Irrigation Projects In Telangana : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఇవాళ సభలో ఇరిగేషన్‌పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. నీటి ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సభలో వైట్‌పేపర్‌ రిలీజ్ చేసి మాట్లాడారు. ఇది స్వతంత్ర్య భారత దేశంలోనే అతి పెద్ద కుంభ కోణం అని ఆరోపించారు. కీలకమైన బ్యారేజ్‌ ఇలా నాణ్యత లోపంతో కుంగిపోవడం చాలా దురదృష్ణకరమని కామెంట్ చేశారు. వందేళ్లు భద్రంగా ఉండాల్సిన కట్టడం మూడేళ్లకే కుప్పకూలిందన్నారు. గత ప్రభుత్వ అవినీతి వల్ల ప్రాజెక్టు కుప్పకూలిందన్నారు. 


నీటి ప్రాజెక్టులపై సభ్యులకు పూర్తి అవగాహన కల్పించేందుకు అసెంబ్లీలో పవర్‌ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ వివరించారు. కాళ్వేశ్వరంలో మేడిగడ్డ కీలకమైన బ్యారేజు అని తెలిపారు. ఇది గుండెకాయలాంటిదన్నారు. అలాంటి బ్యారేజ్‌ నిర్మాణంలో లోపారు కారణంగా ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని ఆరోపించారు. అవగాహన లేకుండానే దీని నిర్మాణం చేపట్టారని విమర్సించారు. వందేళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. 


ఈ బ్యారెజ్‌ నిర్మాణానకి ముందు 18 వందల కోట్లకు టెండర్‌ పిలిచారని... నిర్మాణానికి మాత్రం నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని తెలిపారు ఉత్తమ్‌కుమార్ రెడ్డి. రానురాను ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ వెళ్లారని విమర్శించారు. ఈ సందర్భంగా నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథార్టీ ఇచ్చిన నివేదికను సభలో ఉంచారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా నాసిరకంగా ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు. 


లోపాభూయిష్టంగా ఉన్న మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ అక్టోబర్ నుంచి నేటి వరకు కేసీఆర్‌ స్పందించలేదని విమర్శించారు ఉత్తమ్‌. గత ప్రభుత్వ అవినీతి నిర్లక్ష్యం కారణంగా బ్యారేజ్‌ బాగా పాడైపోయిందన్నారు. గత పదేళ్లలో ఇరిగేషన్‌లో జరిగిన అవినీతి మరెక్కడా జరగలేదన్నారు. స్వతంత్య్ర భారత దేశంలో ఇప్పటి వరకు చూడలేదన్నారు. ఇలాంటి తప్పులు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి బీఆర్‌ఎస్‌ క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేసారు.


నేషల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథార్టీ ఏం చెప్పింది... 
*ప్లానింగ్‌, డిజైన్‌, క్వాలిటీ కంట్రోల్‌, ఆపరేషన్, నిర్వహణ పూర్తిగా నాసిరకం 
*క్వాలిటీ కంట్రోల్ లేకపోవడంతో నిర్మాణంలో తప్పులు
* ప్రీమాన్‌సూన్, పోస్ట్ మాన్‌సూన్‌ టైంలో తనిఖీలు చేయలేదు
* అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కూడా అదే తరహాలో నిర్మించారు. అందుకే ఆ ప్రాజెక్టుల్లో నీరు నింపొద్దు 


ఒక్క మేడిగడ్డే కాదని అన్నారం బ్యారేజీ కూడా లోపాభూయిష్టంగా ఉందన్నారు ఉత్తమ్. అక్కడ కూడా లీకులు వస్తున్నాయని తెలిపారు. అందుకే ఆ బ్యారేజ్‌లో నీరు నింపొద్దని ఎన్‌డీఎస్‌ఏ సూచించినట్టు పేర్కొన్నవారు. ఉన్న నీటి కూడా తొలగించాలని హెచ్చరించినట్టు తెలిపారు.