Nabha Natesh Movie Offers: కన్నడ భామ నభా నటేష్ గురించి తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓ రేంజిలో పాపులర్ అయ్యింది. ఈ చిత్రంలో తెలంగాణ పిల్ల చాందిని పాత్రలో ఆకట్టుకుంది. అంద చందాలతో పాటు నటనతోనూ సినీ అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో వచ్చిన పాపులారిటీ వరుస అవకాశాలను దక్కించుకుంది. అయితే, ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఆమె కెరీర్ ముందుకు సాగలేకపోయింది. నెమ్మదిగా సినిమాలకు దూరం అయ్యింది. అదే సమయంలో ఆమె యాక్సిడెంట్ కావడంతో ఆపరేషన్ అయ్యింది. దీంతో సినిమాలను మానేసి ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టింది.
‘స్వయంభు’ సెట్స్ లోకి అడుగు పెట్టిన నభా
ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న నభా నటేష్ మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. తన గ్లామరస్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు సినిమాల్లో ఛాన్సులు అందుకుంది. తాజాగా యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘స్వయంభు’లో అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. నభా పీరియాడిక్ గెటప్ లో ‘స్వయంభు’ సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న వీడియోను చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిజానికి ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. నభా సెకెండ్ హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. లేదంటే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరో రెండు క్రేజీ ఆఫర్లు
అటు ప్రియదర్శి హీరోగా నటిస్తున్న చిత్రంలో నభా నటేష్ ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. హనుమాన్ సినిమా నిర్మాతగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరోవైపు మెగా ఫ్యామిలీ హీరోసాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలోనే నభా నటేష్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరు కలిసి ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా అప్పట్లో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత ఒకేసారి మూడు అవకాశాలను దక్కించుకుంది నభా నటేష్. మరి ఈ ముద్దుగుమ్మ సెకెండ్ ఇన్నింగ్స్ లో ప్రేక్షకులను ఏ రేంజిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూడు సినిమాల్లో ‘స్వయంభు’పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం మంచి హిట్ అందుకుంటే నభాకు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది. ఇక సినిమా పరిశ్రమలోనూ మంచి అకాశాలు దక్కించుకోవచ్చు.
Read Also: ఊహించని రీతిలో ‘కల్కి’ ప్రమోషన్, విడుదలకు ముందే ఓటీటీలోకి!