Harish Rao Challenge: తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేత పత్రం అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లకు దారి తీసింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన శ్వేత పత్రం తప్పుల తడకగా ఉందన్నారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు. గత ప్రభుత్వంపై బురద జల్లేందుకే దీన్ని సభలోకి తీసుకొచ్చారని ఆరోపించారు. అన్నింటినీ రుజువు చేసేందుకు తమకు సమయం కావాలని స్పీకర్‌కు హరీష్ రిక్వస్ట్ పెట్టారు. దీనిపై మాట్లాడేందుకు మాత్రం హరీష్‌కు కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే కేటాయించారు. 


అభూతకల్పనలతో బీఆర్‌ఎస్‌పై తప్పుడు ఆరోపణలు చేసేందుకే సత్యదూరమైన పత్రాన్ని సభలో ప్రవేశ పెట్టాలని విమర్శించారు హరీష్‌రావు. ఇది శ్వేత పత్రం కాదని.. అబద్దపు పత్రమని కామెంట్ చేశారు. మిడ్‌మానేరు విషయంలో మంత్రి చెప్పిందంతా అబద్దమని అన్నారు. 775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిడ్‌మానేరు, ఎల్లంపల్లి తమ హయాంలో పూర్తైందన్నారు. ఈ ప్రాజెక్టులు కాంగ్రెస్‌ హయాంలో పూర్తి అయ్యాయని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇకపై పోటీ చేసి సభలో అడుగు పెట్టబోనని సవాల్ చేశారు.  


ఇంకా హరీష్‌రావు ప్రసంగంలోని ముఖ్యాంశాలు... మిడ్ మానేర్ ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి అయ్యింది అన్నారు. కాలేదు. అప్పుడు రూ. 106 కోట్లు ఖర్చు చేస్తే, మేము వచ్చాక 775 కోట్లు మేము పూర్తి చేసి నీళ్ళు ఇచ్చాం.
అబద్ధం2
ఖర్చు, ఆయకట్టు విషయంలో తప్పుగా చెప్పారు. ఒక్కో పేజీలో ఒక్కో విధంగా చెప్పారు. 
అబద్దం3
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మేము కేంద్రానికి పిర్యాదు చేయలేదు అన్నారు. తప్పు అది. 5- 5- 2020 జీఓ నాడు వచ్చింది. అయితే జనవరి లోనే మేము కేంద్రానికి ఫిర్యాదు చేశాము. 
అబద్దం4
కె ఆర్ ఎం బి కి అప్పగించాలని గెజిట్ ఇస్తే మేము సవాల్ చేయలేదు అని పేజీ 14 లో చెప్పారు. అది తప్పు మేము వ్యతిరేకిస్తూ అపెక్స్ కౌన్సిల్ రిఫర్ చేయాలని చెప్పాము.
అబద్ధం5
కెఅర్ఎంబి కి అప్పగించింది మేము అన్నారు. అవాస్తవం. మీరు అధికారంలోకి వచ్చాక  బోర్డుకు అప్పగించినట్లు చెప్పే మినట్స్ ఆఫ్ ద మీటింగ్ ముందు పెట్టాము. ఇదే విషయం అన్ని పత్రికల్లో వచ్చింది. 
అబద్ధం6
50:50 రేషియో కోసం మేము కొట్లడలేదు అన్నారు. రాష్ట్ర విభజన నుంచి ఎన్నోసార్లు కోరాం. ఫిర్యాదులు చేశాం. న్యాయమైన వాటా కోసం ట్రైబ్యునల్ వేయాలని డిమాండ్ చేస్తూ వచ్చాం.


హరీష్‌ రావు మాట్లాడుతున్నంత టైం అధికార పక్షం అడ్డుతగులుతూనే ఉంది. ఆయన చేసిన ప్రతి కామెంట్‌కు కౌంటర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో శ్వేత పత్రంపై వాడీ వేడి చర్చ సాగింది. తప్పుడు లెక్కలతో గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు హరీష్‌రావు. కృష్ణా నదిపై ప్రాజెక్టులు అప్పగిస్తామన్న గెజిట్‌ తీసుకొస్తే ఖండించిన దిక్కులేదన్నారు. తాము వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని సిద్ధమైతే ప్రభుత్వం స్పందించందన్నారు. ఎన్నికల ప్రచారంలో గోబెల్స్‌ప్రచారం చేసినట్లే.. సభలోనూ గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆయకట్టు విషయంలో రెండు చోట్ల రెండు రకాలుగా చెప్పారన్నారు హరీష్‌. రూ.775 కోట్లు ఖర్చు పెట్టి ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు పూర్తి చేశామని... సభను ఉత్తమ్‌ తప్పుదోవ పట్టించే యత్నం చేశారన్నారు.