'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షో స్టార్ట్ అయ్యి నెల కూడా కాలేదు. కానీ, ఆల్రెడీ దీని మీద ఆడియన్స్ చూపు పడిందంటే కారణం అనసూయ అండ్ గర్ల్స్ అని చెప్పాలి. లాంచ్ ఎపిసోడ్ ప్రోమోలో అనసూయ బ్లేజర్ విప్పడం వివాదాస్పదం అయ్యింది. ఆ వీడియో పక్కన పెడితే... ప్రతి ఎపిసోడ్ కొత్త కొత్త కాంట్రవర్సీలతో వీక్షకులు చూపు పడేలా చేసుకోవడంలో షో సక్సెస్ అవుతోంది.
అనసూయతో శ్రీకర్ గొడవ!
Anasuya Vs Srikar Brahmamudi fight: ఈ శని, ఆది వారాల్లో టెలికాస్ట్ అయ్యే 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' ఎపిసోడ్స్ ఫుల్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమో ఎండింగ్‌లో అనసూయ, 'బ్రహ్మముడి' ఫేమ్ శ్రీకర్ గొడవ షో మీద క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.
విలేజ్ థీమ్ బేస్డ్ టాస్కుల్లో భాగంగా మ్యూజికల్ ఛైర్స్ తరహా గేమ్ ఒకటి కండక్ట్ చేశారు. ఇక్కడ కుర్చీల బదులు గంపలు ఉన్నాయి. ఒకరు గంప తీసుకోవాలి. ఆ టాస్కులో 'బ్రహ్మముడి' ఫేమ్ శ్రీకర్, నటి పల్లవి గౌడ మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో అనసూయ అభిప్రాయం కోరాడు శ్రీకర్. అప్పుడు జడ్జిని క్వశ్చన్ చేసే రైట్ అతడికి లేదంటూ అనసూయ సీరియస్ అయ్యింది. చివరకు ఏమైందో షోలో చూడాలి.
Also Read: రష్మీ గౌతమ్, నూకరాజు గొడవకు కారణం ఇంద్రజ యేనా - చికెన్ ముక్క, గుడ్డు కోసం రోహిణి రచ్చ
విష్ణు ప్రియా... రికార్డింగ్ డ్యాన్స్ మానలేదా?
Vishnu Priya Bhimeneni awkward moment: విలేజ్ థీమ్ కనుక షోలో ఖిలాడీ గర్ల్ అందరూ పల్లెటూరి అమ్మాయిల తరహాలో డ్రస్సులు వేసుకుని వచ్చారు. విష్ణు ప్రియ భీమనేని సైతం పల్లెటూరి పడుచులా చీర కట్టుకున్నారు. అయితే, ఆమె దగ్గరకు వెళ్లిన శ్రీముఖి 'అమ్మాయ్ నువ్ ఇంకా రికార్డింగ్ డ్యాన్సులు మానలేదా?' అని అడగటంతో విష్ణు ప్రియ షాక్ అయ్యింది.
యాంకర్ శ్రీముఖి, అర్జున్ అంబటి మధ్య సీన్ అయితే ఎవరూ ఊహించలేనిది. అతడి కండలు బావున్నాయని, తనను ఎత్తుకోమని శ్రీముఖి కోరగా... అతడు వీపు మీద ఎక్కింది. షో స్టార్టింగ్ నుంచి అమ్మాయిల విషయంలో శేఖర్ మాస్టర్ మీద అర్జున్ అంబటి పంచ్ డైలాగ్స్ వేస్తున్నారు. ఈసారి శేఖర్ మాస్టర్ గోకితే ఏ అమ్మాయి అయినా సరే నంబర్ ఇస్తుందని పంచ్ వేశాడు. అతడు ఆ డైలాగ్ చెబుతుంటే శేఖర్ మాస్టర్ ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. ప్రజెంట్ ఈ ప్రోమో ట్రెండింగ్ అవుతోంది.