అమెరికా- రష్యా మధ్య ఉక్రెయిన్ వేడి మరింత పెరిగింది. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్‌కు బైడెన్ వార్నింగ్ ఇచ్చినట్లు శ్వేతసౌధం వర్గం ప్రకటించింది.
దేనికైనా రెడీ
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలకు దిగడం వల్ల ప్రాణ నష్టంతో పాటు దేశాల మధ్య దూరం పెరిగే అవకాశం ఉందని బైడెన్ వివరించినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. దౌత్యపరంగా చర్చలు చేపట్టేందుకు అమెరికా కట్టుబడి ఉన్నా పరిస్థితి దిగజారితే మిత్రదేశాల సహకారంతో మరింత దీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ స్పష్టం చేసినట్లు పేర్కొంది.
సరిహద్దులో
ఉక్రెయిన్ సరిహద్దుల్లో ప్రస్తుతం వాతావరణం ఉత్కంఠగా ఉంది. బీజింగ్ ఒలింపిక్స్ ముగిసేలోపు రష్యా ఆ దేశంపై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ నుంచి తన బలగాలను, సిబ్బందిని అమెరికా తిరిగి రప్పించుకుంటోంది. రష్యా.. ఉక్రెయిన్‌పై దాడి చేయనున్నట్లు వస్తున్న వార్తలను మాస్కో ఖండిస్తోంది. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ ఉక్రెయిన్‌పై దాడి గురించి మాత్రం రష్యా స్పష్టత ఇవ్వట్లేదు.
ఉక్రెయిన్‌కు అమెరికా తన సేనలను పంపుతుందా అన్న వ్యాఖ్యలపై బైడెన్ ఇటీవల సమధానం ఇచ్చారు.
Also Read: Black Diamond: వేలానికి ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం, ఎంతకి అమ్ముడుపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Also Read: Donald Trump News: ట్రంప్ చాలా రొమాంటిక్- కిమ్ రాసిన ప్రేమలేఖలు పట్టికెళ్లిపోయారట!