Sharmila clarified that YSRCP is not related to YCP :   వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాంతం కాంగ్రెస్ లోనే ఉన్నారని ఆయనకు వైఎస్ఆర్‌సీపీకి సంబంధం లేదని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రకటించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం నెల రోజుల పాలనపై విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ విగ్రహాలపై ఏపీలో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.  వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీ నాయకుడి గా రెండు సార్లు  గెలిచారన్నారు.  అలాంటి వ్యక్తి విగ్రహాలను టీడీపీ గూండాలు ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు.  వైసిపి కక్ష పూరిత చర్యలు చేసి ఉండొచ్చు . .మేము కాదనడం లేదు..కానీ వైఎస్ఆర్ ను దానికి బాద్యుడి నీ చేస్తే ఎలా అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్‌సీపీకి వైసీపీకి సంబంధం లేదన్నారు.  Ysr కాంగ్రెస్అంటే యువజన శ్రామిక రైతు పార్టీ ..వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదు... ఆయన కూ  వైసిపి కూ ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. 


YSRCPలో  వైఎస్ఆర్ అంటే చాలా మంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుకుంటారు.కానీ  యువజన, శ్రమిక, రైతు కాంగ్రెస్ పార్టీ. ఈ అంశంపై గతంలో ఈసీకి కూడా ఫిర్యాదులు అందాయి. షార్ట్ కట్‌లో వైఎస్ఆర్ అని పిలుస్తూండటం వల్ల .. తన పార్టీకి ఇబ్బంది అని మరో పార్టీ నేతలు పిటిషన్ వేశారు. దీంతో వైసీపీ నాయకులు తమ లెటర్ ప్యాడ్లపై యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని రాయడం ప్రారంభించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తమ పార్టీకి మూల పురుషుడిగా పేర్కొంటూ వైసీపీ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆయనే వైసీపీని స్థాపించినట్లుగా ప్రచారం చేస్తూంటారు. అయితే వైఎస్ చనిపోయేవరకూ కాంగ్రెస్ పార్టీలో సీఎంగా ఉన్నారు. 


మొదట్లో జగన్, షర్మిల కలిసే ఉన్నప్పుడు వివాదం రాలేదు కానీ షర్మిల ఇప్పుడు ఏపీ పీసీసీ  చీఫ్ గా ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వం తమదేనని అంటున్నారు. వైఎస్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వాది అని గుర్తు చేస్తున్నారు. ఇటీవల వైఎస్ 75వ జయంతిని కూడా ఘనంగా నిర్వహించారు. సందర్భం వచ్చినప్పుడల్లా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అని.. వైసీపీకి సంబంధం లేదని పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. 


వైఎస్ విగ్రహాలపై మరోసారి దాడి చేస్తే తానే  స్వయంగా అలాంటి చోటికి ధర్నా చేస్తానని షర్మిల హెచ్చరించారు.  ఇలాంటి కక్ష పూరిత రాజకీయాల వల్లే వైసీపీ భూస్థాపితం అయ్యిందనీ టీడీపీ గుర్తు పెట్టుకోవాలని ప్రెస్‌మీట్‌లో సలహా ఇచ్చారు.  చంద్రబాబు  ప్రకటించిన సూపర్ 6 లో మహిళలకు ఫ్రీ బస్ వాగ్దానం పై ఇంకా ఉలుకూ పలుకూ లేదు.. ఇది మంచి పథకం కాబట్టే తెలంగాణ కర్ణాటక ల్లో అమలవుతోందన్నారు. తెలంగాణ లో అధికారం లోకి వచ్చిన నెల లోపే..కర్ణాటక లో మూడో వారం లోపే ఈ పథకాన్ని కాంగ్రెస్ అమలు చేసిందని..  ఈ చిన్న పథకాన్ని అమలు చేయడానికి చంద్రబాబు కు ఇంత టైం ఎందుకు పడుతుందో నాకు అర్ధం కావడం లేదన్నారు.  తల్లికి వందనం వాగ్దానం అందరి పిల్లలకూ అన్నారు..కానీ జీవో లో మాత్రం ప్రతీ తల్లికీ 15000 అన్నారని..  ప్రతీ తల్లి కే 15000 ఇస్తారా.. ప్రతీ బిడ్డ కూ 15000 ఇస్తారా... చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలని కోరారు.