IPL 2024 MI vs DC Match preview and prediction: ఐపీఎల్‌(IPL) 2024 సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌(MI) మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో అమీతుమీకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ బరిలోకి దిగుతాడన్న వార్తలు... ముంబై ఇండియన్స్‌ అభిమానుల్లో కొత్త జోష్‌ను నింపుతున్నాయి. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచూల్లో వరుసగా పరాజయం పాలైన ముంబై ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.  ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. అంటే పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు... గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

 

రెండు జట్ల ఓటముల పరంపర

 ముంబై ఇండియన్స్‌ ఆడిన మూడు మ్యాచుల్లో పరాజయం పాలైతే.. ఢిల్లీ క్యాపిటల్స్‌  నాలుగు మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాలంటే ఫామ్, ఫిట్‌నెస్ కీలకం కావడంతో సూర్యకుమార్‌ యాదవ్‌ బరిలోకి దిగుతాడా అన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మూడు నెలలుగా చీలమండ గాయంతో చికిత్స తీసుకుని కోలుకున్న  సూర్యకుమార్‌ యాదవ్‌.. వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. సూర్యకుమార్ ఎలాంటి అసౌకర్యం లేకుండా బ్యాటింగ్ చేయడంతో ఈ మ్యాచ్‌లో సూర్య బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ భారీ స్కోర్లపై కన్నేశారు. తిలక్ వర్మ, నమన్ ధీర్ కూడా ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. ఈ ముంబై బ్యాటర్లు పర్వాలేదనిపిస్తున్నా.. భారీ స్కోర్లు చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా జట్టులో స్ఫూర్తిని నింపలేకపోతున్నాడు. హార్దిక్‌ పాండ్యాపై వెల్లువెత్తుతున్న ట్రోలింగ్‌ కూడా పతాకస్థాయికి చేరింది. 

 

పంత్‌పైనే చూపంతా

స్టార్ బ్యాటర్‌ రిషబ్ పంత్ వరుసగా రెండు అర్ధసెంచరీలు చేసి మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే 152 పరుగులు చేసిన పంత్‌ భారీ స్కోరు చేయాలని చూస్తున్నాడు. కానీ ఢిల్లీని బలహీనమైన బౌలింగ్‌ ఆందోళన పరుస్తోంది. గత మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోస్తూ కోల్‌కతా నైట్ రైడర్స్ 272 పరుగుల భారీ స్కోరు చేసింది. డేవిడ్ వార్నర్ 148 పరుగులు చేయగా, ట్రిస్టన్ స్టబ్స్ పర్వాలేదనిపిస్తున్నాడు. వాంఖడే స్టేడియం హోమ్‌గ్రౌండ్ అయిన పృథ్వీ షా భారీ ఇన్నింగ్స్‌ ఆడాలని ఢిల్లీ కోరుకుంటోంది. 

 

జట్లు: 

ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రెవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్, అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్ క్వేనా మఫాకా, మహ్మద్ నబీ, షమ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, విష్ణు వినోద్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్. 

 

ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్ ధుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, ఝే రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, స్వస్తిక్ చికారా, షాయ్ హోప్.