Trinayani Today Episode తిలోత్తమ సర్పదీవి నుంచి వచ్చిన తర్వాత గంటలమ్మ దగ్గర తాంత్రిక విద్య నేర్చుకోవడానికి తన చేతిని, తనతో పాటు వచ్చిన పాములా ఉన్న ఉలూచి తోకను కాల్చేస్తుంది. ఆ విషయం హర్ష ద్వారా నయని తెలుసుకొని తిలోత్తమ ఒంటరిగా ఉన్నప్పుడు నిలదీస్తుంది. ఇక సుమన ఉలూచికి తిలోత్తమ వల్లే కాళ్లకు దెబ్బ తగిలింది అన్న నెపంతో తిలోత్తమ దగ్గర నుంచి ఆస్తి కొట్టేయాలని పేపర్లు రెడీగా ఉంచుకుంటుంది. తన తల్లి ఆస్తి ఇస్తే గుండు చేసుకుంటానని విక్రాంత్ సుమనతో ఛాలెంజ్ చేస్తాడు. ఇక ఉదయం అందరూ హాల్‌లో ఉంటారు. గురువుగారు ఇంటికి వస్తారు.
విశాల్: అనుకోకుండా వచ్చి మమల్ని సంతోష పడేలా చేశారు స్వామి.
గురువుగారు: అనుకోకుండా రాలేదు విశాలా. మీ మరదలు కబురు పంపింది.
సుమన: అవును స్వామి వారు వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం అవ్వదని అనిపించింది. ఆస్తి ఇప్పించాలి అని స్వామి వారిని ఇంటికి రప్పించాను.
గురువుగారు: సుమన మీ కుటుంబ విషయాల్లో నా జోక్యం ఎందుకు.
విశాల్: సుమన డబ్బు, ఆస్తి ఇలాంటి విషయాల్లో ఆయన్ను ఇబ్బంది పెట్టడం సరికాదు.
సుమన: నా కూతురు పాదాలు కాలడానికి కారణం అయిన తిలోత్తమ అత్తయ్య ఆస్తిలో నాకు పావలా వాటా కావాలి అంటే ఎవరూ నాకు సపోర్ట్‌గా మాట్లాడలేదు.
తిలోత్తమ: సుమన సమయం వచ్చినప్పుడు నీకు సాయం చేస్తా అన్నాను కదా.
విక్రాంత్: ఆస్తి మొత్తం వస్తుందంటే పిల్ల బలి అయిపోయిన పర్వాలేదు అనుకుంటా.
నయని: అందరూ శాంతంగా ఉండండి. సుమన పరిహారం అడగటం అత్తయ్య ఇస్తాను అనడం అది వాళ్ల ఇద్దరి మధ్య ఉండే అవగాహన. దానికి ఎవరూ సపోర్ట్ చేయరు. అడ్డుకోరు. సుమన: మీరు ఎవరూ నాకు సపోర్ట్ చేయరు అనే ఎలాంటి కోరికలు ఆశలు లేని స్వామి వారిని పిలిచి న్యాయం చేయమని పిలిపించానక్క.
గురువుగారు: తిలోత్తమ సుమన అడిగినదాంట్లో స్వార్థం ఉన్నా సరే దానికి అర్థం ఉంది ఏమంటావ్.
తిలోత్తమ: మీరు మధ్యవర్తిత్వం వహిస్తే నేను అభ్యంతరం ఎలా చెప్పగలను స్వామి. కానీ ఓ చిన్న విన్నపం. సుమన రాసుకొచ్చిన డాక్యుమెంట్స్‌లో తిరకాసు ఉండొచ్చు. అందుకే మేం రాయిస్తాం.
గురువుగారు: తిలోత్తమ ఆలోచిన వేరుగా ఉంటుంది.
పావనా: అంటే సుమన అడిగిన అంత ఇవ్వదా అక్క.
వల్లభ: ఎంత అడిగితే అంత ఇస్తే రేపు ఇంకొకరు బ్లాక్‌మెయిల్ చేస్తారు.
తిలోత్తమ వల్లభకు పెన్ను పేపర్ తీసుకొచ్చి రాయమని చెప్తుంది. దాంతో వల్లభ తనకు చదువురాదు అని దిక్కులు చూస్తాడు. ఇక విక్రాంత్ రాయను అనేస్తాడు. విశాల్‌ని రాయొద్దని నయని అనేస్తుంది. హాసిని కూడా రాయను అనేస్తుంది. చివరకు దురంధర రాయడానికి సిద్ధం అవుతుంది.
గురువుగారు: మనసులో.. తిలోత్తమ జరగబోయే పరిణామాలకు దురంధరని ఇరికించాలి అని నువ్వు పన్నాగం పన్నావ్. తను రాయడం ఒక ఎత్తు అయితే అమ్మవారి రాత మరో ఎత్తు.
తిలోత్తమ: తిలోత్తమ అనే నేను గడిచిన కొద్ది రోజుల్లో సంపాదించిన 280 కోట్లలో పావాలా వంతు అంటే 70 కోట్లు విలువ గల ఆస్తిని నా చిన్న కోడలు ముక్కంటి పురం సుమనకు రాస్తున్నాను. అంటూ దురంధర తిలోత్తమ తెచ్చిన పేపర్ మీద రాస్తుంది. ఇక తిలోత్తమకు సంతకం పెట్టమని దురంధర పేపర్ ఇచ్చేస్తుంది. తిలోత్తమ సంతకం పెడుతుంది. డాక్యూమెంట్స్ జాగ్రత్త పోగొట్టుకొని మళ్లీ రాయమని చెప్తే మాత్రం రాయను అని తిలోత్తమ అంటుంది.
వల్లభ: హలో అది మిస్ అయితే ఆస్తిలో వాటా పోయినట్లే జాగ్రత్త.
పావనా: ఆ పేపర్లను ఉలూచి కంటే జాగ్రత్తగా చూసుకుంటుంది.
గురువుగారు: తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది.
తిలోత్తమ ఆరు బయట కూర్చొని ఉంటే వల్లభ అక్కడికి వస్తాడు. 70 కోట్లు పోయాయని బాధ పడుతున్నావా అని అడుగుతాడు. సుమనకు వాటా ఇవ్వకపోతే ఉలూచి కాళ్లు ఎందుకు కాలిపోయాయని ఆరా తీసి తన గుట్టు రట్టు చేస్తుందని అంటుంది. అయితే సుమనకు ఆస్తి ఇచ్చినప్పుడు ట్విస్ట్ ఇచ్చానని పేపర్లు పోతే మళ్లీ ఆస్తి ఇవ్వనన్నానని ఆ పేపర్ పోతే అని తిలోత్తమ అంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.