Man Brutally Murder in Nellore District: నెల్లూరు (Nellore) జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. ఓ వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపేశారు. నెల్లూరు జిల్లా రామచంద్రాపురంలో (Ramachandrapuram) ప్రసాద్ అనే యువకుడిని భార్య కళ్లెదుటే హతమార్చారు. భార్య నోట్లో గుడ్డలు కుక్కిన దుండగులు.. ఆమె ఎదుటే భర్తను చిత్రహింసలకు గురి చేసి చంపినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని శరీరంపై 25కు పైగా కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలు సేకరించాయి. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Also Read: Accidents: సీటు బెల్ట్‌లు, ఎయిర్ బ్యాగులే ప్రాణాలు కాపాడాయి. స్పల్ప గాయాలతో బయటపడిన ఇద్దరు ఎమ్మెల్యేలు