CAR ACCIDENTS: రోడ్డు ప్రమాదం నుంచి ఇద్దరు కీలక ఎమ్మెల్యేలు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆదివారం రాత్రి జరిగిన రెండు వేర్వురు రోడ్డు ప్రమాదాల నుంచి తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్(Adluri Laxman) తోపాటు, ఏపీలోని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravi) కారు సైతం ప్రమాదానికి గురైంది. సీటు బెల్టు పెట్టుకొని ఉండటం వెంటనే కారులోని ఎయిర్ బ్యాగ్ లు ఓపెన్ అవ్వడంతో బతికి బయటపడ్డారు.


అడ్లూరి కారు బోల్తా
తెలంగాణ ప్రభుత్వ విప్‌, ధర్మపురి(Dharmapuri) ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ (Adluri Laxman)కుమార్‌కు ప్రమాదానికి గురయ్యారు. ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఆయన కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని వెంటనే కరీంనగర్(Karimnagar) తరలించి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.


ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్ లో పనులు ముగించుకుని ఆదివారం అర్థరాత్రి ధర్మపురి బయలుదేరారు. ఆయనతో పాటు మరికొందరి సహచరులు కారులో ఉన్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి  అంబారిపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి వీరు ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేతోపాటు ఆయనతో ఉన్న సహచరులు స్పల్పంగా గాయపడ్డారు. సీటు బెల్టు పెట్టుకోవడం కారులోని ఎయిర్ బ్యాగులు(Air Bags) తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పంది. లక్ష్మణ్ తలకు గాయం కాగా..వెంటనే మరో వాహనంలో ఆయన్ను కరీంనగర్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


ఈ సమాచారం తెలియగానే పెద్దఎత్తున ఆయన అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు, ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీశారు. ఇంకా పెద్దఎత్తున నియోజకవర్గం నుంచి కరీంనగర్ కు అభిమానులు తరలివస్తుండటంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వారించారు. ఆయన క్షేమంగానే ఉన్నారని...ఒకటి, రెండురోజుల్లో ఇంటికి వచ్చేస్తారని తెలిపారు. పెద్దఎత్తున అభిమానులు తరలిరావడంతో ఆస్పత్రి వద్ద ఇతర రోగులకు ఇబ్బందులు తలెత్తుతాయని వారించారు.


ప్రాణాలతో బయటపడిన గొట్టిపాటి
ఆదివారం రాత్రి జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఏపీలోని అద్దంకి(Adhanki) తెలుగుదేశం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravi) ప్రాణాలతో బయటపడ్డారు. ఆదివారం నాడు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా తెలంగాణలోని సూర్యాపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వెంటనే ఎయిర్ బెలూన్లు ఓపెన్ అవ్వడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే మరో కారులో ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపోయారు. ఎలాంటి గాయాలు కాలేదని....తాను క్షేమంగానే ఉన్నట్లు గొట్టిపాటి రవి తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళనపడాల్సిన పనిలేదన్నారు. 


కాపాడిన సీటు బెల్టులు ఎయిర్ బెలూన్లు
రెండు రోడ్డు ప్రమాదాల్లోనూ వారు సీటు బెల్టు పెట్టుకోవడంతో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఎమ్మెల్యేలిద్దరూ  హైఎండ్ వాహనాలు వాడుతుండటంతో వాటిల్లో రెండుకు మించి ఎయిర్ బెలూన్లు ఉండటంతో ఎమ్మెల్యేలతో పాటు మిగిలిన సహచరులు ప్రాణాలతో బయటపడ్డారు. అర్థరాత్రులు ప్రయాణలతోనే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.