Mucherla Aruna: ఒకప్పుడు హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు చాలామంది ఇప్పుడు పూర్తిగా కనుమరుగు అయిపోయారు. వారిలో కొందరు మాత్రమే మళ్లీ సినిమాల మీద ఆసక్తిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. కొందరు మాత్రం ప్రేక్షకులకు దగ్గరగా ఉండడం కోసం సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు. ‘సీతాకోక చిలక’ నటి ముచ్చర్ల అరుణ.. రెండో కేటగిరికి చెందినవారు. ఈమె సినిమాలకు దూరమయ్యి ఎన్నో ఏళ్లు అయిపోయింది. కానీ ‘సీతాకోక చిలక’ చిత్రం మాత్రం ఇప్పటికీ చాలామంది తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. తాజాగా ఒక ఓపెనింగ్‌కు వచ్చిన అరుణ.. తన రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎంజాయ్ చేస్తున్నాను..
ప్రస్తుతం ఎంతోమంది సీనియర్ హీరోయిన్లు.. సినిమాల్లో రీఎంట్రీ ఇస్తుండగా ముచ్చర్ల అరుణకు కూడా అలాంటి ఆలోచన ఉందా అనే ప్రశ్న ఎదురయ్యింది. ‘‘నేను ఇంకా సినిమాలు చేయాలని అనుకోవడం లేదు. నాకు సరిపోయింది. నేను ఇన్‌స్టాగ్రామ్ వీడియోలతోనే ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఇదే సంతోషాన్నిస్తోంది. నా చిన్న కూతురే నా ఇన్‌స్టాగ్రామ్ వీడియోలను హ్యాండిల్ చేస్తుంది. కానీ ప్రస్తుతం తను ఎమ్ఎమ్‌బీబీఎస్ ఫైనల్ ఇయర్ కాబట్టి బిజీ అయిపోయింది’’ అంటూ తను సోషల్ మీడియాలోనే సంతోషంగా ఉన్నానని, మళ్లీ సినిమాల్లోకి రానని తేల్చిచెప్పారు అరుణ. ప్రస్తుతం తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వారందరికీ కిచెన్, హెల్త్ టిప్స్‌ను అందిస్తుంటారు అరుణ.
ఇన్‌స్టాగ్రామ్ స్టార్..
ఏం చేసినా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రేక్షకులకు సలహా ఇచ్చారు ముచ్చర్ల అరుణ్. ఎప్పుడైనా తన ముఖ్య ప్రాధానత్య ఆరోగ్యానికే అన్నారు. అందుకే ఏవైనా బ్రాండ్స్ ప్రమోషన్ కోసం తనను సంప్రదించినప్పుడు ముందుగా వాటిని తను ఉపయోగించి చూస్తానని క్లారిటీ ఇచ్చారు. ఎక్కువశాతం నేచురల్ పద్ధతిలోనే హెల్త్, కుకింగ్ టిప్స్ ఇస్తానని తెలిపారు. ఒకప్పుడు హీరోయిన్‌గా తెలుగులో వెలిగిపోయిన అరుణ.. ఇప్పుడు సోషల్ మీడియా స్టార్ అయిపోయారు. తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా అప్పుడప్పుడు ఫాలోవర్స్‌తో పంచుకుంటారు. కొన్నాళ్ల క్రితం తన కూతుళ్లతో కలిసి అరుణ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా అయ్యింది.
మ్యూజికల్ హిట్..
1981లో విడుదలయిన ‘సీతాకోక చిలక’ సినిమా ఓ రేంజ్‌లో సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. ఆరోజుల్లోనే ఒక హిందూ అబ్బాయికి, క్రిస్టియన్ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథను అందంగా చూపించారు దర్శకుడు భారతీరాజా. ముచ్చర్ల అరుణ తర్వాత ఎన్ని సినిమాల్లో నటించినా.. ఇప్పటికీ తనను ‘సీతాకోక చిలక’ హీరోయిన్‌గానే ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలను ఇప్పటికీ ప్రేక్షకులు వింటుంటారు. అప్పట్లోనే ఈ చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా నేషనల్ అవార్డ్ దక్కింది. మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరెక్కిన ‘సీతాకోక చిలక’ను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేనంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
Also Read: ‘ఇస్మార్ట్’ బ్యూటీకి గుడ్ టైమ్ స్టార్ట్, ఒకేసారి మూడు క్రేజీ ఆఫర్లు!