జగన్ సహా ఐపీఎస్ అధికారిపై కేసు నమోదు


ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) సహా ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌లపై (Sunil Kumar) గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీసులు వైసీపీ అధినేత జగన్, సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై కేసు ఫైల్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజద్రోహం చట్టం కింద తనను అరెస్ట్ చేసి వేధించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరితో పాటు మరికొందరు అధికారుల పేర్లనూ ఆయన ప్రస్తావించారు. కస్టడీకి తీసుకున్న సమయంలో తనపై దాడి చేశారని.. హత్యాయత్నం చేశారని చెప్పారు. తప్పుడు నివేదికలు ఇచ్చారని అన్నారు. ఇంకా చదవండి


కాంగ్రెస్‌లో చేరేందుకు క్యూ కడుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు


బీఆర్‌ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే 14 మంది ప్రజాప్రతినిధులు పార్టీ మారగా... ఇప్పుడు మరికొందరు అదే లైన్‌లో ఉన్నారు. ఇవాళ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శనివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హస్తం గూటికి చేరనున్నారు. ఇదే బాటలో మరో ఆరేడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారనే టాగ్ బలంగా వినిపిస్తోంది. పార్టీ నేతల వలస కట్టడికి బీఆర్‌ఎస్ అధినాయకత్వం చేస్తున్న కట్టడి ఎలాంటి ఫలితం ఇవ్వడం లేదు. ఫిరాయింపులు నిరోధించేందుకు కోర్టుల్లో పోరాటం, నేతలను బుజ్జగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ప్రభావం చూపడం లేదు. ఇంకా చదవండి


పిఠాపురంలో తొలిసారిగా ఆ ప్రాజెక్ట్


చెత్త నుంచి కూడా సంపద సృష్టించి ఆదాయం పెంచుకునేలా మార్గాలు అన్వేషించే లక్ష్యంతో సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ (SLRM Project) చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. తాడేపల్లిలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో గురువారం ఆ శాఖపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తొలిసారి కార్యాలయానికి వచ్చిన ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పవన్ సందర్శించారు. అనంతరం ఎస్ఎల్ఆర్ఎం వర్క్ షాప్‌లో పాల్గొన్నారు. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు.. భీమవరం, పిఠాపురం, గొల్లప్రోలులో ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నట్లు వివరించారు. డ్రైనేజ్ టు డైమండ్ అనే కాన్సెప్ట్‌తో ఈ ప్రాజెక్టును రూపొందించారని ఎల్ఎల్ఆర్ఎం రిసోర్స్ ప్రతినిధి శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఇంకా చదవండి


వైసీపీకి వైఎస్ఆర్‌కు సంబంధం లేదు - షర్మిల కీలక వ్యాఖ్యలు


వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాంతం కాంగ్రెస్ లోనే ఉన్నారని ఆయనకు వైఎస్ఆర్‌సీపీకి సంబంధం లేదని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రకటించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం నెల రోజుల పాలనపై విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ విగ్రహాలపై ఏపీలో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.  వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీ నాయకుడి గా రెండు సార్లు  గెలిచారన్నారు.  అలాంటి వ్యక్తి విగ్రహాలను టీడీపీ గూండాలు ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు.  వైసిపి కక్ష పూరిత చర్యలు చేసి ఉండొచ్చు . .మేము కాదనడం లేదు..కానీ వైఎస్ఆర్ ను దానికి బాద్యుడి నీ చేస్తే ఎలా అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్‌సీపీకి వైసీపీకి సంబంధం లేదన్నారు.  Ysr కాంగ్రెస్అంటే యువజన శ్రామిక రైతు పార్టీ ..వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదు... ఆయన కూ  వైసిపి కూ ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇంకా చదవండి


బీజేపీలో చేరనున్న బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు


తెలంగాణలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఓ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు క్యూ కట్టగా.. మరో వైపు పార్టీకి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. కేటీఆర్, హరీష్ రావు వారం రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. వారు ఎవరితో చర్చలు జరిపారో స్పష్టత లేదు కానీ.. అత్యున్నత స్థాయి రాజకీయవర్గాలు మాత్రం.. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేపీలో చేరడానికి ఒప్పందం జరిగిపోయిందని చెబుతున్నారు. ఇంకా చదవండి