీ అవుతుంది. స్కూల్ కి త్వరగా వెళ్ళాలి అని హడావుడి చేస్తుంది. ఎందుకని రత్నం అడుగుతాడు. అన్నయ్యతో కాసేపు మాట్లాడొచ్చు ఎంజాయ్ చేయొచ్చని చెప్తుంది. అన్నయ్య మా స్కూల్ లోనే జాయిన్ అయ్యాడని చెప్తుంది. అదేంటి ఊటీలో కదా చదువుకునేది ఇప్పుడు ఇక్కడకి తీసుకొచ్చారు అంటే ఏం జరుగుతుందో అని మాలిని అనుమానపడుతుంది. డాడీనే అన్నయ్యని స్కూల్ లో జాయిన్ చేసినట్టు ఖుషి చెప్తుంది. అయినా సిటీలో ఇన్ని స్కూల్స్ ఉండగా ఎఋ కోరి ఖుషి ఉన్న స్కూల్ లోనే ఎందుకు జాయిన్ చేసింది, ఈడి కూడా ఏమైనా ప్లాన్ కాదు కదా అని మాలిని అనేసరికి యష్ కూడా అనుమానపడుతుంది. మాళవిక అమ్మ నాకోసమే అన్నయ్యని స్కూల్ లో జాయిన్ చేసినట్టు అన్నయ్య చెప్పాడని ఖుషి చెప్తుంది. ఎన్ని ప్లాన్స్ వేసిన ఆ మాళవిక ఖుషిని నా నుంచి దూరం చెయ్యలేదని యష్ అంటాడు. కానీ నాకు ఎందుకో భయంగా ఉందని మాలిని అంటుంది. రత్నం సర్ది చెప్పేందుకు చూస్తాడు.