నా వంటల వల్ల ఆయనలో మార్పు వస్తుంది, గుర్తు లేకపోయినా నాతో చనువుగా ఉన్నారు, ఆయనకి త్వరగా గతం గుర్తు వచ్చేందుకు ఎక్కువ టైం కూడా పట్టదు అని దీప అనుకుంటూ ఉంటుంది. మోనిత డాక్టర్ బాబుతో కలిసి పిల్లల్ని కంటే ప్రమాదం తొందరగా ఆయనకి గతం గుర్తుకు వచ్చేలా చెయ్యాలి అని దీప టెన్షన్ పడుతుంది. మరో వైపు మోనిత కూడా దీప గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎంత పెద్ద ప్లాన్ వేశావే వంటలక్కా వంటలు వండి కార్తీక్ తో తినిపించి గతం గుర్తుకు వచ్చేలా చేద్దామని అనుకుంటున్నావా, అంతవరకు నేను చేతులు ముడుచుకుని కూర్చుంటానా, వంట నీ ఆయుధం అయితే విడగొట్టడం నా ఆయుధం అని మోనిత మళ్ళీ ఏదో ప్లాన్ వేస్తుంది. అప్పుడే దీప ఇంటికి వస్తుంది. డాక్టర్ బాబుతోనే నిన్ను వెల్లగొట్టేలా చేస్తాను అని అనుకుంటుంది.


కార్తీక్ దగ్గరకి వచ్చి మోనిత బయటకి వెళ్ళమని అంటుంది. నాకు వెళ్ళే మూడ్ లేదని కార్తీక్ అంటాడు. మనం ముంబయి వెళ్తున్నాం అక్కడే మీ వాళ్ళు ఉన్నారు, నువ్వు పుట్టింది పెరిగింది అంతా అక్కడే అని చెప్తుంది. అవునా మరి నేను తెలుగు ఇంత బాగా ఎలా మాట్లాడుతున్న అని అడుగుతాడు. గతం పోయింది కానీ లాజిక్ మాత్రం పోలేదని మోనిత అనుకుంటుంది. మీ నాన్న గారు తాతగారు తెలుగు పండిట్ అని కవర్ చేస్తుంది. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. చెప్పాను కానీ నువ్వు మర్చిపోయావు అని మోనిత చెప్తుంది. నాకు ఎందుకో మా వాళ్ళు అంతా హైదరాబాద్ లో ఉన్నారని అనిపిస్తుంది, మరి నువ్వేమో ముంబయి అంటున్నావ్ అసలు కనెక్ట్ కావడం లేదని కార్తీక్ అంటాడు. మోనిత దీప ఇంటికి వస్తుంది.


Also Read: దీపని ఇంటికి ఆహ్వానించిన కార్తీక్, మోనితలో మొదలైన టెన్షన్


మోనిత: వంట ఏం చేస్తున్నావ్ మీ డాక్టర్ బాబుకి


దీప: ఏంటి కొంచెం ఎక్కువ చేస్తున్నావ్


మోనిత: ఇక నుంచి అంతా ఎక్కువగానే ఉంటుంది, ఎక్కడా తగ్గేదెలే


దీప: నిన్న నన్ను చూసి టెన్షన్ పడి ఈరోజు నాదగ్గరకి వచ్చినప్పుడే అర్థం అయ్యింది తెగించి వచ్చావని


మోనిత: నన్ను నువ్వు అర్థం చేసుకున్నట్టు ఈ ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకోలేదు, ఈ మాత్రం కార్తీక అర్థం చేసుకుని ఉంటే నీ వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాదు


దీప: అర్థం చేసుకోవడం కాదు నువ్వంటే అసహ్యం


మోనిత: నాకు తెలుసు దీప అందుకే కదా ఏ జ్ఞాపకాల్లో అయితే నా మీద అసహ్యం ఉందో ఆ జ్ఞాపకాలని చెరిపేస్తున్నా, అందులో ఉన్న నీతో సహా


దీప: ఏవో మందులు వాడి ఆయన గతం మర్చిపోయేలా చేసినంత మాత్రాన డాక్టర్ బాబు నాకు దూరం అయిపోతారని అనుకోవడం నీ మూర్ఖత్వం. ఒక్క క్షణం చాలు ఒక చిన్న సంఘటన చాలు ఆయనకి గతం గుర్తుకు వచ్చేలా చెయ్యడానికి. అప్పుడు నేను అక్కడ నువ్వు ఎక్కడో


మోనిత: ఏంటే నీ కాన్ఫిడెన్స్ నీ సాంబార్లు, బిర్యానిలు రుచి చూపించి గతం గుర్తుకు వచ్చేలా చేద్దామని అనుకుంటున్నవా? నీ బతుకంతా పోసి వంట చేసిన ఇంత కూడా గతం గుర్తుకురాదు


ఏదో ఒకటి చేసి తీసుకురా ఉప్మా మాత్రం తీసుకుని వచ్చావో అని మోనిత అనేసరికి భయపడుతున్నావా మోనిత అని దీప నవ్వుతుంది. వెళ్ళు డాక్టర్ బాబు కోసం టిఫిన్ చేసి తీసుకుని వస్తాను అంటుంది. వారణాసి, శౌర్య ఆటోలో తిరుగుతూ దీప, కార్తీక్ కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్ళు కనిపించలేదని శౌర్య దిగులు పడుతుంది. అమ్మానాన్న అసలు ఈ ఊరిలో ఉన్నారా అని వారణాసి అనుమానంగా అడుగుతాడు. అమ్మనాన్నల ఫోటో ఉంటే వాళ్ళని వెతికించచడం చాలా ఈజీ అవుతుందని శౌర్య అంటుంది. వాళ్ళకి యాక్సిడెంట్ అయిన దగ్గరకి వెళ్ళి అడిగితే ఏమైనా దొరుకుతారేమో అంటాడు. కానీ వద్దని శౌర్య చెప్తుంది.


Also Read: దేవిని పర్మినెంట్ గా ఆదిత్య దగ్గరకి పంపిద్దామన్న మాధవ్- రాధ తన ఇంటి దేవత అంటోన్న జానకి


మోనిత కోసం కార్తీక్ ఎదురు చూస్తూ ఉంటాడు. టిఫిన్ అడిగావ్ కదా అందుకే చెప్దామని వెళ్ళాను అని మోనిత చెప్తుంది. రేపు రాత్రి 7 గంటలకి మనం ముంబయి వెళ్తున్నాం అని మోనిత చెప్తుంది. కానీ ఆవిడ వంటని మిస్ అవుతున్నా అని కార్తీక్ చెప్తాడు. అప్పుడే వంటలక్కా అని పిలుస్తాడు. కానీ మీరు మాత్రం దీప అని పిలవాలి అంటుంది. కార్తీక్ కి గతంలో దీపతో ఉన్నవి మసకగా కనిపిస్తాయి. దీప కార్తీక్ కి టిఫిన్ పెడుతుంది. ఇప్పటికైనా నా పేర్లు గుర్తున్నాయా అని దీప అడుగుతుంది. గతాన్ని గుర్తు చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఆపు అని అరుస్తుంది మోనిత.


టిఫిన్ తింటూ వెళ్ళి మోనిత వాంతులు చేసుకుంటుంది. ఏమైందని కార్తీక్ కంగారు పడతాడు. కళ్ళు తిరిగినట్టు పడిపోతుంది. డాక్టర్ కి ఫోన్ చెయ్యమని కార్తీక్ శివని పిలుస్తాడు. గుండ్రాయిలా ఉంది దీనికి ఏమవుతుంది డాక్టర్ బాబుకి దగ్గర కావడానికి మళ్ళీ ఏదో నాటకం మొదలు పెట్టిందని దీప తిట్టుకుంటుంది. కార్తీక్ మాత్రం మోనిత అంటూ టెన్షన్ పడతాడు.


తరువాయి భాగంలో..


కార్తీక్ కోపంగా వంటలక్క దగ్గరకి వస్తాడు. నా భార్యకి విషం పెడతావ.. అసలు నీకు ఏం కావాలి డబ్బా.. నా కోసమా.. నాకు పెళ్లైంది భార్య ఉంది జన్మ జన్మల బంధం ఇంకెప్పుడు ఏ పరాయి స్త్రీ భయాత మీద అసలు పెట్టుకోకు అని కార్తీక్ దీపాకి వార్నింగ్ ఇస్తాడు. దీప ఆ మాటలకు చాలా బాధపడుతూ ఏడుస్తుంది.