Brahmamudi Serial Today Episode: దుగ్గిరాల కుటుంబంలో అపర్ణ, సుభాష్‌ల పెళ్లిరోజును చాలా గ్రాండ్‌గా చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా నిర్వహిస్తుంటారు. ఫన్నీ గేమ్స్‌తో అందరూ హ్యపీగా ఎంజాయ్‌ చేస్తుంటారు. ఒక్కొక్క జంట కళ్లకు గంతలు కట్టుకుని ఒకరు బోర్డు మీద రాసింది మరోకరు చెప్పాలనే గేమ్‌ ఆడుతుంటారు. సుభాష్‌ రాసింది, అపర్ణ చెప్తుంది. అపర్ణ రాసింది సుభాష్‌ చెప్తాడు. తర్వాత ధాన్యలక్ష్మీ, ప్రకాష్‌ వస్తారు. ధాన్యలక్ష్మీ రాసింది ప్రకాష్‌ చెప్పలేకపోతాడు. కానీ ప్రకాష్‌ రాసింది ధాన్యలక్ష్మీ చెప్తుంది. తర్వాత రాజ్‌ కావ్య చెప్పాలని వాళ్లకు గంతలు కడతారు.


ప్రకాష్‌: నాన్న రాజ్‌ మీరు మొదటి సారి ఎక్కడ కలుసుకున్నారు.


సుభాష్‌: ఆలోచించకుండా రాయాలని మాకు రూల్స్‌ పెట్టావు కదా రాయి..


ప్రకాష్‌: నువ్వు చెప్పమ్మా కావ్య ఇప్పుడు


కావ్య: నా సైకిల్‌ను కారుతో గుద్దినప్పుడు నేను కారు అద్దం పగులగొడుతుంటే అప్పుడు కారులోంచి దిగారు.


అపర్ణ: రాజ్‌ నువ్వు ఓడిపోయావురా?


రాజ్‌: అవును మమ్మీ..


ప్రకాష్‌: ఇప్పుడు కావ్య రాస్తుంది. రాజ్‌ చెప్తాడు. కావ్య నువ్వు రాజ్ కు పెట్టిన నిక్‌నేమ్‌ ఏటి?


కావ్య: మామయ్య అది రాస్తే ఎవరికైనా కోపం వస్తుందేమో..


ప్రకాష్‌: ఓరేయ్‌ రాసేసింది చెప్పరా ఇప్పుడు..


రాజ్: మిస్టర్‌ డిఫెక్ట్‌..


 ప్రకాష్‌: ఓ కరెక్టుగా చెప్పావురా..?


   అంటూ అందరూ హ్యాపీగా గేమ్‌ ఆడుతుంటే కళ్యాణ్‌ డల్లుగా కూర్చుని ఉంటాడు. అది గమనించిన కావ్య కవిగారు ఎలా ఉన్నారు చూడండి వెంటనే ఏదో ఒకటి చేయాలని డాన్స్‌ రౌండ్‌ అని కళ్యాణ్‌ను పిలుస్తాడు రాజ్‌. కళ్యాన్‌ ఇప్పుడు నేను చేయనని ముందు అమ్మా నాన్న చేస్తారని తర్వాత నేను చేస్తానని చెప్పడంతో రాజ్‌, ప్రకాష్‌, ధాన్యలక్ష్మీని పిలుస్తాడు. వాళ్లిద్దరూ వచ్చి డాన్స్‌ చేస్తారు. తర్వాత రాహుల్‌, స్వప్న చేశాక, కళ్యాణ్‌ వచ్చి సాడ్‌ సాంగ్‌ పెట్టుకుని డాన్స్‌ చేస్తూ కిందపడిపోతాడు. అందరూ కంగారుగా ఏమైందని అడుగుతారు.


కావ్య: కవిగారు ఏమైంది కవిగారు


అపర్ణ: ఏం నాన్నా ఏమైంది.


కళ్యాణ్‌: ఏమైంది ఫర్పామెన్స్‌ చేశాను అంతే కదా? క్లాప్స్‌ కొట్టరా నాకు. ఏంటి నేను నిజంగా ఏడుస్తున్నాను అనుకుంటున్నారా? సాంగ్‌ అలాంటిది. నా ఫర్పామెన్స్‌ మీకెవ్వరికీ నచ్చలేదా?  నా టాలెంట్‌కు ఎవ్వరూ క్లాప్స్ కొట్టరా?


కావ్య: బాగుంది కవిగారు చాలా బాగుంది.


కళ్యాణ్‌: థాంక్యూ వదిన సరే ఇప్పటి నుంచి నేను హోస్ట్ చేస్తాను మీరు కూర్చోండి. ఇప్పుడు రుద్రాణి అత్తా..


ప్రకాష్‌: ఏయ్‌ రుద్రాణి కమాన్‌..


రాహుల్‌: చూడు డాన్స్‌ అంటే అలా ఉంటుంది.


రుద్రాణి కుర్చీ మడత పెట్టి సాంగ్‌కు డాన్స్‌ చేస్తుంది. రుద్రాణినికి తోడుగా ప్రకాష్‌ కూడా స్టెప్పులేస్తాడు.


స్వప్న: రాహుల్‌ ఏమాటకు ఆ మాటే చెప్పాలి. మీ అమ్మా డాన్స్‌ సూపర్‌..


రాహుల్‌: మరి ఏమనుకున్నావు మా మమ్మీ అంటే


స్వప్న: అవును నువ్వు కూడా కొంచెం నేర్చుకో పోయి.


రాహుల్‌: మమ్మీ సూపర్‌ అదరగొట్టేశావు.


కళ్యాణ్‌: ఓకే ఇక లాస్ట్‌ లో మిగిలింది అన్నయ్యా వదిన.. రండి అన్నయ్యా రండి వదిన..


ఇందిరాదేవి: రాజ్‌ ఒకసారి ఇక్కడకు రా.. ఓరేయ్‌ నీ ప్రేమను చెప్పడానికి ఇదే మంచి అవకాశం వెళ్లి చెప్పరా..


అనగానే రాజ్‌, కావ్య వెళ్లి డాన్స్‌ చేస్తారు. తర్వాత కళ్యాన్‌ వచ్చి ఇప్పుడు పెద్దమ్మా పెద్దనాన్నా కేక్‌ కట్‌ చేస్తారు అని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: 25 ఏళ్ల అమ్మాయితో 56 ఏళ్ల రవితేజ రొమాన్స్ - మిస్టర్ బచ్చన్ సాంగ్ ట్రోలర్‌కు ఇచ్చి పారేసిన హరీష్ శంకర్