Nara Lokesh Shankaravam Speech in Srungavarapukota: రాష్ట్ర ప్రజల కన్నీరు నుంచే చంద్రబాబు సూపర్ 6 మేనిఫెస్టో వచ్చిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో శనివారం నిర్వహించిన టీడీపీ 'శంఖారావం' (Shankaravam) సభలో ఆయన మాట్లాడారు. జగన్ సీఎం అయ్యాక బీసీలకు అన్యాయం చేశారని.. సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి ప్రజలను మోసగించారని మండిపడ్డారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్.. లిక్కర్ నిషేధించారా.? అని ప్రశ్నించారు. టీడీపీ మేనిఫెస్టోను చూసి  సీఎం జగన్ (CM Jagan) భయపడుతున్నారని.. ఆయనకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. 'ఓ క్రికెటర్ వైసీపీలోకి వస్తే ఎంతిస్తావని అతడిని అడిగారు. ఓటమి భయంతోనే ఆయన ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలనే మార్చారు. జగన్ పాలనలో ముమ్మాటికీ సామాజిక అన్యాయమే జరిగింది. బీసీలంటే జగన్ కు చిన్న చూపని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రావాల్సిన 10 శాతం రిజర్వేషన్ కూడా ఇవ్వలేదు. ఎర్ర బుక్ చూసి కూడా జగన్ వణుకుతున్నారు. ఆయన ఓ కటింగ్.. ఫిటింగ్ మాస్టర్ అని పచ్చ బటన్ నొక్కి రూ.10 వేసి ఎర్ర బటన్ నొక్కి రూ.100 లాగుతున్నారు. త్వరలో గాలిపై కూడా పన్ను వేస్తారేమో. వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక సీఎం జగన్. రాబోయే 2 నెలల్లో జగన్ తో రాష్ట్ర ప్రజలు ఫుట్ బాల్ ఆడుకోబోతున్నారు.' అంటూ మండిపడ్డారు.






Also Read: AP Politics : టీడీపీలో చేరికల జోరు - వైఎస్ఆర్‌సీపీలో అభ్యర్థుల గందరగోళం ! రాజకీయం మలుపులు తిరుగుతోందా ?