Kamal Haasan Indian 2 First Review In Telugu: లోకనాయకుడు కమల్ హాసన్, సౌత్ ఇండియన్ స్టార్ ఫిల్మ్ మేకర్ శంకర్ షణ్ముగం కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా సినిమా 'ఇండియన్ 2'. తెలుగు ప్రేక్షకుల ముందుకు 'భారతీయుడు 2' (Bharateeyudu 2)గా, హిందీలో 'హిందుస్తానీ 2'గా తీసుకు వస్తున్నారు. జూలై 12... అంటే ఈ శుక్రవారం భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల అవుతోంది. మరి, బజ్ సంగతి ఏంటి? ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది? అనేది చూస్తే... 


2024లో పవర్ ఫుల్ ఫిల్మ్ 'ఇండియన్ 2'
'ఇండియన్ 2'కు సెన్సార్ బోర్డు 'యు/ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా రన్ టైమ్ 180.04 మినిట్స్! అంటే... అక్షరాలా మూడు గంటలు అన్నమాట. అటు చెన్నై, ఇటు హైదరాబాద్ నుంచి ఫస్ట్ రివ్యూ రాలేదు. దుబాయ్ నుంచి వచ్చింది. తనకు తాను సెన్సార్ బోర్డు మెంబర్ అని చెప్పుకొనే సోషల్ మీడియా సెన్సేషన్ ఉమైర్ సందు తెలుసు కదా! అతడు సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో 'ఇండియన్ 2' రివ్యూ షేర్ చేశాడు. 


'ఇండియన్ 2'ను వారం క్రితమే చూశానని ఉమైర్ సందు పేర్కొన్నాడు. ''సెన్సార్ బోర్డులో ఇప్పుడే 'ఇండియన్ 2' చూశా. మైండ్ బ్లోయింగ్'' అని జూలై 3న ట్వీట్ చేశారు. అతడు బుధవారం రాత్రి మళ్ళీ 'ఇండియన్ 2' గురించి ట్వీట్ చేశారు. ''ఈ ఏడాది వచ్చిన పవర్ ఫుల్ సినిమా ఇది. వారం క్రితమే చూశా. మజా ఆగాయా'' అని ఉమైర్ పేర్కొన్నాడు. సినిమాకు 3.5 రేటింగ్ ఇచ్చాడు. సాధారణంగా ప్రతి సిన్మా రిలీజ్ ముందు అతడు నెగెటివ్ రివ్యూలు ఇస్తూ పాపులర్ అయ్యాడు. కానీ, కమల్ 'ఇండియన్ 2'కు పాజిటివ్ రివ్యూ ఇవ్వడం విశేషం.


Also Read: 'సారంగ దరియా' ఫస్ట్ రివ్యూ - ట్రాన్స్‌జెండర్స్ మీద సెన్సిటివ్ టాపిక్ టచ్ చేస్తూ...










ఇంటర్వెల్ ముందు కమల్ హాసన్ ఎంట్రీ!
ఒక్క సినిమా అనుకుని రెండు భాగాలు చేయడంతో 'ఇండియన్ 2'లో ఉండాల్సిన కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ 'ఇండియన్ 3'లోకి వెళ్లింది. 'ఇండియన్ 2'లోనూ కొన్ని మార్పులు జరిగాయి. ఇంటర్వెల్ ముందు కమల్ హాసన్ క్యారెక్టర్ స్క్రీన్ మీద ఎంటర్ అవుతుంది. అప్పటి వరకు సిద్దార్థ్ కథను నడిపించనున్నారు. ఆయనకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ సందడి చేయనున్నారు.


Also Read25 ఏళ్ల అమ్మాయితో 56 ఏళ్ల రవితేజ రొమాన్స్ - మిస్టర్ బచ్చన్ సాంగ్ మీద ట్రోల్స్, గట్టిగా ఇచ్చి పారేసిన దర్శకుడు హరీష్ శంకర్



'ఇండియన్ 2' సినిమాలో గుల్షన్ గ్రోవర్, ఎస్.జె. సూర్య, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రామ్, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, నెడుముడి వేణు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కామెడీ కింగ్ బ్ర‌హ్మానందం అతిథి పాత్రలో సందడి చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. అతడి పాటలను రెహమాన్ 'భారతీయుడు 2' పాటలతో కంపేర్ చేయడంతో కొన్ని విమర్శలు వచ్చాయి.