Telugu News Today 17 February 2024: కాంగ్రెస్ హయాంలో పూర్తైందని నిరూపిస్తే రాజీనామా చేస్తా- మిడ్‌ మానేరు ప్రాజెక్టుపై హరీష్‌ సవాల్
తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేత పత్రం అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లకు దారి తీసింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన శ్వేత పత్రం తప్పుల తడకగా ఉందన్నారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు. గత ప్రభుత్వంపై బురద జల్లేందుకే దీన్ని సభలోకి తీసుకొచ్చారని ఆరోపించారు. అన్నింటినీ రుజువు చేసేందుకు తమకు సమయం కావాలని స్పీకర్‌కు హరీష్ రిక్వస్ట్ పెట్టారు. దీనిపై మాట్లాడేందుకు మాత్రం హరీష్‌కు కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే కేటాయించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు - కేంద్ర మంత్రి చొరవతో భక్తులకు అందుబాటులోకి సర్వీసులు
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం (Medaram) సమ్మక్క, సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. జాతర సందర్భంగా ఈ నెల 21 నుంచి 24 వరకు ఈ ప్రత్యేక రైళ్లు భక్తుల సౌకర్యార్థం నడుస్తాయని తెలిపారు. ఈ సర్వీసులు సికింద్రాబాద్ - వరంగల్, నిజామాబాద్ - వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్ - వరంగల్ మార్గంలో నడుస్తాయని పేర్కొన్నారు. బెల్లంపల్లి, మంచిర్యాల్, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరి, జనగాం, ఘన్‌పూర్, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరు తదితర ప్రాంతాల్లోని భక్తులకు.. ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయి.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఆమంచి కృష్ణమోహన్‌కు దారేది ? వైసీపీలో ఇక టిక్కెట్ ఇవ్వరా ?
 వైఎస్ఆర్‌సీపీ ఏడో జాబితాలో రెండే పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి పర్చూరు ఇంచార్జ్‌గా ఎడం బాలాజీ అనే నేతను నియమించడం. ఆ నియామకం కాదు ఆశ్చర్యకరమైన విషయం.. ఆ నియోజకవర్గంలో బలమైన నేత ఆమంచి కృష్ణమోహన్ ను తప్పించడం .. ఆయనకు మరో నియోజకవర్గం చూపించకపోవడమే వైసీపీ వవర్గాను సైతం ఆశ్చర్య పరిచింది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు పడిన ఆయనకు ఈ విషయంలో ముందే చెప్పారా లేదా అన్నదానిపైనా స్పష్టత లేదు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


'ప్రజల కన్నీరు నుంచి సూపర్ 6 మేనిపెస్టో వచ్చింది' - సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుందన్న నారా లోకేశ్
రాష్ట్ర ప్రజల కన్నీరు నుంచే చంద్రబాబు సూపర్ 6 మేనిఫెస్టో వచ్చిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో శనివారం నిర్వహించిన టీడీపీ 'శంఖారావం' (Shankaravam) సభలో ఆయన మాట్లాడారు. జగన్ సీఎం అయ్యాక బీసీలకు అన్యాయం చేశారని.. సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి ప్రజలను మోసగించారని మండిపడ్డారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్.. లిక్కర్ నిషేధించారా.? అని ప్రశ్నించారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కులగణనకు చట్టబద్ధత కల్పించాలి - ఎమ్మెల్సీ కవిత డిమాండ్
తెలంగాణ అసెంబ్లీలో చేసిన కులగణన తీర్మానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కులగణన తీర్మానం కేవలం కంటితుడుపు చర్య అని ఆమె కొట్టిపారేశారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కులగణనకు చట్టబద్ధత కల్పించాలని, తక్షణమే ఆ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలని ఆమె డిమాండ్‌ చేశారు. బీసీ సబ్ ప్లాన్‌కు కూడా చట్టబద్ధత కల్పించాలన్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి