తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల


తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్ లో 6 గ్యారంటీలు ప్రకటించిన తుక్కుగూడలోనే కాంగ్రెస్ మరో సభ నిర్వహిస్తోంది. తుక్కుగూడ వేదికగా రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికలకు 5 గ్యారంటీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేశారు. అంతకుముందు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి విమానంలో శంషాబాద్ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి కాంగ్రెస్ తుక్కుగూడలో నిర్వహిస్తోన్న జన జాతర సభకు హాజరయ్యారు. తుక్కుగూడ వేదికగా రాహుల్ గాంధీ తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు శంఖారావం పూరించారు. ఇంకా చదవండి


కుప్పంలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా


చిత్తూరు జిల్లా కుప్పంలో ముక్కుముడిగా వాలంటీర్లు రాజీనామా చేశారు. దాదాపు 384 మంది వాలంటీర్లు ఒకేసారిగా రాజీనామా చేయడం సంచలనం అయింది. తాము రాజీనామా పత్రాలను ఎంపీడీఓకు వాలంటీర్లు అందజేశారు. రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని, కుప్పం ఎమ్మెల్యే గా భరత్ గెలుపు కోసం రాజీనామా చేసినట్లు వాలంటీర్లు స్పష్టం చేశారు. ఇంకా చదవండి


'అందుకే వైసీపీకి రాజీనామా చేశా' - ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆసక్తికర వ్యాఖ్యలు


అనంతపురం జిల్లా వైసీపీ కీలక నేత, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ (Iqbal) శుక్రవారం ఆ పార్టీకి, తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, తన రాజీనామా వెనుక ఉన్న కారణాలపై ఆయన శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు హిందూపురం టికెట్ ఇవ్వనందుకు కాదని, అమర్యాదగా ప్రవర్తించినందుకే వైసీపీకి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. మైనారిటీలకు ఏమీ చేసే అవకాశం ఇవ్వలేదని.. చంద్రబాబు హయాంలోనే మైనారిటీలకు రక్షణ ఉండేదని అన్నారు. ఇంకా చదవండి


నేడు ఈ జిల్లాల్లో విపరీత వడగాల్పులు


ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు దక్షిణ, నైరుతి దిశల నుండి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం వుంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. ఇంకా చదవండి


AI టెక్నాలజీతో ఎన్నికల్ని ప్రభావితం చేయొచ్చా? ఓటర్ల మైండ్‌సెట్‌ని మార్చే వీలుంటుందా?


ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్. ఇప్పుడు ఈ టెక్నాలజీ (Artificial Intelligence in Elections) గురించే ప్రపంచం అంతటా చర్చ జరుగుతోంది. ప్రతి సెక్టార్‌లోనూ AI వినియోగం క్రమంగా పెరుగుతోంది. కంటెంట్ క్రియేట్ చేస్తే ChatGPT టూల్ నుంచి ఏకంగా ఓ మనిషిని పోలే మనిషిని తయారు చేయడం వరకూ అన్నీ సాధ్యమవుతున్నాయి ఈ టెక్నాలజీతో. ఈ మధ్య మీడియాలోనూ వాడకం పెరిగింది. AI యాంకర్‌లతో వార్తలు చదివిస్తున్నాయి పలు సంస్థలు. కొన్ని కంపెనీలైతే AI టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఆ మేరకు మానవ వనరుల్ని తగ్గించుకుంటున్నాయి. ఇంకా చదవండి


భారత్‌లోని ఎన్నికల్లో చైనా జోక్యం


మైక్రోసాఫ్ట్ సంస్థ సంచలన విషయం వెల్లడించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో చైనా జోక్యం (China Plans to Disrupt Elections) చేసుకునే ప్రమాదముందని హెచ్చరించింది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశముందని తేల్చి చెప్పింది. కేవలం భారత్‌లోనే కాదు. అమెరికా, సౌత్ కొరియాలోని ఎన్నికల్లో ఇదే విధంగా జోక్యం చేసుకోవాలని కుట్రే చేస్తోందని వెల్లడించింది. ఇంకా చదవండి


అదితితో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ - తొలిసారి స్పందించిన సిద్ధార్థ్‌


కొంతకాలం సీక్రెట్‌ డేటింగ్‌ తర్వాత హీరోయిన్‌ అదితి రావ్‌ హైదరి, హీరో సిద్ధార్థ్‌లు పెళ్లికి సిద్ధమయ్యారు. రీసెంట్‌గా గుట్టుచప్పుడు కాకుండ సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ లవ్‌ బర్డ్స్‌ ఆ తర్వాత ఆఫిషియల్‌ చేశారు. వరంగల్‌ వనపర్తి టెంపుల్‌ తమళ్‌ పురోహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇంకా చదవండి


ఓట్ల ద్వారా నటీనటులు, టెక్నీషియన్ల ఎంపిక - ఆర్జీవీ కొత్త ప్రయోగం, ఇదేదో కొత్తగా ఉందే!


టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. తాజాగా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ‘యువర్ ఫిల్మ్’ అనే పేరుతో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఇది చూసిన నెటిజన్లు.. ఆయన కొత్త సినిమా టైటిల్ ఏమో అనుకున్నారు. కానీ దానికి సంబంధించి ఆయన విడుదల చేసిన మరిన్ని పోస్టర్స్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో కూడా అనుమానం మొదలయ్యింది. ‘ఆడియన్స్ సినిమాను హిట్ చేయగలిగినప్పుడు. వారే సినిమాను ఎందుకు చేయలేరు’ అంటూ కొత్త కోట్స్‌తో పోస్టర్లను షేర్ చేశారు. ఇక శనివారం రోజు ‘యువర్ ఫిల్మ్’ అంటే ఏంటి అనేదానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇంకా చదవండి


పుత్తడి కొనడానికి వెళ్తున్నారా? - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి


అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి మారథాన్‌ కొనసాగుతోంది, ధర రికార్డ్‌ స్థాయిలో ఉంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,349.10 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(22 కేరెట్లు) ధర 1,200 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 1,310 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 980 రూపాయల చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు 1800 రూపాయలు పెరిగింది. ఇంకా చదవండి


లక్నోపై ఓటమే లేని గుజరాత్‌, చరిత్ర మార్చేందుకు సిద్ధమా?


ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2024 సీజన్‌ 21వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT)తో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడనుంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో  తమ విజయాల జోరును కొనసాగించాలని రాహుల్‌ సేన చూస్తోంది. లక్నో పేస్‌ సెన్సేషన్ మాయంక్‌ యాదవ్‌పై అందరి దృష్టి  కేంద్రీకృతమైన వేళ... లక్నో పేస్‌కు.. గుజరాత్‌  బ్యాటర్లకు రసవత్తర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. బుల్లెట్లల దూసుకొచ్చే బంతులతో కచ్చితత్వంతో అభిమానులను, విమర్శకులను మయాంక్‌ యాదవ్‌ మెస్మరైజ్ చేశాడు. ఈ మ్యాచ్‌లోనూ మయాంక్‌ రాణిస్తాడని లక్నో అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఇంకా చదవండి