పోస్టల్ బ్యాలెట్లపై సీఈవో ఆదేశాలు కరెక్టే
పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో వైసీపీ నేతలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ అభ్యంతరాలపై ఈసీ రిప్లై ఇచ్చింది. డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి, సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేస్తూ లేఖ పంపింది. పోస్టల్ బ్యాలెట్లను వాలీడ్ చేయాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేిసంది. ఏపీ సీఈవోకు లేఖ రాసిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇంకా చదవండి
తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పు
తెలంగాణ అధికారిక చిహ్నం మార్పు ప్రతిపాదన దృష్ట్యా.. ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు గురువారం ఉదయం చార్మినార్ వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతం లోగో నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు పద్మారావు గౌడ్, రాజయ్య, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఇతర పార్టీ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి చార్మినార్ వద్ద నిరసనకు దిగారు. అటు, కాకతీయ కళాతోరణం వద్ద కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశారు. భాగ్యనగర ప్రగతి కనిపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. ఇంకా చదవండి
తెలంగాణ కొత్త చిహ్నం ఆవిష్కరణ వాయిదా
తెలంగాణ కొత్త అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. ఏకాభిప్రాయం రాకపోవడమే కారణమని భావిస్తున్నారు. పలు డిజైన్లు పరిశీలించినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేయలేదు. చివరికి సంప్రదింపులు కొనసాగిస్తూ.. చిహ్నం ఆవిష్కరణ వాయిదా వేయాలని నిర్ణయించారు. రెండో తేదీన కేవలం తెలంగాణ గేయాన్ని మాత్రమే ఆవిష్కరించే అవకాశం ఉంది. ప్రజలు, ప్రజాజీవితం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా రూపొందించాలని రేవంత్ భావిస్తున్నారు. ఇందులో చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తారని స్పష్టమయింది. వీటిని రేవంత్ రాచరిక పోకడలుగా చెబుతున్నారు. ఇంకా చదవండి
'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' - స్టిక్కర్ల వార్ షురూ, ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు!
జూన్ 4.. కౌంటింగ్ డే. అంతటా ఒకటే ఉత్కంఠ. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?. 'జగనే మళ్లీ సీఎం' అంటూ వైసీపీ నేతలు, శ్రేణులు ప్రమాణస్వీకారానికి ముహూర్తం సైతం ఫిక్స్ చేశారు. అటు, కూటమి శ్రేణులు సైతం విజయం తమదే అని.. చంద్రబాబు (Chandrababu) సీఎం అవుతారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాష్ట్రమంతా ఫలితాలు ఒక ఎత్తైతే.. పిఠాపురం (Pithapuram) నియోజకవర్గం మరో ఎత్తు. ఎందుకంటే ఇక్కడ జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బరిలో నిలవడమే. వైసీపీ తరఫున వంగాగీత (Vanga Geetha) పోటీ చేశారు. కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇరు పార్టీల ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు. ఫలితాలు రాక ముందే తమ పార్టీ అభ్యర్థే ఎమ్మెల్యే అంటూ హోరెత్తిస్తున్నారు. ఇంకా చదవండి
కౌంటింగ్ రోజు కూడా నియోజకవర్గానికి దూరంగా అధినేతలు
ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గరపడుతోంది. గెలుపుపై అధికార, ప్రతిపక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాలు, సభలు, సమావేశాలతో బిజీ బిజీగా గడిపిన పలు పార్టీల అధినేతలు విశ్రాంతి కోసం విదేశాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లిపోయారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) కుటుంబంతో సహా లండన్ పర్యటనకు వెళ్లగా, టీడీపీ అధినాయకుడు చంద్రబాబు (Chandrababu Naidu) దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుని విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కుటుంబంతో సహా రష్యా వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా చదవండి