Manchu Vishnu Reaction on Praneeth Hanumanthu Issue: ప్రణీత్ హనుమంతు.. ప్రస్తుతం ఈ పేరు సెన్సేషన్‌గా అయ్యింది. యూట్యూబరైన అతడు తండ్రికూతురు రీల్‌పై అసభ్యకరంగా కామెంట్స్‌ చేసి సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యాడు. ఈ వ్యవహారంపై మొదట మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ స్పందించాడు. ప్రణీత్‌ హనుమంతుకు శిక్షించాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంలను ట్యాగ్‌ చేస్తూ ఫైర్‌ అయ్యాడు. దీంతో అతడి కామెంట్స్‌ సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ అతడిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.


ఇప్పటికే దీనిపై మంచు లక్ష్మి, మంచు మనోజ్, విశ్వక్ సేన్, నారా రోహిత్, 'శశివదనే' నిర్మాత అహితేజ బెల్లంకొండ సైతం ప్రణీత్ హనుమంతు వ్యాఖ్యలను ఖండించారు. అతడి మీద చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో అతడిపై పోలీసుల కేసు కూడా నమోదు చేయగా.. నేడు(జూలై 10) బెంగళూరు పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉంటే తాజా ప్రణీత్‌ హనుమంతు కామెంట్స్‌ హీరో, మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌(MAA) అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ప్రణీత్‌ కామెంట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా పలు యూట్యూబ్‌ ఛానళ్లుకు హెచ్చరిక కూడా చేశాడు. అంతేకాదు నటీనటులపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించాడు. అందరికి నమస్కరం. తెలుగు వాళ్లు అంటే మర్యాదస్తులు, మనం ట్రెడిషన్స్‌ ఫాలో అవుతామని ప్రపంచమంత అనుకుంటుంది.






కానీ, ఈ మధ్య కొంతమంది తెలుగు వాళ్లు, యూట్యూబ్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యరంగా ప్రవర్తించడం వల్ల వీళ్లు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనే అభిప్రాయాలు వస్తున్నాయి. రెండు, మూడు రోజుల క్రితం సాయి ధరమ్‌  తేజ్‌.. ప్రణీత్‌ హనుమంతు వీడియో స్పందించాడు. ఇతను ఎందుకిలా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియో గురించి వింటుంటూనే ఎంతో అసభ్యకరంగా ఉంది. ఆ చిన్నపిల్లకు నిండా రెండేళ్లు కూడా ఉండవు. అంత చిన్నపిల్లపై దారుణంగా మాట్లాడటం. అభ్యంతరకరంగా మాట్లాడుతూ నవ్వుకోవడం గురించి మాట్లాడుకుంటుంటూనే ఒళ్లు జలదరిస్తుంది. ప్రణీత్‌ కూడా ఓ ఉన్నతమైన కుటుంబం నుంచే వచ్చాడు. కానీ ఎందుకిలా చేయడం. ఇదే కాదు నటీనటులప కూడా ఇలాంటి అసభ్యకరంగా ట్రోల్‌ చేస్తున్నారు" అంటూ చెప్పుకొచ్చారు. 


"కామెడీ పేరుతో ఇలాంటి వీడియో చేయడం కరెక్ట్‌ కాదు. ఏకంగా నాకు బ్రహ్మనందం గారు ఫోన్‌ చేశారు. 'ఎన్నో కామెడీ మీమ్స్‌కి నా ఫోటో వాడుతారు.. అవి చూసి నేను ఆనందిస్తాను. కానీ, ఇలాంటి అసభ్యకరమైన వీడియోలకు కూడా నా పేరు వాడుతున్నారు. దీనిని ఆపాలి. మన తెలుగువాళ్ల సంస్కృతి ఇది కాదు' అని ఆయన చాలా బాధపడ్డారు. యూట్యూబ్‌ ఇలాంటి ట్రోలింగ్‌ వీడియో చేసేవారు, హీరోయిన్స్‌ని అసభ్యకరంగా ట్రోల్‌ చేసిన యూట్యూబ్‌ ఛానళ్లు ఆ వీడియో తొలగించాలి. ఇది నా సిన్సీయర్‌ రిక్వెస్ట్‌. ఈ వీడియో వచ్చిన 48 గంటల్లోగా నటీనటులను ట్రోల్‌ చేసిన వీడియోలన్ని తొలగించాలని. లేదంటూ వీటిపై నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వీడియోలు చేసే ప్రతి యూట్యూబ్‌ ఛానళ్లపై  సైబర్ సెక్యూరిటీ వాళ్లకు ఫిర్యాదు చేస్తాం. అంతేకాదు ఆ ఛానళ్లు బ్యాన్‌ అయ్యేలా చేస్తాం" అంటూ యూట్యూబ్‌ ఛానళ్ల నిర్వహకులను హెచ్చరించాడు. 


Also Read: ప్రణీత్ హనుమంతు అరెస్ట్ - ఏపీ, తెలంగాణలో కాదు... ఎక్కడ పట్టుకున్నారో తెలుసా?