Telugu News Today: వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్ జారీ - ఏ కేసులో అంటే ?
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ప్రతినిధుల కోర్టు షాకిచ్చింది. గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనపై కేసు నమోదైంది. అయితే, ఆ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని కోర్టు పలుసార్లు వంశీకి నోటీసులు అందించినా రాకపోవటంతో తాజాగా.. వంశీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో మొత్తం 38 మందిపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


అనంతపురం జిల్లాలో చేయి గుర్తుపై పోటీకి నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిద్ధం
ఉమ్మడి అనంతపురం(Anathapur) జిల్లా....ఒకప్పుడు కాంగ్రెస్(Congress) పార్టీకి కంచుకోట. కాకలు తీరిన రాజకీయ ఉద్దండులతో రాష్ట్ర రాజకీయాలపై బలమైన ప్రభావం చూపేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి  హయంలో జిల్లాలో పార్టీ ఓ వెలుగు వెలిగింది. రాష్ట్ర విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్.... అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో అడ్రస్ లేకుండా పోయింది. ఏపీ కాంగ్రెస్ ఇక బతకడం కష్టమేనన్నారు.కానీ దశాబ్దాలపాటు తిరుగులేని రాజకీయం చేసిన కాంగ్రెస్ కు గ్రామస్థాయి నుంచి బలమైన కేడర్ ఉంది. కానీ వారికి మార్గనిర్దేశం చేసే నాయకుడే లేకపోవడంతో నిస్తేజంగా ఉన్న వారందరికీ షర్మిల(Ap Pcc Chief Sharmila) రాక నూతనోత్సాహం వచ్చింది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


నేడు ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారావం- దత్తతపై ‌ప్రకటన చేస్తారా!
లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారి పర్యటించనున్న ఆయన ఇంద్రవెల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరుతో ఏర్పాటు చేస్తున్న సభకు భారీగా జన సమీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు జనాలను తరలించారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


టీడీపీ వల్లే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది- చంద్రబాబుకు థ్యాంక్స్‌ చెప్పిన పొంగులేటి
తెలంగాణ ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు (Minister Ponguleti Srinivasa Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వల్లే తెలంగాణలో  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారాయన. ఖమ్మం (Khammam) జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు పొంగులేటి. తెలంగాణలో టీడీపీ  వల్లే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని... స్పష్టం చేశారు. అందుకు గాను... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ (Nara Lokesh)కు, టీడీపీ శ్రేణులకు  కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఈ నెల 5 నుంచి మళ్లీ జనంలోకి నారా లోకేష్‌.. ఈసారి `శంఖారావం` స‌భ‌లు
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి(TDP General Secretary), మాజీ మంత్రి నారా లోకేష్ తిరిగి ప్ర‌జాబాట ప‌ట్ట‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఆయ‌న ఉత్త‌రాంధ్ర నుంచి `శంఖారావం`(Shankaravam) పేరుతో స‌భ‌ల‌కు ప్రిపేర్ అవుతున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభంకానుంది. ఉత్త‌రాంధ్ర‌లోని పార్వ‌తీపురం మ‌న్యం, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్న ఆయ‌న‌.. శంఖారావం పేరుతో స‌భ‌లు నిర్వ‌హించి.. ఎన్నిక‌ల‌కు ఇటు కేడ‌ర్‌ను.. అటు ప్ర‌జ‌ల‌ను కూడా స‌మాయ‌త్తం చేయ‌నున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి