Lok Sabha Elections 2024: మైక్రోసాఫ్ట్ సంస్థ సంచలన విషయం వెల్లడించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో చైనా జోక్యం (China Plans to Disrupt Elections) చేసుకునే ప్రమాదముందని హెచ్చరించింది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశముందని తేల్చి చెప్పింది. కేవలం భారత్‌లోనే కాదు. అమెరికా, సౌత్ కొరియాలోని ఎన్నికల్లో ఇదే విధంగా జోక్యం చేసుకోవాలని కుట్రే చేస్తోందని వెల్లడించింది. AIతో జనరేట్ చేసిన కంటెంట్‌తో అందరినీ తప్పుదోవ పట్టించాలని చూస్తోందని స్పష్టం చేసింది. తైవాన్ అధ్యక్ష ఎన్నికల సమయంలో చైనా ఈ మేరకు ట్రయల్ రన్ కూడా చేసిందని ఇప్పటికే కొన్ని నివేదికలు తేల్చి చెప్పాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 64 దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ప్రపంచ జనాభాలో ఈ దేశాల వాటా 49%గా ఉంది. అంటే...ఎన్నికల ముందు దాదాపు సగం జనాభా అభిప్రాయాలను ప్రభావితం చేసేందుకు చైనా ప్లాన్ చేస్తోంది. మైక్రోసాఫ్ట్ ఇంటిలిజెన్స్ టీమ్‌ హెచ్చరికల ప్రకారం..చైనాకి చెందిన కొన్ని సైబర్ గ్రూప్‌లు ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. ఈ గ్రూప్‌లకి ఉత్తర కొరియాలోని మరి కొన్ని టీమ్స్‌ సపోర్ట్ చేయనున్నాయి. తమ దేశానికి అనుకూలంగా ఎన్నికల ఫలితాలను మార్చుకునేందుకు చైనా AI కంటెంట్‌ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయనుంది. చైనాకి చెందిన ఈ గ్రూప్‌లో అటు అమెరికాతో పాటు ఎన్నికలున్న అన్ని దేశాల్లోనూ ఇప్పటికే సైలెంట్‌గా క్యాంపెయిన్ మొదలు పెట్టాయని చెబుతోంది మైక్రోసాఫ్ట్. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టాయి. 


"గత కొద్ది నెలలు చైనా AI జనరేటెడ్ కంటెంట్‌తో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అటు అమెరికాతో పాటు ఎన్నికలు జరగనున్న భారత్‌లోనూ ఈ కంటెంట్‌తో ఓటర్ల అభిప్రాయాల్ని ప్రభావితం చేయాలని చూస్తోంది. గతేడాది కెంటకీలో ఓ ట్రైన్ పట్టాలు తప్పడానికీ చైనాయే కారణం. అంతకు ముందు మయూలో కార్చిచ్చులు రగలడానికి, జపాన్‌లో న్యూక్లియర్ వేస్ట్‌వాటర్ ప్రాజెక్ట్‌, అమెరికాలో డ్రగ్స్ వినియోగం వరకూ...ఇలా అన్ని విషయాల్లోనూ చైనా జోక్యం చేసుకుంది"


- మైక్రోసాఫ్ట్