chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: మిత్ర పక్కన ఉన్న పాప ఎవరని లక్ష్మీ ఆలోచిస్తుంటుంది. మిత్రకు కూతురు పుట్టే అవకాశమే లేదని మరి ఆ పాప ఎవరని లక్ష్మీ అనుకుంటుంది. ఇక లక్ష్మీ దగ్గరకు జున్ను వచ్చి తనని స్కూల్‌కి డ్రాప్ చేయమని అంటాడు. ఇంతలో అర్జున్ వచ్చి మీ అమ్మ బిజీగా ఉందని అంటాడు. ఇక అర్జున్‌తో లక్ష్మీ జున్నుని డ్రాఫ్ చేసి తర్వాత వేరే పని చూసుకొని వస్తానని అంటుంది. ఇక అర్జున్ మిమల్ని స్కూల్‌ దగ్గర డ్రాఫ్ చేసి వెళ్తానని అంటాడు. జాను లక్ష్మీకి కాల్ చేసి కంకణం కట్టావా అని అడుగుతుంది. లక్ష్మీ అయిపోయింది అని అంటుంది.


లక్ష్మీ: నేను మిత్ర గారికి కంకణం కట్టడానికి వెళ్లాను కానీ ఓ కొత్త అనుమానంతో ఇంటికి తిరిగి వచ్చాను. మిత్ర గారి పక్కన నిద్ర పోతున్న ఓ చిన్నపాపని చూశాను. ఆ పాప ఎవరు.
జాను: అదేంటి ఆ పాప ఎవరో నీకు తెలీదా. 
లక్ష్మీ: నాకు ఎలా తెలుస్తుంది జాను. అసలు ఆ పాప అసలు మిత్ర గారితో ఎందుకు పడుకుంది. 
జాను: నీకు తెలిసే ఉంటుందని నేను అనుకున్నాను. నన్ను ఇంత ఫాలో అయ్యావ్. బావగారి గురించి తెలుసుకున్నావ్. అలాంటిది బావగారి ఇంట్లో ఉన్న పాప గురించి తెలీదా.
లక్ష్మీ: జాను నేను స్కూల్‌ బయల్దేరుతున్నాను తర్వాత కాల్‌ చేస్తా.


దేవయాని రాత్రి ఇంట్లో ఎవరో వెళ్లిన మనిషి గురించి ఆలోచిస్తుంది. మనీషా రాత్రి ఇంట్లోకి వచ్చింది లక్ష్మీ అని చెప్తుంది. కచ్చితంగా వచ్చింది లక్ష్మీ అని కంకణం కట్టింది కూడా లక్ష్మీనే అని మనీషా చెప్తుంది. అబద్ధం చెప్పించారని అంటుంది. మిత్ర పడుకున్నప్పుడు చేతికి కంకణం లేదని లక్కీ కూడా ముందే నిద్రపోయిందని కాబట్టి వచ్చింది లక్ష్మీనే అని అంటుంది. మిత్రకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవడానికి లక్ష్మీ మిత్ర చుట్టే తిరుగుతుంటుందని అంటుంది. ఈ విషయం గురించి కచ్చితంగా తెలుసుకోవాలని అంటుంది. లక్ష్మీని మిత్ర చూసి నిలదీస్తే తన బండారం బయట పడిపోతుందని అప్పుడు తనని ఇంటి నుంచి గెంటేస్తాడని అంటుంది. ఈలోపే మిత్రతో తన పెళ్లి అయిపోవాలని అంటుంది. 


మిత్ర స్కూల్‌కి లక్కీని తీసుకొచ్చి జానుని అప్పగిస్తాడు. లక్ష్మీ కూడా వస్తుందని తను మిత్రని చూస్తే ఇబ్బందని జాను టెన్షన్ పడుతుంది. అర్జున్‌ని లక్ష్మీ వెళ్లిపోమని తనకి వేరే పని ఉందని చెప్పడంతో మా మధ్య బంధం ఏంటని లక్ష్మీ మనసులో ఏముందో తెలుసుకోవాలని అర్జున్ అనుకుంటాడు. ఇక లక్కీ లక్ష్మీదగ్గరకు వెళ్లి హగ్ చేసుకుంటాడు. లక్ష్మీ జానుతో మాట్లాడుతా అంటే తన తండ్రి కూడా జాను టీచర్‌తో మాట్లాడుతున్నాడని లక్కీ చెప్తుంది. మిత్ర జాను దగ్గర నుంచి వెళ్లి పోతాడు. లక్ష్మీ జాను దగ్గరకు వెళ్తూ మిత్రని చూస్తుంది. మిత్ర తనని చూడకుండా దాక్కుంటుంది. ఇక మిత్ర ఓ టీచర్‌తో మాట్లాడుతాడు. ఇక టీచర్‌ చేతికి కంకణం గురించి అడిగితే తన కూతురు కట్టిందని మిత్ర అంటాడు. ఇక లక్ష్మీ కంకణం కట్టింది నేను అయితే తన కూతురు అని చెప్పారేంటని అనుకుంటుంది. 


లక్ష్మీ: నా మనసులో వంద ప్రశ్నలు ఉన్నాయి జాను. మిత్ర గారి ఇంట్లో ఒక పాప ఉంది ఏంటి. తనని అందరూ మిత్ర గారి కూతురు అంటున్నారేంటి. అసలు తను ఎవరు.
జాను: ఆ పాప మీ ఇంటికి కూడా వచ్చింది. తను జున్నుకి కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్. అలాంటి అమ్మాయి నీకు తెలీయకపోవడం ఏంటి. తను నీకు ఇప్పటికే తెలిసుండాలి. 
లక్ష్మీ: అసలు ఎవరు తను.
జాను: జున్ను, లక్కీల వైపు చూపించి.. మిత్ర గారి కూతురు తనే అని లక్కీని చూపిస్తుంది. 
లక్ష్మీ: నువ్వు లక్కీ గురించి మాట్లాడుతున్నావా.
జాను: అవునక్కా లక్కీనే మిత్ర గారి కూతురు.
లక్ష్మీ: అంటే ఇన్ని రోజులు జున్ను వెళ్లింది మిత్ర గారి ఇంటికా. జున్ను పోట్లాడింది మిత్ర గారితోనా.. 


మిత్ర లక్కీకి జాగ్రత్తలు చెప్తాడు. జున్ను, మిత్ర మాటల యుద్ధం మొదలవుతుంది. ఇక లక్కీతో మీ నాన్నకి కాసేపు కూడా ప్రేమగా మాట్లాడటం తెలీదా అని అడుగుతాడు. ఇద్దరూ క్లాస్‌కి వెళ్తుంటే లక్ష్మీ లక్కీని చూస్తూ ఉండిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవి టీచరే రామ్ ప్రాణాలు కాపాడిన సుమతి అని తెలుసుకున్న సీత!