SCR Four Trains Timings Changed: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) పరిధిలోని నాలుగు రైళ్ల ప్రయాణ సమయాలు మారుస్తున్నట్లు అధికారులు తెలిపారు. సింహపురి, పద్మావతి, నారాయణాద్రి, నాగర్‌సోల్ ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు చేస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ 18వ తేదీ నుంచి మారిన టైమింగ్స్ అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. 


రైళ్ల వేళల్లో మార్పులు



  • సికింద్రాబాద్ - గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్ ప్రెస్ (12710)లో గమ్యస్థానం చేరేందుకు ప్రస్తుతం 10.35 గంటలు పడుతోంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి రాత్రి 11:05 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9:40కు గూడూరు చేరుతుంది. అయితే, మారిన ప్రయాణ వేళల ప్రకారం రాత్రి 10:05 గంటలకు సికింద్రాబాద్‌లో ప్రారంభమై ఉదయం 8:55 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. గతం కంటే ప్రయాణ సమయం ఓ 15 నిమిషాలు పెరగనుంది. ఈ రైలు విజయవాడకు వేకువజామున 3:35కి చేరుతుంది.

  • అలాగే, సికింద్రాబాద్ - తిరుపతి పద్మావతి ఎక్స్ ప్రెస్ (12764) రైలు ప్రయాణ వేళలు గూడూరు స్టేషన్ నుంచి మారనున్నాయి. గూడూరుకు తెల్లవారుజామున 4:43కి బదులుగా 4:19కి చేరుకుంటుంది. తిరుపతి స్టేషన్‌కు ఉదయం 6:55కు చేరుకుంటుంది. గతంలో తిరుపతి స్టేషన్‌కు 7:15కి చేరుకునేది. 

  • అటు, లింగంపల్లి - తిరుపతి నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ (12734) సాయంత్రం 6:25కి బదులుగా సాయంత్రం 5:30కి బయలుదేరనుంది. ఉదయం 5:55 గంటలకు తిరుపతి చేరుకోనుంది. గతంలో ఉదయం 7 గంటలకు తిరుపతి చేరుకునేది. ఈ రైలు ప్రయాణ సమయం 12:35 గంటల నుంచి 12:25 గంటలకు తగ్గనుంది. ప్రయాణ సమయం 10 నిమిషాలు ఆదా కానుంది.

  • నర్సాపూర్ నుంచి మహారాష్ట్రలోని నాగర్‌సోల్‌కు వెళ్లే నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ (17231) ప్రయాణ సమయం 10:30 నుంచి 9:40కి తగ్గనుంది. ప్రస్తుతం రాత్రి 11:15 కు బయల్దేరి ఉదయం 9:45కి చేరుకుంటుండగా కొత్త టైమింగ్స్ ప్రకారం రాత్రి 9:50కి బయల్దేరి ఉదయం 7:30కి చేరుకుంటుంది.


పలు రైళ్ల దారి మళ్లింపు


అటు, విజయవాడలో రైల్వే ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో కాజీపేట - విజయవాడ - విశాఖ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లించారు. దాదాపు 30 రైళ్లను విజయవాడ స్టేషన్‌కు రాకుండా నగర శివార్లలోని బల్బ్ లైన్ మీదుగా విశాఖ మార్గంలోకి మళ్లించనున్నారు. ఆగస్ట్‌లో దాదాపు 10 రోజుల పాటు హైదరాబాద్ - విశాఖ మధ్య ప్రయాణించే రైళ్లు విజయవాడ రాకుండా దారి మళ్లిస్తారు. ఈ రైళ్లన్నీ విజయవాడ నగర శివార్లలోని రాయనపాడు మీదుగా రాజేశ్వరిపేట, అయోధ్యనగర్, మధురానగర్, గుణదల మీదుగా రామవరప్పాడు లైన్‌లో ప్రయాణిస్తాయి.


సికింద్రాబాద్ - విశాఖపట్నం (12740), ఓఖా - పూరీ (20820), షిర్డినగర్ - విశాఖపట్నం (18504), విశాఖపట్నం - షిర్డిసాయినగర్ (18503), షిర్డినగర్ - కాకినాడ పోర్ట్ (17205), గాంధీనగర్ - విశాఖపట్నం (20804), హైదరాబాద్ - విశాఖపట్నం (12728), విశాఖపట్నం - సికింద్రాబాద్ (12739), నిజాముద్దీన్ - విశాఖపట్నం (12804), చత్రపతి శివాజీ టెర్మినల్ - భువనేశ్వర్ (11019), న్యూఢిల్లీ - విశాఖపట్నం (20806),  విశాఖ - న్యూఢిల్లీ (20805), యశ్వంత్ పూర్ - టాటా (18112), హైదరాబాద్ - షాలిమార్ (18046), షాలిమార్ - హైదరాబాద్ (18045), విశాఖ - నిజాముద్దీన్ (12803), నర్సాపూర్ - నాగర్ సోల్ (12787), నాగర్ సోల్ - నర్సాపూర్ (12788), లోకమాన్య తిలక్ - విశాఖ (18520), బీదర్ - మచిలీపట్నం (12759) రైళ్లను ఆగస్ట్ 2 నుంచి 10 మధ్య దారి మళ్లిస్తారు.


Also Read: Tirumala : తిరుమల క్యూలైన్లలో తమిళ ఆకతాయిల ప్రాంక్ వీడియోలు - వార్నింగ్ ఇచ్చిన టీటీడీ