68 Filmfare Awards south 2023: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంతో మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ (Jr NTR), గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోలు వచ్చిన మల్టీస్టారర్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR Movie)ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏకంగా సినిమా పలు విభాగాల్లో ఆస్కార్‌లో బరిలో నిలిచింది. ఇందులో నాటు నాటు పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ ఆస్కార్‌ గెలవడంతో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ పేరు ఇంటర్నేషనల్‌ వేదికలపై మారుమోగింది. ఒక్క ఆస్కార్‌తో పాటు మరెన్నో అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుని సత్తాచాటింది. ఇప్పటికీ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి అవార్డులు వస్తూనే ఉన్నాయి. తాజా 68వ ఫల్మ్‌ఫేర్‌ సౌత్ అవార్డులను ప్రకటించగా.. మరోసారి ఆర్‌ఆర్ఆర్‌ మూవీ సత్తాచాటింది. 


ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు విభాగాల్లో ఈ సినిమా ఫిల్మ్‌ఫేర్‌ సౌత్‌ అవార్డుకు ఎన్నికైంది. కాగా చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకమైన అవార్డులో ఫల్మ్‌ఫేర్‌ ఒకటి. తాజాగా ఈ ఫిల్మ్‌ఫేర్‌ సౌత్‌ (Filmfare Award South) అవార్డులను ప్రకటించా ఫల్మ్ ఫేర్‌ అవార్డులను ప్రకటించారు. దక్షిణాదిలో నాలుగు భాషల్లో 2023తో పాటు 2022లో థియేటర్లలో విడుదలైన చిత్రాలను కూడా లెక్కలోకి తీసుకుని ఈ అవార్డులని అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఈసారి మన తెలుగు చిత్రాలు ఆర్ఆర్ఆర్,  సీతారామం (Sita Ramam), విరాటపర్వం 2, 'భీమ్లా నాయక్' చిత్రాలు పలు విభాగాల్లో అవార్డుకు ఎన్నికయ్యాయి. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ఏడు విభాగాల్లో ఎన్నికై అవార్డు పంట పండించింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా ఏకంగా 7 అవార్డులతో సత్తాచాటగా.. సీతారామం సినిమాకు 5, విరాటపర్వం 2, 'భీమ్లా నాయక్'కి ఓ అవార్డు వరించింది. ఈ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులో ఆస్కార్‌ బరిలో నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్ లాంటి చిత్రానికి సీతారామం మూవీ అవార్డులో గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి.  మరి ఏఏ విభాగాల్లో ఎవరెవరికి ఈ అవార్డులు దక్కాయో ఒకసారి చూద్దాం!  


అవార్డు విన్నింగ్ జాబితా :


ఉత్తమ సినిమా - ఆర్ఆర్ఆర్


ఉత్తమ దర్శకుడు - ఎస్ఎస్ రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్‌)


ఉత్తమ మూవీ (క్రిటిక్స్) - సీతారామం (హను రాఘవపూడి)


ఉత్తమ నటుడు - రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)


ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - దుల్కర్ సల్మాన్  (సీతారామం)


ఉత్తమ నటి - మృణాల్ ఠాకుర్ (సీతారామం)


ఉత్తమ నటి (క్రిటిక్స్) - సాయిపల్లవి (విరాటపర్వం)


ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)


ఉత్తమ నటి - నందితా దాస్ (విరాటపర్వం)


ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - కీరవాణి (ఆర్ఆర్ఆర్)


ఉత్తమ లిరిక్స్ - సిరివెన్నెల సీతారామశాస్త్రి - కానున్న కల్యాణం (సీతారామం)


ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (పురుషుడు) - కాల భైరవ (ఆర్ఆర్ఆర్‌లోని కొమురం భీముడో పాటక)


ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (ఫిమేల్‌) - చిన్మయి శ్రీపాద (సీతారామం - ఓ ప్రేమ..)


ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్ - నాటు నాటు పాట)


ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (ఆర్ఆర్ఆర్)


Also Read: 'ఇండియన్ 2' ఫస్ట్ రివ్యూ... ఆడియన్స్‌లో బజ్ తక్కువే కానీ సూపర్ హిట్ రిపోర్ట్!