అలంకార ఆభరణాల్లో భాగమైపోయింది వజ్రం. చిన్న ముత్యమంత వజ్రం కూడా లక్షల్లో పలుకుతుంది. వజ్రాలను వాటి ద్రవ్యరాశి, రంగు, స్పష్టత, కట్ (సిమెట్రీ, పాలిష్ డిజైన్) ఆధారంగా వాటి ధరను, విలువను నిర్ణయిస్తారు. ప్రపంచంలోనే అది పెద్ద వజ్రం ఏదో తెలుసా? ఎనిగ్మా. భూమిపై దొరికిన అతి పెద్ద కట్ డైమండ్ గా ఇది పేరు పొందింది. 2006లో అది పెద్ద కట్ డైమండ్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇన్నాళ్లు ఈ వజ్రం లండన్లోని వేలం సంస్థ ఆధీనంలో ఉండేది. ఇటీవలే ఈ వజ్రాన్ని అమ్మేందుకు వేలం పాట నిర్వహించారు. ఒక అజ్ఞాతవ్యక్తి  ఈ నల్ల వజ్రాన్ని 32 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. ఆ డబ్బు మొత్తాన్ని క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించారు. తన ఊరు, పేరు మాత్రం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. 


ఉల్క తాకగా...
రెండు వందల 60 ఏళ్ల క్రితం ఒక ఉల్క లేదా గ్రహశకలం భూమిని తాకినప్పుడు ఈ వజ్రం ముక్క భూమిపై పడిందని నమ్ముతున్నారు శాస్త్రవేత్తలు. ఇది నల్లని కార్బోనాడో వజ్రం. లండన్లోని సోథెబీస్ ఆక్షన్ హౌస్ దీన్ని ఆన్ లైన్లో విక్రయించింది. 555.55 క్యారెట్లు, 55 కట్స్ కలిగిన డైమండ్ ఇది. ఈ వజ్రానికి 55 ముఖాలు గల డైమండ్ గా మార్చడానికి మూడేళ్ల కాలం పట్టింది. అలా మారాకే దీని ధర మరింతగా పెరిగింది. దీన్ని ఇటీవలే దుబాయ్, లాస్ ఏంజిల్స్, లండన్లో ప్రదర్శించారు. కార్బోనాడ్ వజ్రాలను నగలలో ఉపయోగించరు, వేలం వేసి అమ్మరు కూడా. అయితే ఎనిగ్మాను దానికున్న ప్రజాదరణను అంచనా వేసి వేలానికి పెట్టారు. దీన్ని ‘కాస్మిక్ వండర్’గా పేర్కొన్నారు వేలం సంస్థ అధికారులు. దీని ఖరీదు 32కోట్లుగా నిర్ణయించారు. ధర అధికంగా ఉండడంతో క్రిప్టోకరెన్సీని కూడా అనుమతిస్తామని ప్రకటించారు.





Also read: ప్రతి చిన్నవిషయానికి కోపం వస్తుందా? వీటిని రోజూ తినండి కంట్రోల్‌లో ఉంటుంది


Also read: మిగిలిపోయిన బిస్కెట్లతో ఇంట్లోనే మగ్ కేక్, అది కూడా అయిదు నిమిషాల్లో