Telugu News Today: ర్యాంప్ వాక్ చేస్తూ అబద్ధాలు చెప్పే జగన్, అభివృద్దిపై చర్చకు సిద్ధమా! సవాల్ చేసిన చంద్రబాబు - సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దం పేరుతో నిర్వహిస్తున్న సభల్లో ర్యాంప్ వాక్ చేస్తూ ప్రజలను మభ్యపెట్టే రీతిలో మాట్లాడుతున్నారంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన చంద్రబాబు.. వీటిపై చర్చకు సిద్ధమా..? అంటూ సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి బూటకపు హామీలన్నీ ఈ వీడియోలో ఉన్నాయంటూ చంద్రబాబు నాయుడు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


జగన్‌కు చిప్ పోయింది, కుర్చీ మడత పెట్టేందుకు ప్రజలు రెడీ అన్న లోకేష్
సీఎం జగన్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. మండుటెండలో కార్యకర్తలను సెల్ఫోన్ టార్చ్ ఆన్ చేయమంటూ చెప్పిన జగన్ కు చిప్ పోయిందని.. జగన్ చెప్పిన మాటలతో కార్యకర్తలు ఒకరు మొహం ఒకరు చూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని లోకేష్ విమర్శించారు. విశాఖ నగర పరిధి ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సదస్సులో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ విధానాలపై తీవ్రస్థాయిలో లోకేష్ ధ్వజమెత్తారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


'మహిళా రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తున్నారు' - మల్లికార్జున ఖర్గేకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో (Telangana) అధికార కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్ (BRS) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. చాలా రోజుల తర్వాత మళ్లీ రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kalavakuntal Kavitha) ఏకంగా కాంగ్రెస్ అధిష్టానానికే రాష్ట్ర పార్టీ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపిస్తూ ఓ లేఖ రాశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఖమ్మం ఎంపీ టిక్కెట్ కోసం కాంగ్రెస్ సీనియర్ల వార్ - గెలుపెవరిది ?
ఖమ్మం కాగ్రెస్ ఎంపీ టిక్కెట్ కోసం భారీ పోటీ నెలకొంది. మొదట సోనియా గాంధీ పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక రేసులో గట్టి పోటీ ఇస్తారనుకున్న రేణుకా చౌదరి  కూడా తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఇప్పుడు పోటీ అంతా పొంగులేటి ప్రసాద్ రెడ్డి,  మల్లు నందిని మధ్య ఉంది. వీరిద్దరి కోసం ఇద్దరు మంత్రులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఈనెల 24న హైదరబాద్‌లో షర్మిల కుమారుడి రిసెప్షన్
ఈ రోజుల్లో చిన్నా చితకా పెళ్లిళ్లే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పెళ్లివేడుక.. జీవితంలో ఒకే ఒకసారి వచ్చే సంబరం. ఈ వేడకును జీవితాంతం గుర్తుండిపోయేలా నిర్వహించాలనకుంటారు. అందుకే పెద్దలు పెళ్లిచేసి చూడు ఇళ్లు కట్టి చూడు అని కూడా అంటారు. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు శక్తికి మంచి ఖర్చు చేస్తున్నారు. మరి డబ్బులంటేనే కొదవలేని కుటుంబాలు...దేశంలోనే ఓ రకమైన గుర్తింపు కలిగిన రాజకీయ కుటుంబాలు, పైగా ఓ రాష్ట్రానికి జాతీయపార్టీ అధ్యక్షురాలి కుమారుడి ఇంట పెళ్లి వైభవం ఏ రేంజ్ లో ఉంటుందో మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాజీముఖ్యమంత్రి మనవడు, ప్రస్తుత ముఖ్యమంత్రి మేనల్లుడు, ఏపీ పీసీసీ అధ్యక్షురాలి కుమారుడి వివాహం రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌లో ఘనంగా జరిగింది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి