South Africa all rounder Mike Procter : దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్‌ మైక్‌ ప్రోక్టర్‌(Mike Procter) మరణించాడు. డర్బన్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన కన్నుమూశారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రోక్టర్‌ క్రికెట్‌ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మిడిలార్డర్‌ బ్యాటర్‌గా.. తెలివైన కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా( South African) క్రికెట్‌పై ప్రోక్టర్‌ చెరగని ముద్ర వేశారు. కెప్టెన్‌, కోచ్‌, పరిపాలకుడు, సెలెక్టర్‌, వ్యాఖ్యాత, ఐసీసీ మ్యాచ్‌ రిఫరీగా ప్రోక్టర్‌ బహుముఖ పాత్ర పోషించాడు. గుండెకు శస్త్రచికిత్స తర్వాత పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిసింది. నిషేధం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోని పునరాగమనం చేసిన సౌతాఫ్రికా జట్టు తొలి కోచ్‌గా ప్రోక్టర్‌ వ్యవహరించాడు. తన జీవిత చరమాంకంలో పేద పిల్లలకు కోచింగ్‌ ఇస్తూ గడిపాడు.  2008లో సిడ్నీ టెస్టులో జరిగిన మంకీ గేట్‌ వ్యవహారంలో భారత స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌పై మూడు టెస్టుల నిషేధం విధిస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకొన్న మ్యాచ్‌ రెఫరీ ప్రోక్టరే. 


ప్రోక్టర్‌ కెరీర్‌
దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్‌ మైక్‌ ప్రోక్టర్‌ తరఫున ఏడు టెస్టుల్లో 226 పరుగులు సాధించిన ప్రోక్టర్‌.. 41 వికెట్లు పడగొట్టాడు. వర్ణ వివక్ష కారణంగా సౌతాఫ్రికాపై నిషేధం విధించడంతో.. ప్రోక్టర్‌ తన కెరీర్‌లో 7 టెస్టులు మాత్రమే ఆడాడు. 1970, 1980ల్లో ప్రపంచ క్రికెట్‌ నుంచి దక్షిణాఫ్రికా బహిష్కరణ కారణంగా ప్రోక్టర్‌ ఎక్కువ టెస్టులు ఆడలేకపోయాడు. అయితే ప్రోక్టర్‌ 401 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 21,936 పరుగులు రాబట్టాడు. అందులో 48 శతకాలు, 109 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 1,417 వికెట్లు తీశాడు. 70 సార్లు అయిదు వికెట్లు, 15 మార్లు 10 వికెట్లు పడగొట్టాడు. 


దక్షిణాఫ్రికాకు తప్పని ఓటమి
విల్ యంగ్‌తో కలిసి 152 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కేన్‌ మామ.. 133 పరుగులతో అజేయంగా నిలవడంతో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో న్యూజిలాండ్‌ 7 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న కేన్‌ విలియమ్సన్‌ 260 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్సతో 133 పరుగులతో అజేయంగా నిలిచి న్యూజిలాండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్సుల్లోనూ సెంచరీలు చేసిన విలియమ్సన్‌...రెండో టెస్ట్‌లోనూ సెంచరీ చేసి సత్తా చాటాడు.


ప్రొటీస్‌పై తొలి సిరీస్‌ విజయం
దక్షిణాఫ్రికాపై కివీస్‌కు ఇదే తొలి టెస్టు సిరీస్‌ విజయం కావడం విశేషం. 267 ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 40/1తో నాలుగో రోజు, శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన కివీస్‌.. లేథమ్‌ (30) వికెట్‌ను త్వరగా కోల్పోయింది. ఈ స్థితిలో విలియమ్సన్‌ స్థిరంగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. మొదట రచిన్‌ రవీంద్ర (20)తో ఇన్నింగ్స్‌ నిలబెట్టిన అతడు.. ఆ తర్వాత విల్‌ యంగ్‌ (60 నాటౌట్‌) జతగా జట్టును విజయతీరాలకు చేర్చాడు. యంగ్‌తో అబేధ్యమైన నాలుగో వికెట్‌కు కేన్‌ 152 పరుగులు జోడించాడు  గత 12 ఇన్నింగ్స్‌ల్లో అతడికిది ఏడో సెంచరీ కావడం విశేషం.
టెస్టుల్లో నెంబర్‌ వన్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్న విలియమ్సన్.. ఈ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు చేశాడు. 134 సగటుతో మొత్తం 403 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ సిరీస్‌లో కేన్‌ మామ 19 గంటలపాటు బ్యాటింగ్‌ చేశాడు.