Krishna Mukunda Murari Today Episode సంగీత, ఆదర్శ్‌ ఒక్కటవ్వడానికి తాను సాయం చేస్తాను అని మీరా అంటుంది. ఆదర్శ్‌తో మీ కూతురు బాధ్యత నాది అని మీరా రజినితో చెప్తుంది. అయితే అవసరం బట్టి అప్పుడప్పుడు ఆదర్శ్‌తో చనువుగా ఉంటాను అని ఫీలవ్వొద్దు అని చెప్తుంది. సంగీత తన తల్లితో మీరాని చూస్తే అనుకున్నది చేసేలా ఉంది అంటుంది.


మరోవైపు కృష్ణ మురారిలు బయట నుంచి వస్తారు. ఆదర్శ్‌ తాగుతూ ఉండటం చూస్తారు. ఆదర్శ్‌ చెప్పినా వినడు అని వెళ్లిపోదామని కృష్ణ అంటే నేను మాట్లాడుతా అని మురారి అంటాడు. కృష్ణని లోపలికి వెళ్లిపోమని అంటాడు.


మురారి: ఇంక ఎన్నాళ్లు ఇలా.. సరే నువ్వు నాతో మాట్లాడవు అని నాకు తెలుసు. కనీసం నేను చెప్పేది విను. ఇదిగో నేనేం తప్పు చేయలేదు అని చెప్పడానికి నేను రాలేదు. చెప్పినా నువ్వు వినవు అని తెలుసు. ఆదర్శ్‌ పెద్దమ్మ ప్రతి రోజు నువ్వు ఇలా తాగడం చూస్తే బాధ పడుతుంది. నా కోసం కాకపోయినా పెద్దమ్మ కోసం ఆలోచించు. భవాని పై నుంచి చూస్తుంటుంది. ఇక మీరా కూడా అక్కడికి వస్తుంది.
ఆదర్శ్‌: మందు గ్లాస్ విసిరేసి కోపంతో.. ఆవిడ నీకు పెద్దమ్మ అయితే నాకు అమ్మరా నువ్వు నాకు నీతులు చెప్పొద్దు. 
మురారి: అవునురా నీకు అమ్మ నీకే ఎక్కువ హక్కు ఉంది. నీకే బాధ్యత కూడా ఉంది. ఆ బాధ్యత ఆలోచించి ఇలా అవ్వకు అంటున్నా..
ఆదర్శ్‌: ఏంట్రా ఆలోచించేది నువ్వు కృష్ణ కలిసి నా జీవితం నాశనం చేసేశారు. పోరా ఇక్కడి నుంచి పోరా.
మీరా: మనసులో.. ఆదర్శ్‌ మురారి మీద చాలా కోపం పెంచుకున్నాడు ఎలా అయినా పోగొట్టాలి. 
ఆదర్శ్‌: రేయ్ నువ్వు ఉన్న ఈ ఇంట్లో ఉంటున్నాను చూడు అందుకు నాకు నేనే ఏదో ఒకటి చేసుకోవాలి అని ఉందిరా. అరేయ్ అయినా నాకు ఇంత ద్రోహం చేసి నా ముందుకు నువ్వు ఎలా వస్తున్నావ్ రా.. నీ ప్లేస్‌లో నేను ఉంటే నేను ఉండను. నేను ఉండనురా నీ కోసం నేను ప్రాణాలు ఇస్తా కానీ ఇంత నమ్మక ద్రోహం చేయనురా. కానీ పొరపాటున ఉండాల్సి వస్తే పొరపాటున కూడా నా ముఖం నీకు చూపించేవాడిని కాదురా ఎక్కడికో వెళ్లిపోయేవాడిని. నీకు సిగ్గులేదురా అందుకే నా ముందు నిల్చొంటున్నావ్. రేయ్ నా కళ్ల ముందు తిరగకురా.. నేను నీ ప్లేస్‌లో ఉండి ఉంటే నేను ఈ ఇంట్లోనే ఉండే వాడిని కాదు. గుర్తుపెట్టుకో.
మీరా: బాధ పడకండి మేడం. వాళ్లిద్దరినీ కలిపే బాధ్యత నాది తప్పకుండా చేస్తా మేడం.
భవాని: ప్రయత్నించు కానీ ఎక్కువ కష్టపడకు. వాడి వల్ల మురారి, కృష్ణలకు నష్టం ఏమీ లేదు. వాడు మారితేనే నేను మాట్లాడుతా..
మీరా: కానీ నేను అంత వరకు ఆగలేను. మురారిని మంచిగా చూపించి కృష్ణని మాత్రమే చెడ్డదానిలా చిత్రీకరిస్తా.


మురారి కృష్ణ దగ్గరకు వచ్చి బాధ పడతాడు. ఇక ఆదర్శ్‌కి ముకుంద మీద కోపం ఉండాలి కానీ మన మీద ఎందుకు అని కృష్ణ అడుగుతుంది. మురారి కూడా ముకుంద మీద ఆదర్శ్‌కి అభిప్రాయం ఎలా మారిందా అని ఆలోచిస్తాడు. అయితే కృష్ణ మీరా ముకుంద గురించి ఆదర్శ్‌కి పాజిటివ్‌గా చెప్పి మార్చేసుంటుంది అని అభిప్రాయ పడుతుంది. మీరానే ఆదర్శ్‌ని పొల్యూట్ చేస్తుందని కృష్ణ మురారితో చెప్తుంది. దీంతో మురారి కూడా ఆలోచనలో పడతాడు. 


ఇక మురారి తన బట్టలు సర్దుకొని కృష్ణని కూడా సర్దుకోమంటాడు. మనం ఈ ఇంట్లో ఉండటం లేదు అని వెళ్లిపోతున్నాం అని చెప్తాడు. అందర్ని వదిలి వద్దు అని కృష్ణ అంటుంది. ఎవరి గురించి ఆలోచించకుండా మురారి రమ్మని అంటాడు. కృష్ణ రాను అంటే సీరియస్ అవుతాడు. దీంతో కృష్ణ ఏం మాట్లాడకుండా లగేజ్ సర్దేస్తుంది. 


మరోవైపు మీరా ఆదర్శ్‌తో మాట్లాడుతా అంటుంది. మురారి గురించి అనవసరంగా కోపం పెంచుకున్నావ్ అని మీరా సర్దిచెప్తుంది. ఆదర్శ్‌ మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది. 
మీరా: కృష్ణ పెళ్లి జరిగిన కొన్ని రోజులకే మురారి, ముకుందల ప్రేమ గురించి తెలుసుకుంది. మురారి తన భార్య దగ్గర ఏదీ దాచకూడదు అని చెప్పాడు. కానీ ఆ కృష్ణ దాన్ని అక్కడితో వదిలేయకుండా లాగింది. నువ్వు ముకుంద సంతోషంగా ఉండాలి అన్నది మురారి ఆశ. కానీ విషయం తెలుసుకున్న కృష్ణ ముకుందని అవహేళన చేసింది. నువ్వు ప్రేమలో ఓడిపోయావు లూజర్ అని అవహేళన చేసింది. ఆ సమయంలో మురారి మనసులో కృష్ణ లేదు. కాంట్రాక్ట్ మ్యారేజ్ కదా..  మురారిని మార్చేస్తా అంటూ తన ప్రేమలో పడేస్తా అని ముకుంద అహాన్ని ఇంకా పెంచేసింది. 
ఆదర్శ్‌: అవునా ఇంత టార్చర్ చేసిందా నాకు తెలీదు. 
మీరా: మీకు ఎలా తెలుస్తుంది. పెళ్లి రోజు పారిపోయారు కదా.. మురారి మీకు ఆదర్శ్‌ని కలపాలి అనుకుంటే కృష్ణ చెడగొట్టేది. పెళ్లి చేసుకున్న వాడు ఓ వైపు ప్రేమించిన వాడు మరో వైపు ఎదురుగా ఉంటే ఏ ఆడపిల్ల అయినా ఇలాగే చేస్తుంది. ముకుంద పతనానికి చావుకి అన్నీంటికీ కృష్ణ కారణం. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇందులో నీ తప్పు ఉంది. ఓ సమయంలో ముకుంద మీ కోసమే ఎదురు చూసింది కానీ మీరు రాలేదు. తను ఎప్పుడూ మీరు మురారి కలిసి ఉండాలి అనే చూసేది. నేను చెప్పాల్సింది చెప్పా ఇందులో మీరు ఏం అర్థం చేసుకుంటారో మీ ఇష్టం. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ ఇంట్లో దీప, హారతిచ్చి స్వాగతం పలికిన పారిజాతం.. అమ్మమ్మ తాతయ్యలతో సౌర్య ఆటలు!