irumala prank Video Row :  అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో ప్రాంక్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో వైరైల్ చేస్తున్నారు తమిళనాడుకు చెందిన యువకులు. ఈ వీడియోలు వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు టీటీడీ దృష్టికి తీసుకెళ్లారు. 


 





 


ఈ వీడియోలపై టీటీడీ తీవ్రంగా ఖండించింది.  భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా  ప్రాంక్ వీడియోలు తీయడం హేయ మైన చర్య .. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.   క్యూ లైన్ లో దర్శనానికి వెళ్తూ కొందరు తమిళ  యూట్యూబర్లు భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా   ప్రాంక్ వీడియోలు తీశారు.  నారాయణగిరి షెడ్స్ లోని క్యూ లో వెళ్తూ మరో కంపార్టుమెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కొందరు యూట్యూబర్లు ఒక ప్రాంక్ వీడియో ని రూపొందించగా, కంపార్ట్మెంట్ లో నిరీక్షిస్తున్న భక్తులు ఆ తాళాలు తీసే వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి  ఒక్కసారిగా పైకి లేవగానే వెంటనే కంపార్టుమెంట్ నుంచి వెకిలిగా నవ్వుతూ పరుగులు పెట్టే ఆ యూట్యూబర్ వీడియో  సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా తమిళనాట వైరల్ అయ్యింది.  





 


సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రవేశించక ముందే భక్తులనుండి మొబైల్స్  డిపాజిట్ చేయడం జరుగుతుంది. నిత్యం భక్తుల గోవింద నామాలతో మారుమ్రోగే  తిరుమల కంపార్ట్మెంట్లలో, వారి మధ్యనే ఉండి ఒకరిద్దరు ఆకాతాయీలు చేసిన ఈ  వికృత చేష్టలతో భక్తుల మనోభావాలు  దెబ్బ తిన్నాయి.  ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ హెచ్చరించింది.                                     


క్యూ లైన్లలోకి వచ్చే దగ్గర నుంచి దర్శనానికి వెళ్లే వరకూ పలు రకాలుగా చెక్ చేసి ఫోన్లు ఉంటే స్వాధీనం  చేసుకుంటారు. అయితే.. వారు ఎలా ఫోన్లు తీసుకెళ్లగరిగారన్నది  తెలియాల్సి ఉంది. గతంలో ఓ సారి  ఆలయం లోపల కూడా వీడియో తీసిన వ్యవహారం సంచలనం అయింది.