Seethe Ramudi Katnam Today Episode: మధుమిత సూసైడ్ చేసుకోవడానికి నిద్ర మాత్రలు మింగేసి చావుతో పోరాడుతుంది. ఈ విషయం చెప్పడానికి రామ్ అర్చన, గిరిధర్‌లకు కాల్ చేస్తే సీత కావాలని వాళ్లని ఉడికించడానికి చేస్తుంది అనుకొని ఇద్దరూ ఫోన్లు స్విఛ్‌ ఆఫ్ చేసుకుంటారు. ఇక రామ్ చలపతికి ఫోన్ చేసి మధుని కాపాడమని చెప్తే తాను రేవతిని తీసుకొని షాపింగ్‌కు వచ్చానని అంటాడు. దీంతో రామ్ కంగారు పడతాడు. చలపతి, రేవతిలు కూడా ఇంటికి బయల్దేరుతారు.


మధు: అయిపోయింది సీత. నేను వెళ్లిపోతున్నాను.. నా టైం దగ్గర పడిపోయింది. ఇక నా చేతుల్లో ఏం లేదు సీత. మళ్లీ జన్మంటూ ఉంటే మనం మనస్ఫర్ధలు లేని అక్కా చెల్లెల్లుగా ఉందాం. నేను బాలేను సీత నా బతుకు బాలేదు సీత. నాకు ఇలా బతకాలి అని లేదు సీత. నువ్వు అయినా బాగుండాలి అని కోరుకుంటున్నాను. గుడ్ బాయ్ సీత..
రామ్: సీత మనం వెంటనే ఇంటికి వెళ్లాలి. ఎవరూ అందుబాటులో లేరు. త్వరగా వెళ్లాలి పద సీత.. అందరూ ఇంటికి పరుగులు తీస్తారు.  అర్చన వాళ్లు తెలియక నవ్వుకుంటారు. మధుమిత స్ఫృహా కోల్పోయి పడిపోయి ఉంటుంది. మధుకి సీత కంటిన్యూగా ఫోన్ చేస్తుంటుంది. రామ్ సీతలు ఇంటికి పరుగులు తీస్తారు. వాళ్ల వెనకే అర్చన, గిరిధర్‌లు వెళ్తారు. ఏదో అయింది ఇద్దరూ టెన్షన్ పడుతున్నారు అనుకుంటారు.


ఇక సీత రామ్ ఇద్దరూ మధుని లేపితే మధు లేవదు. విషయం తెలిసి అర్చన, గిరిధర్‌లు షాక్ అయిపోతారు. రామ్ మధుని ఎత్తుకొని హాస్పిటల్‌కి  పరుగులు తీస్తాడు. ఇక సాంబ తెలియక తానే మందులు తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్తే అర్చన సాంబని కొట్టబోతుంది. రామ్ మధుని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. సూసైడ్ చేసుకుంది అని తెలియడంతో డాక్టర్ ట్రీట్మెంట్‌కి నిరాకరిస్తుంది. రామ్ రిక్వెస్ట్ చేయడంతో ఓకే అంటుంది. 


అర్చన: మధు సేప్‌ కదా రామ్.. తనకి ఏం కాదు కదా..
సీత: మా అక్కకి ఏమైతే మీకు ఎందుకు ఇంట్లో మా అక్కని కాపాడకుండా ఇక్కడి వరకు తీసుకొచ్చారు. మీరు మనుషులు కాదు రాక్షసులు..
గిరిధర్: మాటలు జాగ్రత్త సీత. మధుని ఇన్నాళ్లు మేం కంటికి రెప్పలా చూసుకున్నాం. అసలు నువ్వు ఫోన్ చేస్తావ్ అనుకోలేదు రామ్. నీ ఫోన్‌తో సీత చేస్తుంది అనుకున్నాం.
అర్చన: అసలు నీ వల్లే మేం ఫోన్ ఎత్తలేదు. ఎప్పుడు నువ్వు రామ్‌తో బయటకు వెళ్లినా కవ్వించినట్లు మమల్ని ఉడికించినట్లు ఫొటోలు, వీడియోలు తీసుకొని మాకు చూపిస్తావ్ కదా.. అలాగే అనుకున్నాం. ఇక అందరూ గొడవ పడడంతో సిస్టర్ వచ్చి గొడవ చేయొద్దు అంటుంది.


మరోవైపు మహాలక్ష్మి ముంబయిలో బిజినెస్‌ మీటింగ్‌ ఉంటుంది. మీటింగ్ సక్సెస్ అవడంతో మహాలక్ష్మి, జనార్థన్ మాట్లాడుకుంటారు. తమ కంపెనీ వ్యవహారాలు చూసుకోవడానికి మధుమిత బెటర్ అని, కాస్త ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది అని మహాలక్ష్మి అంటుంది. తర్వాత మధు, రామ్‌లను ముంబయి బ్రాంచ్‌లకు పంపిచేద్దామని అంటుంది. మధు, రామ్‌ల గురించి తెలుసుకోవడానికి మహా అర్చనకు కాల్ చేస్తుంది. దీంతో అర్చన భయపడుతుంది. 


మహాలక్ష్మి: ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం ఎందుకు.
అర్చన: సారీ మహా. 
మహాలక్ష్మి: ఏంటి టెన్షన్‌గా ఉన్నారు. ఎక్కడున్నారు.
అర్చన: హాస్పిటల్‌లో ఉన్నాం.
మహాలక్ష్మి: ఎందుకు ఎవరికి ఏమైంది.
అర్చన: మధు నిద్ర మాత్రలు తీసుకుంది మహా. 
మహాలక్ష్మి: వాట్..
గిరిధర్: అవును వదిన మధు సూసైడ్ చేసుకుంది. 
మహాలక్ష్మి: నేను ఒక్కరోజు అక్కడ లేకపోయే సరికి అంతా తలకిందుల చేసేశారు. అసలు మధు ఎందుకు సూసైడ్ చేసుకుంది. ఛా.. మధుకి ఏమైనా జరిగితే నేను లైఫ్ లాంగ్ నేను సీతకు తల వంచాలి జనా. అది నా కోడలు అని ఒప్పుకోవాలి.  మధు బతకాలి. నాకోసం అయినా బతికి తీరాలి. 


డాక్టర్ వచ్చి మధు స్లీపింగ్ పిల్స్ ఎక్కువ తీసుకుంది అని కండీషన్ సీరియస్ అని చెప్తుంది. కొంచెం తొందరగా తీసుకొచ్చుంటే బాగుండేది అంటుంది. ఇక అర్చన వేరే పెద్ద హాస్పిటల్‌కి షిఫ్ట్ చేద్దామంటే ట్రీట్మెంట్‌ మధ్యలో వద్దుని రామ్ అంటాడు. అర్చన, గిరిధర్‌లను సీత తిడితే ఇదంతా నీ వల్లే అని అర్చన, గిరిధర్‌లు రివర్స్ అవుతారు. ఇక సీత వాళ్లని చంపేస్తానని ఎదురు తిరుగుతుంది. రామ్ సీతని తిట్టి బయటకు తీసుకెళ్లిపోతాడు. ఇంతలో రామ్‌కి మహ కాల్ చేస్తుంది. డాక్టర్ గ్యారెంటీ లేదు అని చెప్పడంతో ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు అని డాక్టర్ చెప్పమని ఈవినింగ్ వచ్చేస్తామని మహా చెప్తుంది. ఇక సీత మహాలక్ష్మితో కూడా మాట్లాడుతుంది. మా అక్కకి ఏమైనా అయితే మీ అందర్ని చంపేస్తానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: సత్యని ఇంప్రెస్ చేయడానికి హీరోలా రెడీ అయిన క్రిష్‌.. మొగుడు పెళ్లాల గిల్లిగజ్జాలు అదుర్స్!