Petrol-Diesel Price, 5 September: చమురు ఉత్పత్తి చేసే ఒపెక్‌ ప్లస్‌ దేశాలు ఇవాళ సమావేశం కానున్నాయి. ఉత్పత్తి తగ్గింపుపై ఆ సమావేశంలో చర్చిస్తారన్న అంచనాలతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో ధరలు ఇవాళ కూడా పెరిగాయి.  ఇవాళ బ్యారెల్‌ ఆయిల్‌ ధర 0.80 డాలర్లు పెరిగి 88.15 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.70 డాలర్లు పెరిగి 93.62 డాలర్లకు చేరింది. అన్ని దేశాలు ప్రామాణికంగా తీసుకునే బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఇప్పటికీ దాదాపు 100 డాలర్లకు అటుఇటుగానే కదులుతోంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఆందోళనకర అంశం.


అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో, మన తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు మార్పులు చోటు చేసుకున్నాయి. 


తెలంగాణలో ఇంధనం ధరలు (Petrol Price in Telangana)


హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) ఇంధన ధరల్లో కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు ఉండడం లేదు. నిన్నటితో (ఆదివారం) పోలిస్తే ఇవాళ (సోమవారం) కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు లీటరు పెట్రోల్ ధర ₹ 109.66 గా ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.82 గా ఉంది. 
వరంగల్‌లోనూ (Petrol Price in Warangal) ఇంధన ధరలు కొన్నాళ్లుగా స్థిరంగా ఉన్నాయి. ఈ నగరంలో లీటరు పెట్రోల్ ధర నేడు ₹ 109.10 గా ఉంది. లీటరు డీజిల్ ధర ₹ 97.29 వద్ద నిలకడగా ఉంది. 
వరంగల్ రూరల్ జిల్లాలో లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 97.49 గా ఉండగా, ఇవాళ ₹ 97.32 కి తగ్గింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.32 గా ఉండగా, ఇవాళ ₹ 97.87 కు పెరిగింది.
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.45 గా ఉండగా, ఇవాళ ₹ 111.36 కు తగ్గింది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 99.48 గా ఉండగా, ఇవాళ ₹ 99.40 కి తగ్గింది. 
నల్లగొండలో (Petrol Price in Nalgonda) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.57 గా ఉండగా, ఇవాళ ₹ 109.41 కి దిగి వచ్చింది. డీజిల్‌ ధర నిన్న ₹ 97.72 కాగా, ఇవాళ ₹ 97.57 కి చేరింది.
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.78 గా ఉండగా, ఇవాళ ₹ 109.32 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.92 గా ఉండగా ఇవాళ ₹ 97.50 గా నమోదైంది.
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 111.90 గా ఉండగా, ఇవాళ కూడా ₹ 111.90 గా ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.90 వద్ద ఉండగా, ఇవాళ కూడా  ₹ 99.90 గా ఉంది.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధనం ధరలు (Petrol Price in Andhra Pradesh)


విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ ధర నిన్న (ఆదివారం) ₹ 112.31 నుంచి ఇవాళ (సోమవారం) ₹ 112.03 కు తగ్గింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 100.02 గా ఉండగా, ఇవాళ ₹ 99.76 కు తగ్గింది. 
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.92 గా ఉండగా, ఇవాళ ₹ 111.78 కి దిగి వచ్చింది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.65 నుంచి ఇవాళ ₹ 99.51 కి చేరింది.
రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.37 గా ఉంటే, ఇవాళ ₹ 111.09 గా నమోదైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.13 గా ఉండగా, ఇవాళ ₹ 98.87 కు తగ్గింది. 
విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ ధర నిన్నటి ₹ 110.64 నుంచి ఇవాళ ₹ 111.28 కి పెరిగింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.42 గా ఉండగా, ఇవాళ ₹ 99.01 గా నమోదైంది. 
తిరుపతిలో (Petrol Price in Tirupati)  లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 112.27 గా ఉండగా, ఇవాళ ₹ 111.98 కు తగ్గింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.96 గా ఉండగా, ఇవాళ ₹ 99.69 కి దిగి వచ్చింది.
కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.41 గా ఉంటే ఇవాళ ₹ 111.90 గా నమోదైంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.18 నుంచి ఇవాళ ₹ 99.64 కు చేరింది.
అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 112.39 గా ఉంటే, ఇవాళ ₹ 112.11 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 100.10 గా ఉండగా, ఇవాళ ₹ 99.84 కి తగ్గింది.