Trolls On Ravi Teja Age: మాస్ మహారాజా రవితేజ ఎనర్జీని మ్యాచ్ చెయ్యడం కష్టం అని ఆయనతో నటించిన ఆర్టిస్టులు చెప్పే మాట. ఆయనను చూస్తే వయసు అనేది గుర్తు రాదు. కానీ, ఓ నెటిజన్ ఆయన వయసును గుర్తు చేస్తూ ట్రోల్ చేశారు. 'మిస్టర్ బచ్చన్' సినిమాలో 'సితార్...' సాంగ్ రిలీజ్ అయ్యాక వచ్చిన ట్రోలర్‌కు దర్శకుడు హరీష్ శంకర్ గట్టిగా ఇచ్చి పడేశాడు.
25 ఏళ్ల అమ్మాయితో 56 ఏళ్ల రవితేజ స్టెప్స్!
Sitar Song Ravi Teja: 'సితార్...' సాంగ్ చూస్తే... హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే నడుము మీద, బ్యాక్ మీద రవితేజ చేతులు వేసి స్టెప్స్ వేశారు. 'బిల్లా' సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క మధ్య ఇంచు మించు ఆ తరహా స్టెప్ ఒకటి ఉంది. అప్పట్లో ఆ స్టెప్ మీద ఎవరు కామెంట్ చేయలేదు అనుకోండి. ఇప్పుడు భాగ్య శ్రీతో రవితేజ స్టెప్ వెయ్యడం నెట్టింట ఒకరికి నచ్చలేదు.
''25 ఏళ్ళ భాగ్య శ్రీ బోర్సేతో 56 ఏళ్ళ రవితేజ డ్యాన్స్ స్టెప్స్ వేస్తున్నాడు. కనీసం ఆ హీరోయిన్ ఫేస్ చూపించాలని కూడా ఫిల్మ్ మేకర్ (దర్శకుడు హరీష్ శంకర్)కి అనిపించలేదు. ఎందుకు అంటే... ఆ అమ్మాయి బాడీని చూపించాలని మాత్రమే అనుకున్నారు. ఆబ్జక్టిఫై చేశారు. తెలుగు సినిమాల్లో ఇది కామన్'' అని ట్వీట్ చేశాడు. అతడికి దర్శకుడు హరీష్ శంకర్ ఇచ్చి పడేశారు.
''మీరు డిస్కవరీ చేసిన విషయానికి కంగ్రాట్స్. మీరు నోబెల్ ప్రైజ్ కి అప్లై చేయాలి. మిమ్మల్ని స్వాగతిస్తున్నా. మీరు ఈ విధంగా మీ పని కంటిన్యూ చేయండి'' అని హరీష్ శంకర్ రిప్లై ఇచ్చారు.
రవితేజ మీద ట్రోల్స్ కొత్త కాదు కానీ...
రవితేజ మీద కొన్ని రోజులుగా ఇటువంటి రోల్స్ వస్తున్నాయి. ఆయన సినిమాల్లో హీరోయిన్లు వయసును కొందరు పాయింట్ అవుట్ చేస్తున్నారు. రవితేజ వయసు 50 ఏళ్ళు దాటితే అందులో కనీసం సగం వయసు ఉన్న అమ్మాయిలను ఎంపిక చేస్తున్నారని కొందరు ట్రోల్ చేస్తున్నారు. 'ధమాకా' సినిమాలో హీరోయిన్ శ్రీ లీల వయసు ఎంత? ఆడియన్స్ ఆ విషయం పట్టించుకోలేదు. సినిమా నచ్చితే ఆ కాంట్రవర్సీలు కేర్ చెయ్యడం లేదు. థియేటర్లకు వస్తున్నారు. 'మిస్టర్ బచ్చన్'కు మంచి టాక్ వస్తే జనాలు హిట్ చేస్తారు. అందులో సందేహం లేదు. మధ్యలో ఈ ట్రోలర్లకు రిప్లై ఇవ్వడం వల్ల వాళ్లకు అటెన్షన్ ఇవ్వడం తప్ప ప్రయోజనం ఉండదు.
Also Read: ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?