Siddharth React on Engagement and Marriage with Aditi: కొంతకాలం సీక్రెట్‌ డేటింగ్‌ తర్వాత హీరోయిన్‌ అదితి రావ్‌ హైదరి, హీరో సిద్ధార్థ్‌లు పెళ్లికి సిద్ధమయ్యారు. రీసెంట్‌గా గుట్టుచప్పుడు కాకుండ సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ లవ్‌ బర్డ్స్‌ ఆ తర్వాత ఆఫిషియల్‌ చేశారు. వరంగల్‌ వనపర్తి టెంపుల్‌ తమళ్‌ పురోహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే కెమెరా మ్యాన్‌, మీడియాకు అనుమతి లేకపోవడం అంతా ఇది పెళ్లి వేడుక అనుకున్నారు. సీక్రెట్‌ పెళ్లి చేసుకున్నారంటూ కథనాలు కూడా వచ్చేశాయి. కానీ రెండు రోజులు తర్వాత మెల్లిగా ఈ లవ్‌ బర్డ్స్‌ పెళ్లి కాదు రింగులు మార్చుకున్నామంటూ ఇద్దరు ట్విస్ట్‌ ఇచ్చారు.


సీక్రెట్, ప్రైవేట్ కి చాలా ఢిఫరెన్స్ ఉంది..


అలా పస్ట్‌ టైం ఇద్దరు తమ రిలేషన్‌లో ఒపెన్‌ అప్‌ అయ్యారు. జంటగా ఎన్నోసార్లు మీడియాకు చిక్కిన ఎనాడు తమ ప్రేమయాణాన్ని బయటపెట్టలేదు. చివరకు పెళ్లికి సిద్ధమై ఆఫీషియల్‌ చేశారు. అయతే తన పర్సనల్‌ విషయంలో సిద్ధార్థ్‌ చాలా గొప్యత పాటిస్తాడు. ఎన్నో అదితితో డైరెక్ట్‌గా కెమెరాలకు చిక్కినా.. అవైయిడ్‌ చేస్తూ వెళ్లిపోయేవాడు. అలాంటి సిద్ధార్థ్‌ తాజాగా అదితితో నిశ్చితార్థం, పెళ్లిపై తొలిసారి స్పందించాడు. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న సిద్ధార్థ్‌ మీడియాతో ఇంటారాక్ట్‌ అయ్యాడు. ఈ సందర్భంగా అదితితో పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ.. "మేము రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నామని అంటున్నారు. నిజానికి సీక్రెట్‌, ప్రైవేట్‌ అనే పదాలకు నా దృష్టిలో చాలా వ్యాత్యాసం ఉంది. మాది పెద్దల సమక్షంలో జరిగిన ప్రైవేట్‌ ఫంక్షన్‌. మా నిశ్చితార్థానికి ఎవరినైతే పిలవలేదు వారు ఇది సీక్రెట్‌ అని అంటున్నారు. ఇవన్ని నేను పట్టించుకోను. మాది షూటింగ్‌ డేట్‌ కాదు, లైప్‌టైం డేట్‌. ఇక పెద్ద నిర్ణయం ప్రకారమే మా పెళ్లి జరుగుతుంది" అని చెప్పుకొచ్చాడు.


అప్పుడు చాలా టెన్షన్ పడ్డాను..


ఇక ఇద్దరిలో ఎవరూ ముందు ప్రపోజ్‌ చేశారని హోస్ట్‌ అడగ్గా.. తానే ముందు ప్రపోజ్‌ చేశానని చెప్పాడు. మరి ఎస్‌ చెప్పడానికి అదితి ఎంతకాలం టైం తీసుకుందని ప్రశ్నించగా.. ఇలాంటి ప్రశ్నలు తనని అడగోద్దని, తనకు ఫైనల్‌ రిజల్ట్‌ ముఖ్యమన్నాడు. ఇక తాను ప్రపోజ్‌ చేయగానే అదితి ఎస్‌ చెబుతుందా? నో చెబుతుందా? అని చాలా టెన్షన్‌ పడ్డాడనన్నాడు. కానీ ఫైనల్‌గా తను ఎస్‌ చెప్పిందని, దీంతో తను పరిక్షలో పాస్‌ అయినంతగా ఖుష్‌ అయ్యానన్నాడు. కాగా నిశ్చితార్థంపై ఆఫీషియల్‌గా ప్రకటిస్తూ ఇద్దరు రింగ్స్‌ చూపిస్తూ "ఆమె ఎస్‌ చెప్పింది" అని సిద్ధార్థ్‌, "అతడు ఎస్‌ చెప్పాడు" అని అదితి పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అంటే ఒకేసారి ఇద్దరు ఒకరినోకర్‌ ప్రపోజ్‌ చేసుకున్నారని అర్థమైపోయింది.


మొత్తానికి అదితో పెళ్లిపై సిద్ధార్థ్‌ స్వయంగా స్పందించడం, పెళ్లి అప్‌డేడ్‌ ఇవ్వడంతో అతడి కామెంట్స్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. కాగా అజయ్ భూపతి తెరకెక్కించిన 'మహా సముద్రం'సినిమాలో  సిద్ధార్థ్, అదితి రావు హైదరి జంటగా నటించారు. ఆ సినిమా సెట్‌లో కలుసుకున్న వీరిద్దరి మధ్య  అప్పుడే పరిచయం, ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి వీరిద్దరు సీక్రెట్‌గా డేటింగ్‌ చేస్తున్నారు. కానీ ఏనాడు బయటపడలేదు. కానీ వీరీ సీక్రెట్‌ డేటింగ్‌, వెకేషన్ ఫోటోలు మాత్రం ఎప్పటికప్పుడ లీక్‌ అవుతూనే ఉన్నాయి. అయితే ఇద్దరికి ఇది రెండో వివాహమనే విషయం తెలిసిందే. గతంలో సిద్ధార్థ్‌కు, అదితికి పెళ్లయి విడాకులు కూడా అయిపోయాయి.